
ఖైదీ చేతికి తుపాకీ!
ఒంగోలు : ఒంగోలు జిల్లా జైలు నుంచి ఓ ఖైదీని వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించడానికి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే వాహనం నడిపే కానిస్టేబులు తన తుపాకీ (వెపన్)ని మధ్యలో కూర్చున్న ఖైదీ చేదికిచ్చాడు. ఖైదీలను కోర్టులకు, ఆస్పత్రులకు తరలించేటప్పుడు వారు పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్న సంఘటనలు తరచూ సంభవిస్తున్నా ఖాకీల తీరు ఏమాత్రం మారలేదనడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం.