సాక్షి, న్యూఢిల్లీ : ప్రాంతీయ భాషలో పరస్పర అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు వాటిని ఇతరులతో షేర్ చేయడం కోసం వచ్చిన భారతీయ యాప్ ‘షేర్‌చాట్’ ఎంతో ఆదరణ పొందుతోంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, సెలబ్రటీలు ఇంగ్లీషు భాషలో తప్ప ఇతర ప్రాంతీయ భాషల్లో ముచ్చటించుకోవడానికి దీన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీషు భాషలో ముచ్చటించుకోవాలన్న ఇందులో కుదరదు. ఎందుకంటే ఇందులో ఇంగ్లీషు లేదు. మిగతా భారత్‌లోని 14 ప్రాంతీయ భాషలు ఉన్నాయి.
ఇంగ్లీషులో ముచ్చటించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గ్లోబల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీషు రాకుండా కేవలం ప్రాంతీయ భాష మాత్రమే వచ్చిన ప్రజల సౌకర్యార్థం ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ప్రాంతీయ భాషలతోపాటు ఇందులో కూడా ఇంగ్లీషు భాషను పెట్టినట్లయితే ప్రాంతీయ భాషను చిన్న చూపు చూసినట్లు అవుతుంది. ఆంగ్ల భాషకున్న ఆదరణ కారణంగా ఆ భాష అంతగా రాకపోయినా ఆంగ్లంలో ముచ్చటించేందుకు కొంత మంది ప్రయత్నించవచ్చు. కొంత కూడా ఆ భాషరాని వారు ఇబ్బంది పడవచ్చు.
అందుకని 2015, అక్టోబర్ నెలలో ఈ ‘షేర్‌చాట్’ను తీసుకొచ్చారు. గత 18 నెలల కాలంలోనే దీని యూజర్ల సంఖ్య 20 ఇంతలు పెరిగి, రెండున్నర కోట్లకు చేరుకుందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే ఉపయోగించిన ఈ చాట్‌ను ఇప్పుడు సెలబ్రీటలతోపాటు వివిధ వర్గాల ప్రజలను ఉపయోగిస్తున్నారని వారు చెప్పారు. మూడు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమత్రులు....చత్తీస్ గఢ్ రమన్ సింగ్, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌవాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, భోజ్‌పూరి పాటల గాయకుడు మనోజ్ తివారీ కూడా ఈ షేర్‌చాట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యాప్‌ను ఉపయోగించడంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూకుడును పెంచారు. కాంగ్రెస్ పార్టీగానీ, ఆ పార్టీ నాయకులుగానీ ఈ యాప్‌ను అంతగా ఉపయోగించడం లేదు. చైనా వెంచర్ క్యాపిటర్ ‘షన్వీ కాపిటల్’ ద్యారా ఈ యాప్ గత నెలలో దాదాపు 720 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. 2021 వరకు దాదాపు 53 కోట్ల మంది భారతీయులు ఆన్‌లైన్‌పైకి వస్తారని గూగుల్ నిర్వహించిన ఓ సర్వే తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment