
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎడ్‌టెక్ సంస్థ ప్రాక్టికల్లీ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ముంబై, మొహాలీలో ఇటీవలే కార్యాలయాలు ప్రారంభించింది. ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు ఉండగా.. వచ్చే ఏడాది కాలంలో ఈ సంఖ్యను 66 శాతం మేర పెంచుకోనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకురాలు చారు నొహేరియా తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో దాదాపు నలభై శాతం వాటా భారత మార్కెట్ నుంచి, మిగతాది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రాగలదని భావిస్తున్నట్లు వివరించారు. ఫెడెనా (స్కూల్ ఈఆర్‌పీ) కొనుగోలుతో సమగ్రమైన ప్రాక్టికల్లీ స్కూల్ సొల్యూషన్‌కు స్కూళ్లలో ఆమోదయోగ్యత మరింత పెరిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment