భారత్లో సాఫ్ట్బ్యాంకుకు రూ.3,750 కోట్ల నష్టం | Softbank writes off $555 mn of its investments in Ola, Snapdeal | Sakshi
Sakshi News home page

భారత్లో సాఫ్ట్బ్యాంకుకు రూ.3,750 కోట్ల నష్టం

Published Wed, Nov 9 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

భారత్లో సాఫ్ట్బ్యాంకుకు రూ.3,750 కోట్ల నష్టం

భారత్లో సాఫ్ట్బ్యాంకుకు రూ.3,750 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్... భారత్‌లోని స్టార్టప్ కంపెనీల్లో వెచ్చించిన పెట్టుబడులపై 58.14 బిలియన్ యెన్ల(56 కోట్ల డాలర్లు-దాదాపు రూ.3,750 కోట్లు)ను నష్టపోరుుంది. ప్రధానంగా ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్, ట్యాక్సీ ఆగ్రిగేటర్ ఓలాల్లో చేసిన పెట్టుబడులు కూడా ఇందులో ఉన్నారుు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాల నివేదికలో ఈ మేరకు పెట్టుబడులను రైట్ డౌన్ చేసినట్లు సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించింది.

పెట్టుబడి నష్టాలను చవిచూసిన ఇతర భారతీయ కంపెనీల్లో ఏఎన్‌ఐ టెక్నాలజీస్, జాస్పెర్ ఇన్ఫోటెక్ వంటివి ఉన్నారుు. కాగా, రైట్ డౌన్ చేసిన మొత్తంలో 29.62 బిలియన్ యెన్లను కరెన్సీ ఇంపెరుుర్‌మెంట్(కరెన్సీ విలువపరంగా కంపెనీ మొత్తం ఆస్తుల విలువలో తగ్గింపు) కారణంగా నష్టపోరుునట్లు వెల్లడించింది. 2014 అక్టోబర్‌లో సాఫ్ట్‌బ్యాంక్... ఓలాలో 21 కోట్ల డాలర్లు, స్నాప్‌డీల్‌లో 62.7 కోట్ల డాలర్లను పెట్టుబడిగా వెచ్చించింది.

ఆతర్వాత కూడా ఈ రెండు స్టార్టప్‌లలో మరిన్ని పెట్టుబడులను కుమ్మరించింది. ఓలా ఇప్పటివరకూ సాఫ్ట్‌బ్యాంక్ సహా టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ తదితన ఇన్వెస్టర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఇక గతేడాది స్నాప్‌డీల్‌చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ నుంచి 50 కోట్ల డాలర్ల నిధులను  దక్కించుకుంది. దీనిప్రకారం అప్పట్లో స్నాప్‌డీల్ కంపెనీ విలువ 4.8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.

భారీ పెట్టుబడి ప్రణాళికలు...: ఇప్పటివరకూ భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. వచ్చే 5-10 ఏళ్లలో ఈ మొత్తాన్ని 10 బిలియన్ డాలర్లకు డాలర్లకు చేర్చాలని భావిస్తున్నట్లు కూడా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement