
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న వేళ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మా ట్విటర్ వేదికగా స్పందించారు. ట్విటర్‌లో ఆయన స్పందిస్తూ.. గత రెండు నెలలుగా కఠినమైన లాక్‌డౌన్ నియమాలను పాటిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కాస్త నియంత్రణలో ఉన్నా కూడా వైరస్‌కు సంబంధించిన మెయిల్స్‌తో తన ఇన్‌బాక్స్ (మెయిల్స్ పంపే స్థలం)నిండిపోయిందన్నారు. ఇప్పటికీ సీనియర్ బ్యాంకింగ్ రంగానికి చెందిన వ్యక్తులు, కన్సల్టెంట్స్, కరోనాకు సంబంధించిన మెయిల్స్ పంపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూన్ నెలలో ఉన్నాం.. ఇలాంటి కీలక పరిస్థితుల్లో ఏ విధంగా వెబినార్ సెషన్స్ నిర్వహించాలో చర్చిస్తే బాగుంటుందని శేఖర్ శర్మ పేర్కొన్నారు.
చదవండి: పేటీఎం అప్‌డేట్.. డబ్బులు హాంఫట్!
Comments
Please login to add a commentAdd a comment