vijay shekar sharma
-
టాటాకు సంతాపం తెలుపుతూ ట్వీట్.. కాసేపటికే డిలిట్!
రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలుపుతూ పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. టాటా మరణవార్త విని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా టాటాకు సంతాపం ప్రకటించారు. అయితే తన ట్వీట్లోని చివరి లైన్లపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.‘భవిష్యత్తు తరం వ్యాపారులు టాటా ఇచ్చే సలహాలు, సూచనలను మిస్ అవుతారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ టాటా. సెల్యూట్ సర్.. ఓకే టాటా బైబై’ అని విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ చివరి లైన్ ‘ఓకే టాటా బైబై’పై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపటికే శర్మ ఆ పోస్ట్‌ను తొలగించారు.wtf is the last line pic.twitter.com/dOrIeMQH7c— Shivam Sourav Jha (@ShivamSouravJha) October 10, 2024ఇదీ చదవండి: టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్, సంజీవ్ గోయెంకా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, కుమారమంగళం బిర్లా, హిందుజా గ్రూప్ చైర్మన్. జీపీ హిందుజా, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ రాహుల్ భాటియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్సూకిమ్..వంటి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. -
లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ
పేటీఎం పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా ప్రకటించింది. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు కొత్త కొలువులు వచ్చేలా కంపెనీ మద్దతు ఇస్తుందని చెప్పింది.కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ మే నెలలో సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించారు. సంస్థ ఖర్చులు తగ్గించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెక్ కంపెనీకి ప్రధానంగా టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సాంకేతిక సదుపాయాలు), ఉద్యోగుల వేతనాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇటీవల పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మేనెలలో కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు కంపెనీ చెప్పింది. అయితే ఎంతమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించిందో మాత్రం తెలియజేయలేదు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్విజయ్శేఖర్ శర్మ మే 22న షేర్హోల్డర్లకు రాసిన లేఖలో..‘సంస్థ తన ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది. సంభావ్య తొలగింపులకు(పొటెన్షియల్ లేఆఫ్స్) సిద్ధమైంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం ద్వారా ఏటా రూ.400కోట్లు-రూ.500 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
Paytm: భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్
పేటీఎం షేర్ రోజురోజుకు దారుణంగా పడిపోతుంది. వరుసగా కేవలం నాలుగు రోజుల్లో దాదాపు 45 శాతం నష్టాలపాలయింది. తాజాగా సోమవారం 10 శాతం కంపెనీ షేర్లు నష్టపోయాయి. ఈరోజు 48.70 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం షేర్ ధర రూ.438.50 వద్దకు చేరింది. ఐదు రోజులకింద ఈ ధర రూ.760.65గా ఉండేది. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్లో తేలినందునే ఆర్బీఐ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విజయ్‌శేఖర్‌శర్మ స్పందిస్తూ పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో శర్మ పోస్ట్ చేశారు. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి సర్వీసులు అందించే ఆఫ్‌లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. 2021లో రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2,150 ఇష్యూ ధరతో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, రూ.10,000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో సేకరించింది. నవంబరు 18న ఎన్ఎస్ఈలో రూ.రూ.1,950 వద్ద, బీఎస్ఈలో రూ.1,955 వద్ద నమోదైంది. అదే రోజున రూ.1,560 కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు షేరు సుమారు 77 శాతం నష్టపోయినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం.. విజయ్ శేఖర్ శర్మ 2009లో ప్రారంభించిన పేటీఎంకు మొదటినుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. విజయ్ అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్‌మా, సాఫ్ట్‌బ్యాంక్ నుంచి నిధులు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచి పేటీఎంకు కొంత లాభాలు వచ్చాయి. ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకు మారి, పేటీఎంను అధికంగా వినియోగించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో విజయ్‌కు 51 శాతం ఉండగా, మిగతాది ఒన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధీనంలో ఉంది. -
యాంటిఫిన్ వాటా కొనుగోలు.. రూ. 53,957 కోట్లకు చేరిన పేటీఎం వ్యాల్యూ
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండు ఫిన్‌టెక్ దిగ్గజం.. వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనుంది. యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్స్ నుంచి 10.3 శాతం వాటాను విజయ్ సొంతం చేసుకోనున్నట్లు పేటీఎం తాజాగా పేర్కొంది. ఇందుకు ఎలాంటి నగదు చెల్లింపు ఉండదని, ఆఫ్‌మార్కెట్ లావాదేవీ ద్వారా వాటా బదిలీ ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ వాటా ఎకనమిక్ రైట్స్ యాంట్‌ఫిన్ వద్దనే కొనసాగుతాయని వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా విదేశీ సొంత సంస్థ రెజిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ ద్వారా వాటాను శర్మ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. దీనికి బదులుగా మార్పిడికి వీలయ్యే(ఆప్షనల్లీ కన్వర్టిబుల్) డిబెంచర్లను యాంట్‌ఫిన్‌కు రెజిలియంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీ కారణంగా కంపెనీ యాజమాన్య నియంత్రణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ లావాదేవీతో పేటీఎంలో శర్మ వాటా 19.42 శాతానికి చేరనుంది. వెరసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలవనున్నారు. మరోపక్క యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పేటీఎం బోర్డులో యాంట్‌ఫిన్ నామినీ ఉండబోరు. యాంట్‌ఫిన్.. చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ అనుబంధ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. షేరు జూమ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనున్న వార్తల నేపథ్యంలో ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం కౌంటర్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 7 శాతం జంప్‌చేసి రూ. 851 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 888కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,511 కోట్లు ఎగసి రూ. 53,957 కోట్లను అధిగమించింది. -
పేటీఎం నుంచి పాకెట్ సౌండ్ బాక్స్.. దీంతో ఏం చేయొచ్చంటే
హైదరాబాద్: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వర్తకుల కోసం రెండు వినూత్న చెల్లింపుల సాధనాలను విడుదల చేసింది. 4జీ ఆధారిత పేటీఎం పాకెట్ సౌండ్ బాక్స్, పేటీఎం మ్యూజిక్ సౌండ్ బాక్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్ అనేది చెల్లింపుల ఆధారిత తొలి పోర్టబుల్ పరికంగా కంపెనీ పేర్కొంది. డెబిట్ కార్డ్ పరిమాణంలో పాకెట్లో పట్టేస్తుందని, డ్రైవర్లు, డెలివరీ, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఇప్పటికే మార్కెట్లో ఉన్న పేటీఎం సౌండ్‌బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని వెంట తీసుకెళ్లడం సౌకర్యంగా ఉండదు. తరచూ వాహనాలపై ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, పేటీఎం మ్యూజిక్ సౌండ్‌బాక్స్ అనేది వర్తకులకు చెల్లింపుల సమాచారాన్ని వాయిస్ రూపంలో వినిపించడమే కాకుండా, బ్లూటూత్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యూజిక్ వినడం, మ్యాచ్ కామెంటరీ వినొచ్చని పేటీఎం తెలిపింది. వర్తకుల సౌకర్యం కోసమే ఈ రెండు ఉత్పత్తులను తీసుకొచ్చినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఇందులో పాకెట్ సౌండ్‌బాక్స్ చెల్లింపుల పరిశ్రమలో ఎంతో మార్పును తీసుకొస్తుందన్నారు. ఈ ఏడాది జూన్ చివరికి పేటీఎంకు 79 లక్షల సౌండ్‌బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ల చందాదారులు ఉన్నారు. -
పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!
ఓ కాలేజీ కుర్రాడికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఆ ఆలోచనకు సృజనాత్మకతను జోడించాడు. ఎంతో కష్టపడి పనిచేశాడు. అంతే ఆ బిజినెస్ పెద్ద హిట్ అయ్యింది. ఇదిగో సక్సెస్ అయిన ప్రతి కంపెనీ గురించి విన్నా, లేదంటే ఎవరైనా చెప్పినా..క్రియేటీవ్ థాట్స్ ఉండాలి. ఎవరూ స్టార్ట్ చేయని బిజినెస్ నేను స్టార్ట్ చేస్తే 100 శాతం అది క్లిక్ అవుతుంది’ అని చాలా మంది నమ్ముతారు. కానీ అది కరెక్ట్ కాదని అంటున్నారు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ. నిత్యం మనంరోజూ వారి జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపించే బిజినెస్ ఐడియాతో వందల కోట్లు సంపాదించవచ్చని చెబుతున్నారు. అలాగే తనకు ఎదురైన ఓ సమస్యతో పేటీఎం బిజినెస్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఓ సమావేశంలో వెల్లడించారు. పేటీఎంకు చిన్న సైజు ఏటీఎం పేటీఎం లాంటి యూపీఐ పేమెంట్స్ యాప్స్ వచ్చినప్పుడు వాటిని నమ్మడం చాలా కష్టమైంది. ఆ తర్వాత ఫోన్ పే, గూగుల్ పేలాంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక పేటీఎం అప్ అండ్ డౌన్స్ గురించి వినే ఉంటున్నాం. వాటిల్లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే? మనం కిరాణా షాపులు, పాన్ షాపుల్లోకి వెళితే ఓ డబ్బా నుంచి రిసీవ్డ్ అమౌంట్ ఆఫ్ సో అండ్ సో అనే ఆడియో వినపడుతుంది కదా. అది బ్రాండింగ్ కోసం పెట్టారని అనుకుంటాం. కానీ అది బ్రాండింగ్ కోసం పెట్టిన బాక్స్ కాదు. పేటీఎంకు కోట్లు కురిపించే ఓ చిన్న సైజ్ ఏటీఎం. గేమ్ ఛేంజర్ సౌండ్ బాక్స్ ఫిన్ టెక్ కంపెనీల్లో సౌండ్ బాక్స్ అనేది ఓ గేమ్ ఛేంజర్. ముఖ్యంగా షాపుల్లో రద్దీగా ఉన్న సమయంలో యజమానికి కస్టమర్ ఎంత చెల్లించారో చెప్పేలా అన్నీ స్థానిక భాషల్లో అలెర్ట్ ఇస్తుంది. అయితే ఆ సౌండ్ బాక్స్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉందని మీకు తెలుసా. పాలబూత్‌లో చేదు అనుభవం పేటీఎం సౌండ్‌బాక్స్ పై విజయ్ శేఖర్ శర్మ తన వ్యక్తిగతంగా ఎదురైన అనుభవం నుంచి ఐడియా పుట్టింది. ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మాట్లాడుతూ.. విజయ్ ఈ గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ గురించి స్పందించారు. తన ఇంటి సమీపంలో ఉన్న పాల బూత్‌లో పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్లారు. పాల బూత్‌లో పాల ప్యాకెట్ కొన్నారు. పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్ చేశారు. కానీ పేమెంట్ చేసినట్లు మెసేజ్ రాకపోవడంతో సదరు షాపు యజమాని విజయ్ శేఖర్ శర్మని అడ్డగించాడు. పాల ప్యాకెట్‌కు డబ్బులు చెల్లించకుండా వెళతున్నారని అన్నారు. దీంతో కంగుతిన్న పేటీఎం సీఈవో సదరు పాల బూత్ యజమానిని ఫోన్ చూసుకోండి. పేమెంట్ చేశానని చెప్పారు. కానీ సదరు పాల వ్యాపారి ఫోన్ మెసేజ్ ఇన్ బాక్స్ నిండిపోవడంతో పేటీఎం సీఈవో చేసిన పేమెంట్ మెసేజ్ అలెర్ట్ రాలేదు. దీంతో మెసేజ్ ఇన్‌బాక్స్‌లో కొన్ని మెసేజ్‌లు డిలీట్ చేయడంతో విజయ్ శేఖర్ శర్మ పాల ప్యాకెట్‌కు పేమెంట్ చేసినట్లు మెసేజ్ వచ్చింది. అదిగో అప్పుడే పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. వాట్ ఏన్ ఐడియా సర్జీ పాల బూత్‌లో తనకు ఎదురైన సమస్యను పరిష్కరించాలని అనుకున్నారు. కస్టమర్లు పేమెంట్ చేసిన వెంటనే సౌండ్ అలర్ట్ వచ్చేలా వ్యాపారి, కస్టమర్ కు అనుసంధానం చేస్తూ ఓ డివైజ్ ను తయారు చేస్తే ఎలా ఉంటుందోనని అని ఆలోచించారు. అనేక తర్జన బర్జనల తర్వాత వచ్చిందే ఈ పేటీఎం సౌండ్ బాక్స్ ఐడియా. అలా పాల ప్యాకెట్ (పరోక్షంగా) తెచ్చిన అదృష్టంతో పేటీఎం సీఈవో వందల కోట్లు సంపాదించడం నిజంగా ఆశ్చర్యమే కదా. వందల కోట్లు సంపాదన ఎలా? కిరాణా స్టోర్‌లో పేటీఎం సౌండ్ బాక్స్ పెట్టుకుంటే నెలకు రూ.125 రెంట్ కట్టాల్సి ఉంది. ఆ లెక్కన మొత్తం మన దేశంలో 2.1 మిలియన్ల మంది ఆ సౌండ్ బాక్స్ వినియోగిస్తుంటే యావరజ్గా రూ.125 చెల్లిస్తే.. నెలకు వందల కోట్లు అర్జిస్తున్నట్లే కదా. -
'జీతం తక్కువైతే పిల్లను కూడా ఇవ్వరు!'
మీకు తెలుసా? పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ శాలరీ ఎంతుంటుందో. 44 ఏళ్ల ఎంటర్ ప్రెన్యూర్ జీతం ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022లో అక్షరాల రూ.4కోట్లు. ఇందులో రూ .3.714 కోట్ల జీతం, ఇతర బెన్ఫిట్స్ రూ .28.7 లక్షలు. మొత్తం కలుపుకొని రూ .4 కోట్లని పేటీఎం వార్షిక నివేదిక తెలిపింది. 27 ఏళ్ల వయసులో నా జీతం నెలకు రూ.10వేలు ఉంది. "నేను నెలకు రూ.10వేలు సంపాదిస్తున్నాని తెలిస్తే నాకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అప్పట్లో నాకు పదివేల జీతమని తెలిసి పిల్లని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. చాలీచాలని జీతంతో నేను నా కుటుంబానికి అనర్హుడైన బ్రహ్మచారిని అయ్యాను" అంటూ నవ్వులు పూయించారు. కానీ కొసమెరుపు ఏంటంటే 2005లో విజయ్ శేఖర్ శర్మ మిృదులను వివాహం చేసుకున్నారు. ఇక పేటీఎం వార్షిక నివేదిక విడుదల సందర్భంగా వాటాదారులకు విజయ్ శేఖర్ శర్మ లేఖ రాశారు. పేటీఎం 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.4 లక్షల కోట్ల నుండి 2022 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరానికి రూ.8.5 లక్షల కోట్లతో Gross merchandise volume (జీఎంవీ)లో వృద్ధిని సాధించినట్లు తెలిపారు. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం రూ.2,396.4 కోట్ల ఏకీకృత నష్టాన్ని నివేదించింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.3,186.8 కోట్ల నుంచి 65 శాతం పెరిగి రూ.5,264.3 కోట్లకు చేరుకుందని పేటీఎం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 78 శాతం పెరిగి రూ.4,974.2 కోట్లకు చేరుకుందని పేటీఎం నివేదికలో పేర్కొంది. వేల కోట్లతో సరికొత్త రికార్డ్‌లు విజయ్ శేఖర్ శర్మ టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించేలా 2000లో వన్97 కమ్యూనికేషన్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. రానురాను వన్97.. 2010లో పేటీఎంగా మారింది.అలాంటి కుటుంబ పరిస్థితులను అధిగమించి ఇప్పుడు రూ.18వేల కోట్ల ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చి సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
1.72 లక్షల పేటీఎం షేర్లు కొన్న విజయ్ శేఖర్
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్ కౌంటర్‌కు తాజాగా డిమాండ్ పుట్టింది. కంపెనీ ఎండీ విజయ్ శేఖర్ శర్మ గత నెలాఖరున మొత్తం 1.72 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు వన్ 97 కమ్యూనికేషన్స్(మాతృ సంస్థ) కౌంటర్‌పై దృష్టిసారించారు. దీంతో ఎన్ఎస్ఈలో శుక్రవారం పేటీఎమ్ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 646 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 599 వద్ద కనిష్టాన్ని తాకిన షేరు రూ. 648 వద్ద గరిష్టానికీ చేరింది. మే 30న విజయ్ రూ. 6.3 కోట్లు వెచ్చించి 1,00,552 పేటీఎమ్ షేర్లు కొనుగోలు చేశారు. ఇక 31న సైతం రూ. 4.7 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 71,649 షేర్లు సొంతం చేసుకున్నారు. కంపెనీ ఐపీవో చేపట్టి ఆరు నెలలు దాటడంతో విజయ్ శేఖర్.. పేటీఎమ్ షేర్లను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో రూ. 2,150 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి షేరు ధర క్షీణిస్తూ వచ్చి మే 12న రూ. 510 వద్ద కొత్త కనిష్టానికి చేరింది. చదవండి: రాబడుల కోసం.. మీ రూట్ ఎటు? -
ఈలాన్‌మస్క్.. అసలు విషయం ఎప్పుడో చెప్పు?
ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్‌ను ఇండియన్ ఎంట్రప్యూనర్ పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ పలు అంశాలపై సూటీగా ప్రశ్నించాడు. కీలక అంశాలపై సూచనలు చేశాడు. విజయ్ శేఖర్ శర్మ ప్రస్తావించిన అంశాలపై ఇంకా ఈలాన్ మస్క్ స్పందన రాలేదు. తాజ్ ఒక అద్భుతం ట్విటర్లో బిజీగా ఉండే ఈలాన్ మస్క్.. ఆగ్రా ఫోర్ట్ గురించి ఓ యూజర్ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ... 2007 నాటి భారత పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తాను తాజ్ మహల్‌ను సందర్శించినట్టు.. నిజంగా అదొక అద్భుతం అంటూ కొనియాడారు. ఇండియాలో జాగ్రత్త ఈలాన్ మస్క్ ఇండియా టూర్‌పై పేటీఎం విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తూ.. తాజ్‌మహాల్ దగ్గర టెస్లా కారును ఎప్పుడు డెలివరీ చేస్తావ్ ఈలాన్ మస్క్ అంటూ ప్రశ్నించాడు. అంతేకాదు ఈలాన్ మస్క్ మానస పుత్రిక ఆటోపైలెట్ (ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు)ను ఇండియాలో ప్రవేశపెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడి రోడ్లు, ట్రాఫిక్ చాలా గందరగోళంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు ఆటోపైలెట్ డిజైన్ చేయాల్సి ఉంటుందంటూ సూచనలు చేశారు అయితే దీనిపై మస్క్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. It is amazing. I visited in 2007 and also saw the Taj Mahal, which truly is a wonder of the world. — Elon Musk (@elonmusk) May 9, 2022 టెస్లా వివాదం టెస్లా కార్లను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టే అంశంపై ఈలాన్ మస్క్ ఆసక్తిగా ఉన్నాడు. అయితే విదేశాల్లో తయారు చేసిన కార్లను ఇండియాకి దిగుమతి చేస్తానని చెబుతున్నాడు. ఇలా దిగుమతి చేసే కార్లపై భారత ప్రభుత్వం భారీగా సుంకాలు విధించింది. వీటిని తగ్గించాలంటూ మస్క్ డిమాండ్ చేశాడు. దీనికి ప్రతిగా ఇండియాలో కార్లను తయారు చేయగలిగితే సుంకాలు తగ్గిస్తామని, ఇతర దేశాల్లో చేసిన కార్లు ఇక్కడ అమ్ముతామంటూ ఎటువంటి రాయితీలు ఇవ్వబోమంటూ తేల్చి చెప్పంది. దీంతో ఈ అంశంపై పీటముడి బిగుసుకున్నట్టైంది. చదవండి: -
అమెరికాకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి.. మెచ్చుకుంటున్న సీఈవోలు
రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలపై వెస్ట్రన్ మీడియా, అమెరికా అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అద్భుతమైన సమాధానం ఇచ్చారంటూ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మెచ్చుకున్నారు. భారత వైఖరిరి అంతర్జాతీయంగా సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న జైశంకర్‌కి కావాల్సినంత ప్రచారం ఎందుకు లభించడం లేదంటూ ప్రశ్నించారు. శేఖర్ శర్మ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించారు ఎడిల్వైజ్ సీఈవో రాధికా గుప్తా. విపత్కర పరిస్థితులను ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొవాలో చెప్పేందుకు ఈ సంభాషణ మాస్టర్ క్లాస్ అంటూ రాధికా గుప్తా అభిప్రాయపడింది. ఉక్రెయిన్ యుద్ధం వేళ రష్యాతో భారత సంబంధాలపై అమెరికా మొదటి నుంచి ఆడిపోసుకుంటోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శతృత్వం పెచ్చరిల్లడానికి స్వయంగా తానే కారణమై ఉండీ కూడా నిత్యం ఇతర దేశాల వైపు తప్పులు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రష్యాతో భారత అంటకాగుతోందంటూ పదేపదే విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జై శంకర్. అమెరికా మంత్రులతో జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో మంత్రి జై శంకర్ మాట్లాడుతూ కేవలం మధ్యాహ్నం వేళ యూరప్ దేశాలను రష్యా నుంచి ఎంత ఆయిల్ దిగుమతి చేసుకుంటాయో అంతకంటే తక్కువ ఆయిల్‌ని ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందంటూ కౌంటర్ ఇచ్చారు. భారత్ యుద్ధానికి వ్యతిరేకమని, చర్చల ద్వారా ఇరు దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలంటూ ఇప్పటికే అనేక వేదికల మీద భారత్ చెప్పిందంటూ భారత వైఖరికి పునరుద్ఘాటించారు జై శంకర్. Ye 🙋🏻♂️ I wonder why there are not enough articles & twitter threads on his skills to manage tough situations and profound answers. — Vijay Shekhar Sharma (@vijayshekhar) April 13, 2022 Yes! Master class on communication and handling prickly situations with confidence. — Radhika Gupta (@iRadhikaGupta) April 13, 2022 -
Paytm IPO: తొలి రోజే పేటిఎమ్ మదుపర్లకు భారీ షాక్!
ఇండియాలోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. సుమారు రూ.18,300 కోట్లను సేకరించడం లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్లోకి ఎంటరైంది. లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో ఐపీవో ధర రూ.2,150తో పోలిస్తే పేటీఎం షేరు విలువ 27.25% లేదా రూ.585.85 నుంచి రూ.1,564కు పడిపోయింది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 19.99% తక్కువగా ముగిసింది. నేటి సెషన్ ముగిసే సమయానికి సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టింగ్ సమయంలో పేటిఎమ్ మార్కెట్ క్యాప్ రూ.1.39 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,955తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. ఎన్ఎస్ఈలో షేరు 27.44% తక్కువగా రూ.1,560 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. (చదవండి: యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..!) పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080-2,150గా కంపెనీ నిర్ణయించింది. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు తీపికబురు) -
భారత భాగ్య విధాత.. ఆ పాట వింటే చాలు కన్నీళ్లు వస్తాయి - పేటీఎం విజయ్ శేఖర్ శర్మ
జీరో నుంచి హీరోగా ఎదిగిన ఎంట్రప్యూనర్ల జాబితాలో ఇటీవల చోటు దక్కించుకున్న విజయ్ శేఖర్ శర్మ జాతీయ గీతం వింటూ ఎమోషనల్ అయ్యారు. నిండు సభలో భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు కారణం చెబుతూ.. ఆ దృశ్యం చూసిన వారి చేతా కన్నీరు పెట్టించారు. Vijay Shekhar Sharma Got Emotional on Listing Day, Video Goes Viral: ఇండియాలోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చింది. సుమారు రూ.18,300 కోట్లను సేకరించడం లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఈ సందర్భంగా 2020 నవంబరు 18 బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజీలో పేటీఎం లిస్టింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విజయ్ శేఖర్ శర్మ కుటుంబంతో సహా ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ పదం వింటే చాలు జాతీయ గీతం ఆలపించిన తర్వాత విజయ్ శేఖర్ శర్మను మాట్లాడేందుకు వేదిక మీదకు పిలిచారు. మరోసారి జాతీయ గీతం అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘ జాతీయ గీతం ఎప్పుడు వింటున్నా.. ‘భారత భాగ్య విధాతా’ అనే పదాలు వినిపించినప్పడు నా కంట నీరు ఆగవు, ఈసారి కూడా ఆగడం లేదు’ అంటూనే మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకున్నారు. ఆ తర్వాత భారత భాగ్య విధాతా అంటూ దగ్థద స్వరంతో ప్రసంగం కొసాగించారు. భారత భాగ్య విధాత ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘడ్‌కి చెందిన విజయ్ శేఖర్ శర్మ ఓ సాధారణ టీచరు కొడుకు. పూర్తిగా హిందీ మీడియలో చదువుకోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీషులో ఇబ్బందులు పడ్డాడు. వాటి నుంచి బయటపడేందుకు ఫోర్బ్స్ ఇంగ్లీష్ పత్రికల్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ స్టోరీలు చదివి. వారి స్ఫూర్తితో స్టాన్ఫోర్డ్ వర్సిటీలో చదవాలని కలలు కన్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేరలేదు. అయితే సరే తన కలను నిజం చేసుకునే క్రమంలో పట్టు విడవలేదు. ఉద్యోగం చేయాలనే కుటుంబ సభ్యులు కోరికను పక్కన పెట్టి స్టార్టప్‌లు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పూర్తిగా నిలదొక్కుకున్న ఓ కంపెనీని సోదరి పెళ్లి కోసం అమ్మేయాల్సి వచ్చింది. ఆ కంపెనీకి చేసిన అప్పులు కట్టలేక దాదాపు రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఎదుర్కొన్నాడు. కేవలం వడ్డీలు కట్టేందుకే పార్ట్‌టైం జాబ్ చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు విడవలేదు. ప్రయత్నం మానలేదు. 2010లో పేటీఎం స్థాపించాడు. 2017 కల్లా నలభై ఏళ్లకే బిలియనీర్ నిలిచిన వ్యక్తిగా వార్తాల్లోకి ఎక్కాడు. తాజాగా పేటీఎం ఐపీవోకి సెబీ అనుమతి ఇచ్చిన వేళ ఆనందం పట్టలేక తన కింద ఉద్యోగుల ముందే డ్యాన్సులు వేశారు. ఆ ఐపీవోతో ఏకంగా రూ.18,300 కోట్లు సమీకరించాడు. తనతో పాటు పేటీఎం ఎదుగుదలకు కారణమైన 350 మందిని ఒక్క రోజులో కోటీశ్వరులను చేశాడు విజయ్ శేఖర్ శర్మ. వెలకట్టలేనివి పేటీఎం విజయ్ శేఖర్ శర్మ ఎదుగుదల వెనున ఎన్నో నిద్ర లేని రాత్రులు, మూడో కంటికి కనిపించని కన్నీళ్లు ఉన్నాయి. అందరికీ తెలిసేలా జరిగిన అవమనాలు, రూపాయి కోసం కాళ్లకు చెప్పులరిగేలా తిండితిప్పలు లేక ఊరంతా తిరిగిన రోజులున్నాయి. తాను కన్న కలలు నిజం చేసుకునేందుకు కష్టనష్టాలను దాటి వచ్చాడు. అక్షరాస్యత తక్కువగా ఉన్న దేశ ప్రజలకు డిజిటల్ పేమెంట్స్‌ని చేరువ చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లోని టీకొట్టు బండి దగ్గర కూడా పేటీఎంతో డబ్బులు చెల్లించేంతగా మార్పులు తీసుకొచ్చాడు. అందుకే జాతీయ గీతంలో ‘భారత భాగ్య విధాత’ అనే పదాలు విన్నప్పుడు అప్రయత్నంగా ఆయన కంట కన్నీరు ఒలికింది. ఈ కన్నీటి విలువ వెలకట్టలేనిది. మరోసారి చుక్కెదురు వెలుగు నీడల్లా కష్టసుఖాలు ఎప్పుడూ విజయ్ శేఖర్ శర్మ వెన్నంటే ఉంటాయి. అందుకే ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్లోకి ఎంటరైంది. బుధవారం లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. 2021 నవంబరు 18 మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి 15 శాతం క్షీణించి ఒక్కో షేరు ధర రూ.1653ల దగ్గర ట్రేడవుతోంది. పేటీఎం షేర్లు కొన్న ఎంతో మంది ఇన్వెస్టర్లు చాలా డబ్బులు నష్టపోయారు. దీంతో శేఖర్‌కి శాపనార్థాలు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తిట్ల దండకం అందుకున్నారు. మరికొందరు ఇన్వెస్టర్లు లాంగ్‌రన్‌లో పేటీఎం షేర్లు లాభాలు అందిస్తాయనే నమ్ముతున్నారు. - సాక్షి వెబ్ ప్రత్యేకం చదవండి:చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. ఇప్పుడు బిలియనీర్ -
Paytm Vijay Shakar Sharma: ‘ఎందుకిలా నిస్సహాయంగా ఉండిపోయాం’
ఢిల్లీలో ప్రమాదకరంగా మారిన వాతావరణ కాలుష్యంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 650 పాయింట్లు చూపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ తన ఆవేదను ఆయన పంచుకున్నారు. హౌ కన్ వీ లెఫ్ట సో హెల్ప్‌లెస్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 50 పాయింట్ల వరకు సూచిస్తే గాలి స్వచ్ఛంగా ఉన్నట్టు. 50 నుంచి 100 వరకు అయితే మోడరేట్, 100 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే సెన్సిటివ్ గ్రూప్‌కి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, 150 నుంచి 200ల పాయింట్ల వరకు ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అర్థం. 200 నుంచి 300 పాయింట్ల మధ్య ఉంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 300 పాయింట్ల మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. నవంబరు 13న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 473 పాయింట్లు దగ్గర నమోదు కావడంతో విజయ్ శేఖర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. How can we be left so helpless? pic.twitter.com/DDU2OhtrOZ — Vijay Shekhar Sharma (@vijayshekhar) November 12, 2021 ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కనీసం పిల్లలను వాతావరణ కాలుష్యం నుంచి కాపాడేందుకు వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సీఎం కీలక నిర్ణయం: వారం రోజులపాటు.. -
Paytm IPO: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. కానీ బిలియనీర్ అయ్యాడు
Vijay Shekhar Sharma Success Story: ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్స్ పాఠం చెబితే శబ్ధం తప్ప అర్థం తెలుసుకోలేని హిందీ మీడియం ఇబ్బందులు, సోదరి పెళ్లి కోసం అప్పులపాలై రోడ్డున పడేలా చేసిన కుటుంబ బాధ్యతలు, సామాన్యులైతే చాలు భారీ వడ్డీలతో నడ్డి విరిచే బ్యాంకుల కారణంగా తొలి స్టార్టప్ కంపెనీని అమ్మేయాల్సిన దుస్థితి. ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నా.. మొక్కవోని పట్టుదలతో ఒక్కో సమస్యని అధిగమిస్తూ ఈ రోజు ఏకంగా రూ.18,300 కోట్ల రూపాయల విలువైన కంపెనీని స్థాపించారు పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ. దేశంలో హిందీ బెల్ట్‌లో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్.. విజయ్ శేఖర్ శర్మ సొంతూరు. తండ్రి స్కూల్ టీచర్. తండ్రికి వచ్చే జీతం కుటుంబ పోషణకి తప్ప మరే ఇతర అవసరాలు తీర్చేందుకు సరిపోయేది కాదు. ఆటల్లో గొప్ప ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు మధ్యలో అడ్డుకున్నాయి. అయితే టీచరు కొడుకు కావడంతో చదువులు ముందుండే వాడు. స్కూల్లో ఏ పరీక్షలు జరిగా ఫస్ట్ వచ్చేవాడు. చదువులో అతని ప్రతిభకు తగ్గట్టే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కాలేజీలో సీటు కూడా వచ్చింది. ఇంగ్లీష్ కష్టాలు అలీగఢ్ లాంటి ద్వితీయ శ్రేణి నగరం నుంచి ఒక్కసారిగా ఢిల్లీలాంటి కాస్మోపాలిటన్ సిటీలో అడుగు పెట్టాక శేఖర్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. అప్పటి వరకు పూర్తిగా హిందీ మీడియంలో చదవడంతో కాలేజీలో ఇంగ్లీషులో లెక్చరర్లు చెప్పే పాఠం ఒక్క ముక్క కూడా అర్థం అయ్యేది కాదు. ఇంజనీరింగ్ చేరిన కొత్తలో తారే జమీన్ పర్ సినిమాలో పిల్లవాడిలాంటి తరహా పరిస్థితే తాను ఎదుర్కొన్నట్టు అనేక సార్లు విజయ్ చెప్పారు. పాఠాలు అర్థం కాక కాలేజీ నుంచి బయటకు పారిపోవాలని ప్రతీ రోజు అనిపించేందంటూ గతాన్ని అనేక సార్లు గుర్తు చేసుకున్నారు. ఇంగ్లీషు డిఫెక్ట్‌తో అప్పటి వరకు బ్రైట్ స్టూడెంట్‌గా ఉన్న విజయ్ ఒక్కసారిగా చదువులో వెనకబడి పోయాడు. మరోవైపు తల్లిదండ్రుల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలంటూ ఒత్తిడి. దీంతో పరీక్షలు పాస్ అయ్యేందుకే అన్నట్టుగా టెస్ట్ పేపర్లలో ఆన్సర్లు బట్టీపట్టి పరీక్షలు పాసవడం అలవాటుగా మార్చుకున్నాడు. రూట్ మారింది క్లాస్ రూమ్, కాలేజీ క్యాంటీన్, గ్రౌండ్, ఎగ్జామ్స్ ఇలా క్యాంపస్‌లో ఎక్కడికి వెళ్లినా ఇంగ్లీష్ అడుగడుగునా ఇబ్బంది పెట్టేది. ఇంగ్లీష్ నుంచి తప్పించుకునే మార్గం లేదని.. ఎలాగైనా నేర్చుకోవాలని విజయ్ శేఖర్ ఫిక్స్ అయ్యాడు. దీంతో ఇంగ్లీషు మీద పట్టు పెంచుకునేందుకు రెగ్యులర్‌గా ఇంగ్లీష్ పత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇందులో ఫోర్బ్స్ పత్రికలో వచ్చే బిల్‌గేట్స్, స్టీవ్‌జాబ్స్ లాంటి ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంటర్వ్యూలు శేఖర్‌పై ప్రభావం చూపాయి. గొప్ప కంపెనీలన్నీ గ్యారేజీల నుంచే ఎదిగాయనే విషయం అర్థమైంది. అంతే బీటెక్ పట్టా పుచ్చుకుని ఏదైనా ఉద్యోగం చేయాలనే లక్ష్యం కాస్తా మారిపోయింది. వ్యాపారవేత్తగా మారాలనే ఆంకాంక్ష తెర మీదకు వచ్చింది. సీఎంఎస్ సృష్టికర్త కాలేజీలో తన లాంటి ఐడియాలజీ ఉన్న విద్యార్థులతో కలిసి తొలిసారి సీఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ కంపెనీని విజయ్ శేఖర్ శర్మ నెలకొల్పాడు. ఆ తర్వాత సీఎంఎస్ పేరుని ఎక్స్ఎస్ కమ్యూనికేషన్‌గా మార్చారు. ప్రముఖ దినపత్రికలు ఈ సీఎంఎస్ని ఉపయోగించేవి. కంపెనీ విస్తరణ కోసం రుణం ఇవ్వాలంటూ బ్యాంకుల చుట్టూ ఎంతగా తిరిగినా.. అవమానాలే తప్ప రుణం మంజూరు రాలేదు. బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేదని, ష్యూరిటీగా ఏం చూపడం లేదంటూ బ్యాంకులు రుణం ఇచ్చేందుకు తిరస్కరించాయి. ఎన్నో పైరవీలు చేయగా చివరకు 24 శాతం వడ్డీతో ఓ బ్యాంకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చింది. అప్పుల కుప్ప ఎక్స్ఎస్ కమ్యూనికేషన్ నుంచి ప్రాఫిట్స్ రాకముందే నెలనెలా 8 లక్షల అప్పుపై 24 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేది. ఇదే సమయంలో తన సోదరి పెళ్లి చేసేందుకు తండ్రి దగ్గర సరిపడ డబ్బులు లేకపోవడంతో మరోసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది శేఖర్‌కి. కొండలా అప్పులు.. రాచపుండులా మారిన వడ్డీల భారంతో కుదైలయ్యాడు శేఖర్. పార్ట్‌టైం జాబులు చేసినా వడ్డీలకే తప్ప అసలు బాకీ తీర్చేందుకు సరిపోలేదు. దీంతో ఎంతో కష్టపడి నిర్మించిన ఎక్స్ఎస్ కమ్యూనికేషన్ సంస్థని అతి తక్కువ ధరకే అమ్మేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కన్న కలలన్నీ కల్లలయ్యాయి. చేతికొచ్చిన కంపెనీ చేజారిపోగా.. చేతిలో చిల్లిగవ్వ లేక ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డట్టయ్యింది విజయ్ శేఖర్ శర్మ పరిస్థితి. కష్టాల నుంచే సామాన్యులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పెడుతున్న ఇబ్బందులు, సేవలు అందించే విషయంలో ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది చూపించే నిర్లక్ష్యం విజయ్‌ని ఎంతగానో కలచివేశాయి. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ప్రజలకు సర్వీస్ అందించే ఏదైనా చేస్తే బాగుంటుందనే ఐడియా పుట్టుకొచ్చింది. అప్పటికే ఇంటర్నెట్కి ఆదరణ పెరుగుతున్న విషయం గమనించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ సేవా లాంటివి అప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నింటిని రంగరించి 2010లో పేటీఎంకి రూపకల్పన చేశారు. ఫోన్ రీఛార్జ్, కరెంటు బిల్లులు, ట్యాక్సులు ఇలా అనేక ఆర్థిక లావాదేవీలు సులువుగా చేసుకునేలా పేటీఎంని అందుబాటులోకి తెచ్చారు. పేటీఎం నెమ్మదిగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. రెండేళ్లలో రెండున్నర లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. నోట్ల రద్దుతో 2016లో జరిగిన రెండు ఘటనలు పేటీఎం రూపు రేఖలు మార్చేశాయి. ఒకటి జియో ఫోన్‌తో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరొకటి పెద్ద నోట్ల రద్దు. ఈ రెండు చర్యలతో పేటీఎం వ్యాపారం ఊహించని స్థాయికి చేరుకుంది. టీ కొట్టు మొదలు బడా బిజినెస్ మ్యాన్ వరకు అందరికి పేటీఎం అక్కరకు వచ్చింది. 2017 నవంబరు వచ్చే సరికి రెండు కోట్ల మంది కస్టమర్లు పేటీఎంకి వచ్చారు. స్టార్టప్ కాస్తా యూనికార్న్ కంపెనీగా మారిపోయింది. కంపెనీ పెట్టిన ఏడేళ్లకే బిలియనీర్ అయ్యాడు. 2017లో యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారమే విజయ్ శేఖర్ శర్మ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. చరిత్రలో అతి పెద్ద ఐపీవో పేటీఎంని మరింతగా విస్తరించే లక్ష్యంతో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ కోసం సెబీకి దరఖాస్తు చేశారు విజయ్‌శేఖర్. అనేక పరిశీలన తర్వాత సెబీ ఐపీవోకి అనుమతులు ఇచ్చిన రోజున విజయ్ శేఖర్ నృత్యం చేసి తన సంతోషం పంచుకున్నారు. ఒకప్పుడు పది వేల రూపాయల అప్పు కోసం కాళ్లకు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టు తిరిగిన అతను ఏకంగా రూ.18,300 కోట్ల నిధులు సమీకరించేందుకు అనుమతి సాధించాడు. దేశంలో ఇదే అతి పెద్ద ఐపీవో కావడం విశేషం. పేటీఎం సంస్థ 4.83 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా 5.89 కోట్ల బిడ్లు వచ్చాయి. చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్ -
16 వేల కోట్ల రూపాయల ఐపీవో.. డ్యాన్స్‌తో అదరగొట్టిన సీఈవో
చిన్న మొక్కగా మొదలైన స్టార్టప్ కంపెనీలు పెద్ద వట వృక్షంలా ఎదిగితే దాన్ని స్థాపించిన వ్యక్తుల ఆనందానికి హద్దే ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ. సెబీ తాజా నిర్ణయంతో ఆయనలో ఉప్పొంగిన సంతోషం కట్టలు తెంచుకుని చక్కని నృత్యంగా మారింది. సెబీ గ్రీన్ సిగ్నల్ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం గత కొంత కాలంగా తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. దీంతో నిధుల సమీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. అందులో భాగంగా ఏడాది కాలంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. కాగా తాజాగా పేటీఎంకి సంబంధించి ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి సెక్యూరిటీ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి ఇచ్చింది. రూ, 16,600 కోట్లు పేటీఎం సంస్థ ఐపీవో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించనుంది. దీంతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆనందంతో డ్యాన్స్ చేశారు. సెబీ నుంచి అనుమతులు వచ్చాయనే విషయం తెలియగానే సంస్థకు చెందిన ఉద్యోగులతో కలిసి ఆఫీసులో చిందులేశారు. అమితాబ్ పాటకి బిగ్‌బి అమితాబ్ నటించిన లావారిస్ సినిమాలో అప్‌నీతో జైసే తైసే పాటకి లయబద్దంగా నృత్యం చేస్తూ విజయ్ శేఖర్ శర్మ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను మరో పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం విజయ్ శేఖర్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. జోమాటో తర్వాత స్టాక్ మార్కెట్లో స్టార్టప్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి. జోమాటో సృష్టించిన ప్రకంపనలు ఇంకా ఆగకముందే మరోసారి మార్కెట్లో అలజడి రేపేందుకు పేటీఎం రెడీ అయ్యింది. Scenes at Paytm office after SEBI approves one of India’s largest IPOs 😀😀@vijayshekhar pic.twitter.com/6yQHKVBm39 — Harsh Goenka (@hvgoenka) October 24, 2021 -
నేను బాగా సంపాదించగలను....నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్
న్యూఢిల్లీ: కొన్ని సంఘటనలు చూస్తే మనం సినిమాల్లో చూసిన సీన్లు గర్తుకోస్తాయి కదా. అచ్చం అలాంట సంఘటనే ఒకటి ఇక్కడ చోటుచేసుకుంది. పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్శకి ఒక విచిత్రమైన మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏమిటంటే "సార్ నేను నా 18 ఏళ్ల స్కూల్ జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. అరిస్టాటిల్, బుద్ధుడు, వివేకానంద, న్యూటన్ వంటి ఎందరో ప్రముఖుల గురించి తెలుసుకున్నాను. నేను గనుక వ్యాపారం చేస్తే ఒక ట్రిలియన్ డాలర్ల వరకు డబ్బు సంపాదించగలను కానీ నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఇక వ్యాపారం ఎలా మొదలు పెట్టగలను. (చదవండి: పీపీఎఫ్ కిట్లతో డ్యాన్స్) టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ వంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనే ఆలోచన ఉంది. మన జీవితంలో కుటుంబం, స్నేహితులు ఎంత ప్రధానమో డబ్బు కూడా అంతే ప్రధానమైనది." అంటూ చెప్పుకొచ్చాడు. ఆఖరికీ ఆ సదరు వ్యక్తి తాను ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఆటవస్తువుల కంపెనీ పెట్టాలనుకుంటున్నానని, దాని కోసమై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు కూడా సంప్రదించానని కానీ ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా భారత్‌లో అందరి దగ్గర డబ్బు లేదని కానీ అది ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర్నించి అసలు బయటకు రాదంటూ ఆవేదనగా చెప్పుకొస్తూ పేటీఎమ్ సీఈవో శేఖర్‌కి మెయిల్ చేశాడు. దీంతో శేఖర్ దాన్ని స్క్రీన్ షార్ట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటా ఆత్మవిశ్వాసం గల అబ్బాయిలను అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) -
ఐపీఓ... వాటాదారుల అనుమతి బాటలో పేటీఎం
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న పేటీఎం తాజా ఈక్విటీ జారీకి వచ్చే నెలలో వాటాదారుల అనుమతిని కోరనుంది. తద్వారా రూ. 12,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ను పొందాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సర్వీసుల సంస్థ జులై 12న అసాధారణ సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈజీఎంలో భాగంగా విజయ్ శేఖర్‌కున్న ప్రమోటర్ గుర్తింపు రద్దు అంశాన్ని సైతం చేపట్టనుంది. శేఖర్ పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారు సంస్థలు సైతం ఐపీవోలో ఈక్విటీని విక్రయించేందుకు అనుమతిని కోరనున్నట్లు పేటీఎం తెలియజేసింది. పేటీఎంలో 29.71 శాతం వాటాతో యాంట్ గ్రూప్(అలీబాబా) అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ బాటలో సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ రూ. 19.63 శాతం, సైఫ్ పార్టనర్స్ 18.56 శాతం, విజయ్ శేఖర్ శర్మ 14.67% చొప్పున వాటాలు కలిగి ఉంది. -
కరోనా మెయిల్స్‌తో అసహనం: పేటీఎం వ్యవస్థాపకుడు
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న వేళ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మా ట్విటర్ వేదికగా స్పందించారు. ట్విటర్లో ఆయన స్పందిస్తూ.. గత రెండు నెలలుగా కఠినమైన లాక్డౌన్ నియమాలను పాటిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కాస్త నియంత్రణలో ఉన్నా కూడా వైరస్‌కు సంబంధించిన మెయిల్స్‌తో తన ఇన్‌బాక్స్ (మెయిల్స్ పంపే స్థలం)నిండిపోయిందన్నారు. ఇప్పటికీ సీనియర్ బ్యాంకింగ్ రంగానికి చెందిన వ్యక్తులు, కన్సల్టెంట్స్, కరోనాకు సంబంధించిన మెయిల్స్ పంపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూన్ నెలలో ఉన్నాం.. ఇలాంటి కీలక పరిస్థితుల్లో ఏ విధంగా వెబినార్ సెషన్స్ నిర్వహించాలో చర్చిస్తే బాగుంటుందని శేఖర్ శర్మ పేర్కొన్నారు. చదవండి: పేటీఎం అప్డేట్.. డబ్బులు హాంఫట్! -
పేటీఎంలో క్యాష్‌బ్యాక్ స్కాం
-
పేటీఎంలో రూ.10కోట్ల క్యాష్‌బ్యాక్ స్కాం
ముంబై: ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. ‘దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్ లభిస్తుండటాన్ని మా టీమ్ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరాం‘ అని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఆడిటింగ్ సంస్థ ఈవై నిర్వహించిన ఆడిట్లో కొందరు జూనియర్ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని ఆయన వివరించారు. మరోవైపు, ఇప్పటిదాకా పేమెంట్స్ వ్యవస్థలోకి మెసేజింగ్ యాప్ వాట్సాప్ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్ శేఖర్ శర్మ తాజాగా స్వరం మార్చారు. వాట్సాప్ లాంటి సంస్థల రాక స్వాగతించదగ్గ పరిణామమేనన్నారు. భారతీయ చట్టాలను పాటించడానికి సిద్ధంగా లేని సంస్థలను మాత్రమే తాను వ్యతిరేకించానని ఆయన చెప్పారు. క్యాష్‌బ్యాక్‌లిచ్చినా ఫర్వాలేదు .. క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో వ్యాపారం లాభసాటిగా ఉండదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటివి ఇచ్చినా వ్యాపారం నిలదొక్కుకోగలదని శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పట్టవచ్చన్నారు. యూజర్ల సంఖ్య 30 నుంచి 50 కోట్ల దాకా, వ్యాపార సంస్థల సంఖ్య ప్రస్తుతమున్న 1.2 కోట్ల నుంచి 4 కోట్లకు పెరిగేదాకా లాభాలు నమోదు కాకపోవచ్చని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పేటీఎంలో క్యాష్‌బ్యాక్ స్కాం -
పేటీఎంలో 20వేల ఉద్యోగాలు
పేటీఎంలో కొత్తగా 20వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సంస్ధ వ్యవస్ధాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం పేటీఎం ద్వారా జరిపే నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దేశంలోని 650 జిల్లాల్లో పేటీఎం సేల్స్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రస్తుతం పేటీఎంలో 11వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వీరిలో 1500 మంది గత ముప్ఫై రోజుల్లో చేరిన వారే కావడం గమనార్హం. యాప్ డేటా ట్రాకర్ 'యాప్ అన్నీ' ప్రకారం.. భారతదేశంలో పేటీఎంకు 88 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరందరూ రెగ్యులర్ గా యాప్ ను వినియోగిస్తున్నట్లు కూడా 'యాప్ అన్నీ' పేర్కొంది. ఒక జిల్లాకు 10మంది సేల్స్ బృందాన్ని పంపే యోచనలో ఉన్నట్లు విజయ్ శేఖర్ చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నీతి ఆయోగ్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫీచర్ ఫోన్లలో వాలెట్ సర్వీసులను ప్రవేశపెట్టిన తర్వాత చిన్న వ్యాపారుల్లో యాప్ వినియోగం బాగా పెరిగినట్లు చెప్పారు. పేటీఎం వినియోగదారుడు ఎవరైనా టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి పేమెంట్ చేయొచ్చని వెల్లడించారు. సెకనుకు 1300 కాల్స్ ను హ్యాండిల్ చేయగల సామర్ధ్యానికి తమ నెట్ వర్క్ పరిధిని పెంచుకున్నట్లు చెప్పారు. రోజుకు కనీసం రూ.150 కోట్ల నగదు రహిత లావాదేవీలు యాప్ ద్వారా జరుగుతున్నట్లు చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుకు ముందు రోజుకు రూ.40 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగేవని వెల్లడించారు.