
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :ప్రకటనలు చూస్తే మనకేం వస్తుంది? కొత్త ఉత్పత్తులు లేక ఆఫర్ల గురించి తెలుస్తుంది. అంతే కదా!!. కానీ, యాడ్ చూస్తే చాలు మన జేబులోకి డబ్బులొస్తే? ఇది అక్షరాలా నిజం. క్విక్‌యాడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఇది సాధ్యమే. ప్రకటనల రంగంలో సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది హైదరాబాదీ స్టార్టప్ క్విక్‌యాడ్స్.
మరిన్ని వివరాలు సీఈఓ సుమంత్ రాగిరెడ్డి మాటల్లోనే..
‘‘యూజర్లు తమ ఫోన్లలో క్విక్‌యాడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. చాలా మంది మా యాప్‌లో అడ్వర్టయిజ్‌మెంట్స్ ప్రసారమవుతాయని అనుకుంటారు. కానీ అది తప్పు యాప్‌లో ఏమీ ఉండదు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న మొబైల్స్‌లో యూజర్లు ఫోన్ మాట్లాడడం పూర్తవగానే యాడ్ వీడియో వస్తుంది అంతే! దీన్ని పూర్తిగా చూస్తే.. యూజర్లకు డిజిటల్ వాలెట్‌లోకి డబ్బులొస్తాయి. నెలకు 200–800 వరకు ఆదాయం వస్తుంది.
రూ.6 కోట్ల ఆదాయం..
193 దేశాల్లో 3 రకాల సాఫ్ట్‌వేర్ పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతానికి ఇండియన్ పేటెంట్, కాపీరైట్స్ హక్కులు వచ్చాయి. ఇప్పటివరకు రూ.52 లక్షల ఆదాయం వచ్చింది. 4 నెలల్లో ఏపీ, మహారాష్ట్ర, అస్సాంలకు విస్తరించనున్నాం. ఆగస్టు నుంచి నైజీరియా, కెన్యా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది కాలంలో కార్పొరేట్‌లో 50, లోకల్‌లో 5 వేల కంపెనీలకు, 6–7 లక్షల యూజర్లకు చేరుకోవాలని, రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెటట్టుకున్నాం.
రూ.1.5 లక్షలకు ఫ్రాంచైజీ..
ప్రస్తుతానికి యూజర్లకు క్విక్ యాడ్ డిజిటల్ వాలెట్‌లో మనీని జమ చేస్తున్నాం. వీటిని యూజర్ కావాలంటే రీచార్జ్‌లు, మూవీ టికెట్స్ తదితరాలకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సొమ్ముతో యూజర్ పేరు మీద బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించాం. యూజర్ బీమా ప్రీమియం ఈ సొమ్ముతో కంపెనీయే చెల్లిస్తుంది. ఇప్పటివరకు రూ.1.2 కోట్ల పెట్టుబడి పెట్టాం. నాలుగున్నర నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు వస్తాం. క్విక్‌యాడ్స్ ఫ్రాంచైజీలు ఇస్తున్నాం. రూ.1.5 లక్షల చార్జీ. ఇప్పటివరకు తెలంగాణలో 25 ఫ్రాంచైజీలు ఇచ్చాం. అడ్వర్టయిజ్‌మెంట్ మెటీరియల్స్, సాఫ్ట్‌వేర్, టెక్నికల్ సపోర్ట్ అంతా కంపెనీదే’’ అని సుమంత్ తెలిపారు.
1.6 లక్షల యూజర్లు;74 మంది క్లయింట్లు..
ప్రస్తుతం మాకు 1.6 లక్షల మంది యూజర్లతో పాటు, 74 కంపెనీలు క్లయింట్స్‌గా ఉన్నాయి. గీతమ్, కేఎల్, విజ్ఞాన్ యూనివర్సిటీలు, ప్రైడ్ హోండా, జేఎస్‌ఆర్ గ్రూప్, శ్రీ తారక జువెల్లర్స్ వంటి కంపెనీలు జాబితాలో ఉన్నాయి. త్వరలోనే కేఎఫ్‌సీ, బీఎస్‌ఎన్‌ఎల్, ఎస్‌బీఐలతో ఒప్పందం చేసుకోనున్నాం. 10, 20, 30 సెకన్ల నిడివి గల యాడ్ వీడియోలుంటాయి. ధరలు రూ.5 వేల నుంచి రూ.12 లక్షల వరకూ ఉంటాయి.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...
Comments
Please login to add a commentAdd a comment