ఫొటోలు చూశారుగా.. ఆకారంతోపాటు ఎగిరే క్రమంలోనూ పక్షిని పోలిన వినూత్నమైన ఎగిరే కారు ఇది. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేసింది. నిట్టనిలువుగా పైకి ఎగిరే ఇలాంటి కార్ల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అలాంటివి వాస్తవ రూపం దాల్చింది తక్కువే. వీటిని వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) వాహనాలంటారు.
(చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!)
అయితే వీటీఓఎల్‌ను ఫ్రాక్టిల్ కాస్త మార్చి నియర్ వీటీఓఎల్‌గా కొత్త విమానాలకు పేరు పెట్టింది. పక్షి తన కాళ్లతో ఎలా చెట్టుకొమ్మను పట్టుకుంటుందో ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. పక్షి మాదిరిగానే కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ వాహనంతో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్‌వే, హెలిపాడ్ వంటివేవీ అవసరం లేకపోగా పైలట్ మోడ్‌తోపాటు రిమోట్ కంట్రోల్ ద్వారానూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లవచ్చని కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
(చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ)
Comments
Please login to add a commentAdd a comment