న్యూఢిల్లీ: కొన్ని సంఘటనలు చూస్తే మనం సినిమాల్లో చూసిన సీన్‌లు గర్తుకోస్తాయి కదా. అచ్చం అలాంట సంఘటనే ఒకటి ఇక్కడ చోటుచేసుకుంది. పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్శకి ఒక విచిత్రమైన మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏమిటంటే "సార్ నేను నా 18 ఏళ్ల స్కూల్ జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. అరిస్టాటిల్, బుద్ధుడు, వివేకానంద, న్యూటన్ వంటి ఎందరో ప్రముఖుల గురించి తెలుసుకున్నాను. నేను గనుక వ్యాపారం చేస్తే ఒక ట్రిలియన్ డాలర్ల వరకు డబ్బు సంపాదించగలను కానీ నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఇక వ్యాపారం ఎలా మొదలు పెట్టగలను.
(చదవండి: పీపీఎఫ్ కిట్లతో డ్యాన్స్)
టెక్స్‌టైల్, రియల్ ఎస్టేట్ వంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనే ఆలోచన ఉంది. మన జీవితంలో కుటుంబం, స్నేహితులు ఎంత ప్రధానమో డబ్బు కూడా అంతే ప్రధానమైనది." అంటూ చెప్పుకొచ్చాడు. ఆఖరికీ ఆ సదరు వ్యక్తి తాను ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఆటవస్తువుల కంపెనీ పెట్టాలనుకుంటున్నానని, దాని కోసమై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు కూడా సంప్రదించానని కానీ ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
పైగా భారత్‌లో అందరి దగ్గర డబ్బు లేదని కానీ అది ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర్నించి అసలు బయటకు రాదంటూ ఆవేదనగా చెప్పుకొస్తూ పేటీఎమ్ సీఈవో శేఖర్‌కి మెయిల్ చేశాడు. దీంతో శేఖర్ దాన్ని స్క్రీన్ షార్ట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటా ఆత్మవిశ్వాసం గల అబ్బాయిలను అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment