వేలిముద్రలతో బిల్లు చెల్లింపులు!
లండన్: మనకు షాపింగ్ కేంద్రాల్లో డెబిట్/క్రెడిట్ కార్డులు, ముఖకవళికలు, సెల్ఫీలతో చేసే చెల్లింపులు తెలుసు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికతతో వేళ్లలోని సిరలు(గుండెకు చెడురక్తాన్ని తీసుకెళ్లేనాళాలు) సాయంతో బిల్లులు చెల్లించొచ్చు. ‘ఫింగోపే’గా సాంకేతికతను యూకేలోని ఒక స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. వేలిసిరల నిర్మాణాన్ని బట్టి వినియోగదారుడికి ప్రత్యేక గుర్తింపును ఇది కేటాయిస్తుంది. దీన్ని బ్యాంకు ఖాతాతో అనుసంధానిస్తుంది. బిల్లు చెల్లింపు సమయంలో అతను తన వేలిని స్కానర్‌పై ఉంచితే చాలు. డబ్బు బదిలీ అయిపోతుంది. కార్డులు/నగదు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 340 కోట్ల మందిలో ఒకరి సిరలు మాత్రమే మరోవ్యక్తి సిరలను పోలి ఉంటాయట.