మీకు తెలుసా? పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ శాలరీ ఎంతుంటుందో. 44 ఏళ్ల ఎంటర్ ప్రెన్యూర్ జీతం ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022లో అక్షరాల రూ.4కోట్లు. ఇందులో రూ .3.714 కోట్ల జీతం, ఇతర బెన్ఫిట్స్ రూ .28.7 లక్షలు. మొత్తం కలుపుకొని రూ .4 కోట్లని పేటీఎం వార్షిక నివేదిక తెలిపింది.
27 ఏళ్ల వయసులో నా జీతం నెలకు రూ.10వేలు ఉంది. "నేను నెలకు రూ.10వేలు సంపాదిస్తున్నాని తెలిస్తే నాకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అప్పట్లో నాకు పదివేల జీతమని తెలిసి పిల్లని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. చాలీచాలని జీతంతో నేను నా కుటుంబానికి అనర్హుడైన బ్రహ్మచారిని అయ్యాను" అంటూ నవ్వులు పూయించారు. కానీ కొసమెరుపు ఏంటంటే 2005లో విజయ్ శేఖర్ శర్మ మిృదులను వివాహం చేసుకున్నారు.
ఇక పేటీఎం వార్షిక నివేదిక విడుదల సందర్భంగా వాటాదారులకు విజయ్ శేఖర్ శర్మ లేఖ రాశారు. పేటీఎం 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.4 లక్షల కోట్ల నుండి 2022 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరానికి రూ.8.5 లక్షల కోట్లతో Gross merchandise volume (జీఎంవీ)లో వృద్ధిని సాధించినట్లు తెలిపారు.
మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం రూ.2,396.4 కోట్ల ఏకీకృత నష్టాన్ని నివేదించింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.3,186.8 కోట్ల నుంచి 65 శాతం పెరిగి రూ.5,264.3 కోట్లకు చేరుకుందని పేటీఎం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 78 శాతం పెరిగి రూ.4,974.2 కోట్లకు చేరుకుందని పేటీఎం నివేదికలో పేర్కొంది.
వేల కోట్లతో సరికొత్త రికార్డ్‌లు
విజయ్ శేఖర్ శర్మ టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించేలా 2000లో వన్97 కమ్యూనికేషన్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. రానురాను వన్97.. 2010లో పేటీఎంగా మారింది.అలాంటి కుటుంబ పరిస్థితులను అధిగమించి ఇప్పుడు రూ.18వేల కోట్ల ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చి సరికొత్త రికార్డ్ సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment