ఎలక్ట్రిక్‌ స్టార్టప్‌లో విజయ్‌ దేవరకొండ పెట్టుబడులు | Vijay Deverakonda invests in Bio Friendly Electrical Vehicles | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ స్టార్టప్‌లో విజయ్‌ దేవరకొండ పెట్టుబడులు

Published Mon, Nov 2 2020 6:29 AM | Last Updated on Mon, Nov 2 2020 6:29 AM

Vijay Deverakonda invests in Bio Friendly Electrical Vehicles - Sakshi

ముంబై: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ బైక్స్‌ స్టార్టప్‌ వాట్స్‌ అండ్‌ వోల్ట్స్‌లో సినీ హీరో విజయ్‌ దేవరకొండ పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. పెట్టుబడులు ఎంతనేది  వెల్లడించలేదు. స్వల్ప ప్రయాణానికి వీలుగా కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్‌ సైకిల్స్, బైక్‌లు, స్కూటర్ల వంటివి తీసుకొస్తామని విజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  వినియోగదారుడు ప్రయాణించిన దూరానికి మాత్రమే చార్జీలు చెల్లించేలా పే పర్‌ యూజ్‌ విధానంలో వీటిని తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే విజయ్‌ ‘రౌడీ’ బ్రాండ్‌ పేరిట దుస్తుల విభాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement