పక్షి దెబ్బా మజాకా...
Published Mon, Apr 24 2017 1:19 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
కోల్‌కతా: పక్షి ఢీకొనడంతో విమానాన్ని అత్యవసరంగా దించాల్సి వచ్చింది. సోమవారం దిల్లీ నుంచి కోల్‌కతా వెళుతున్న బోయింగ్ 787-8 ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొంది. దాంతో ఇంజన్‌లో లోపం ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో దించాడు. ఆ సమయంలో విమానంలో 254 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement