
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'గ్రోక్'. యూజర్లను తిడుతూ.. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఎంతోమందిని ఆకర్షించిన ఈ ఏఐ చాట్‌బాట్ ఒక వినియోగదారునికి ప్రత్యుత్తరం ఇస్తూ హిందీలో అసభ్య పదాలను ఉపయోగించడం ద్వారా భారతదేశ డిజిటల్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
ప్రశ్న ఏదైనా, హాస్యాస్పదమైన సమాధానాల కోసం అసభ్య పదాలను వినియోగిస్తున్న గ్రోక్.. రాజకీయాలు, రాజకీయ వ్యక్తులు, క్రికెట్, గాసిప్, బాలీవుడ్‌తో సహా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. దీంతో వివాదం ముదిరింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎలాన్ మస్క్ గ్రోక్ భారతదేశంలో సెన్సేషన్ సృష్టిస్తోంది అని బీబీసీ పేర్కొంది. దీనిపై మస్క్ స్పందిస్తూ.. బిగ్గరగా నవ్వుతున్న ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
— Elon Musk (@elonmusk) March 22, 2025
గ్రోక్‌పై ప్రభుత్వం సీరియస్
అసభ్య పదజాలంతో వినియోగదారులకు సమాచారం అందిస్తున్న.. గ్రోక్‌పై కేంద్రం సీరియస్ అయింది. దీంతో రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపరుస్తోందని అడిగింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా?