requirements
-
యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!
వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్, ‘యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్’(వైపీపీ) ద్వారా డబ్బులు సంపాదించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకుందుకు సంబంధించిన అర్హత అవసరాలను సగానికి తగ్గించేసింది.ముఖ్యంగా పేమెంట్ చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్లతో సహా షార్ట్ వీడియో క్రియేటర్లకు మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్ చేసింది. ఇదీ చదవండి: Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే సవరించిన విధానం ప్రకారం, క్రియేటర్లు ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే వైపీపీలో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా వెయ్యి సబ్స్క్రైబర్లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు. అంతేకాదు గతంలో 4,000 వాచ్ హవర్స్, 10 మిలియన్లతో పోలిస్తే ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్ లేదా 3వేలు వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చేయాడ్ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుందనేది తెలిసిన సంగతే. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్, యూకే, కెనడా, తైవాన్,దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్ నివేదించింది. ఇతర ప్రదేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నప్పటికీ భారత్‌లో ఈ నిబంధన ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేదు. ఇలాంటిమరిన్ని ఆసక్తికర క థనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ప్రస్తుత హెల్త్ పాలసీ నచ్చడం లేదా? మరో పాలసీకి మారిపోండిలా..
హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కుమార్ గతేడాది అత్యవసరంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సింగిల్ ఏసీ రూమ్‌ను ఆయన ఆసుపత్రిలో తీసుకున్నారు. మూడు రోజులకు కలిపి రూ.88,000 బిల్లు వచ్చింది. అతడికి రూ.4 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండడంతో నిశ్చింతగా ఉన్నాడు. కానీ, బీమా సంస్థ నుంచి పూర్తి పరిహారం అందలేదు. క్రాంతి తన వంతుగా రూ.33,000ను చెల్లించాల్సి వచ్చింది. అదేమని ప్రశ్నించగా.. బీమా కవరేజీలో రూమ్ రెంట్ పరిమితి 1 శాతంగా ఉంది. కానీ, అతడు ఎంపిక చేసుకున్న రూమ్ రోజువారీ అద్దె 1 శాతం కంటే మించి ఉంది. ఈ షరతు చూసిన తర్వాత అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ఇది క్రాంతి కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. దశాబ్దం క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని, కొనసాగుతున్న వారంతా ఎదుర్కొంటున్నారు. క్లెయిమ్ పరిష్కారాల్లో జాప్యం, ఏదో రకమైన కొర్రీ పెట్టి తక్కువ పరిహారాన్ని చెల్లించడం, అధిక ప్రీమియం వసూలు లేదా నాసిరకమైన సేవలతో సరిపెట్టడం.. ఇలా ఎన్నో కారణాలతో పాలసీదారులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటోంది. దీంతో చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఫలితంగా ఎన్నో సర్జరీలకు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడడం లేదు. అదే రోజు డిశ్చార్జ్ అయి వెళ్లొచ్చు. ఒకవైపు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ.. మరోవైపు జీవనశైలి వ్యాధులతో ఔట్ పేషెంట్ సేవల అవసరం పెరుగుతోంది. మారుతున్న ఈ అవసరాలు అన్నీ మన ఆరోగ్య బీమా కవరేజీలో భాగంగా ఉన్నప్పుడు అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే సమగ్రమైన హెల్త్ కవరేజీతో ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పాలసీ సమగ్ర కవరేజీకి భరోసా ఇవ్వనట్టయితే.. చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంటే, బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, ప్రీమియం భారంగా మారితే అప్పుడు మన ముందు రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీమా సంస్థను మార్చడం. లేదంటే ప్రస్తుత సంస్థలోనే మెరుగైన ప్లాన్‌కు మారిపోవడం (మైగ్రేషన్). వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సేవల పట్ల సంతృప్తిగానే ఉండి, పాలసీలోని కవరేజీ ఫీచర్లు, ప్రీమియం విషయంలో సంతృప్తిగా లేకపోతే అప్పుడు మీ ప్లాన్‌ను పోర్టింగ్ పెట్టుకోవడానికి బదులు, అదే బీమా సంస్థలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో ప్లాన్‌ను మైగ్రేట్ అవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. పోర్టింగ్ అంటే ప్రస్తుత బీమా సంస్థను వీడి, మరో బీమా సంస్థకు మారిపోవడం. మైగ్రేషన్ అంటే ప్రస్తుత బీమా సంస్థలోనే మరో ప్లాన్‌కు మారిపోవడం. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనల కింద ఒక వ్యక్తి తన పాలసీని ఎలాంటి బ్రేక్ లేకుండా వరుసగా నాలుగేళ్ల పాటు రెన్యువల్ చేసుకుంటే, అప్పుడు ప్రస్తుత బీమా ప్లాన్ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మైగ్రేషన్‌కు అర్హత లభిస్తుంది’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. ఎప్పుడు మార్చుకోవాలి..? ‘‘కస్టమర్లు ప్రస్తుత హెల్త్ ప్లాన్ కవరేజీ పట్ల అసంతృప్తితో ఉంటే లేదా ప్రస్తుత బీమా సంస్థ సేవలు నచ్చకపోతే లేదా సమగ్రమైన, వినూత్నమైన బీమా పాలసీ అందుబాటు ప్రీమియానికి లభిస్తుంటే పోర్ట్ పెట్టుకోవచ్చు. కాకపోతే నూతన పాలసీ ప్రయోజనాలు, నూతన సంస్థ సేవల సదుపాయాలను ప్రధానంగా చూడాలి’’అని షా సూచించారు. ‘‘మార్కెట్లో ఉన్న ప్రతీ నూతన ఉత్పత్తి అందరికీ సరిపోకపోవచ్చు. వేరొక సంస్థలోని ప్లాన్‌లో ఉన్న ఆకర్షణీమయైన ఫీచర్లను చూసి మారిపోవడం సరికాదు. మీ అవసరాలు, కుటుంబ సభ్యులు, వయసు తదితర అంశాల ఆధారంగా కొత్త ఉత్పత్తిని మదింపు వేయాలి’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోయినా, కస్టమర్ సేవలు నచ్చకపోయినా, ప్రస్తుత బీమా సంస్థ అందిస్తున్న సేవలు నాసిరకంగా ఉన్నా, సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్‌ను తిరస్కరించినా అప్పుడు మారిపోవడాన్ని పరిశీలించొచ్చని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాథుర్ సూచించారు. సరైన సమాచారం పొందలేకపోవడం, పారదర్శకత లేమి, కంపెనీ నుంచి సత్వర స్పందన లేకపోవడం, విలువ ఆధారిత సేవలు లేకపోయినా పోర్టింగ్‌ను పరిశీలించొచ్చని తెలిపారు. ఇప్పటికే బీమా పాలసీ ఉండి, అందులోని నిబంధనల వల్ల సొంతంగా చెల్లింపులు చేసుకోవాల్సి వస్తుంటే, రూమ్ రెంట్ పరంగా ఉప పరిమితులు ఉంటే, మీకు దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఓపీడీ లేదా డేకేర్ కవరేజీ లేకపోతే, మీ ప్లాన్‌లో రీస్టోరేషన్ (బీమా ఖర్చయితే తిరిగి పునరుద్ధరించడం) ఫీచర్ లేకపోయినా, ముందు నుంచి ఉన్న వ్యాధులకు దీర్ఘకాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్నా, అప్పుడు మీ వంతు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. దీనికి బదులు వేరొక ప్లాన్‌కు మారిపోవడమే నయం. ఉదాహరణకు నివాబూపా సంస్థ రెండు గంటలకు మించి హాస్పిటలైజేషన్ అయితే చాలు చెల్లింపులు చేస్తోంది. అదే ఆదిత్య బిర్లా సంస్థ అయితే ఆరోగ్యకర జీవనశైలిని (కంపెనీ చెప్పినట్టు) అనుసరిస్తే అప్పడు ప్రీమియంలో నూరు శాతం వరకు రాయితీని ఆఫర్ చేస్తోంది. సాధారణంగా పోర్టింగ్ లేదా మైగ్రేషన్‌కు ప్రీమియం ఒక్కటినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే అన్ని బీమా సంస్థలు కొన్నేళ్లకోసారి ప్రీమియంను సవరిస్తుంటాయి. అలాగే వయసు వారీగా కూడా ప్రీమియం పెంపు ఉంటుంది. అలాగే, బీమా కవరేజీని పెంచుకునేందుకు సైతం పోర్టింగ్ సరికాదు. దీనికి బదులు టాపప్ లేదా సూపర్ టాపప్ రూపంలో అదనపు కవరేజీని యాక్టివేట్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ కవరేజీకి మించి క్లెయిమ్ వచ్చిన సందర్భాల్లోనే టాపప్, సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తాయి. ఏమి చూడాలి..? మీ అవసరాలకు సరిపడే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. పాలసీ వర్డింగ్స్, పాలసీ బ్రోచర్‌ను అన్ని పేజీలు చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. తద్వారా ప్లాన్ ఆకర్షణీయమా? కాదా? అన్నది చూడొచ్చు. క్లెయిమ్ పరిష్కారాల విషయంలో నూతన సంస్థ పనితీరును విశ్లేషించాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, క్లెయిమ్ చెల్లింపుల సామర్థ్యాలను చూడాలి. క్లెయిమ్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంతో బీమా సంస్థల స్పందనను చూడాలి. ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే, క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారం పడని పాలసీని ఎంపిక చేసుకోవాలి. ఓపీడీ కవరేజీ, డేకేర్, రీస్టోరేషన్ కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్ వల్ల బీమా కవరేజీ మొత్తం ఖర్చయినప్పుడు.. రీస్టోరేషన్ కింద బీమా సంస్థ అంతే మొత్తాన్ని పునరుద్ధరిస్తుంది. దీనివల్ల అదే ఏడాది మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అవసరం పడితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులోనూ కొన్ని సంస్థలు ఒక ఏడాదిలో ఒకరు ఎన్ని సార్లు ఆసుపత్రిలో చేరినా, గతంలో క్లెయిమ్ చేసిన వ్యాధులకు సైతం రీస్టోరేషన్ (అన్ లిమిటెడ్) ఇస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు సాధారణంగా 3–4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనివల్ల వాటికి కవరేజీ కోసం అన్నేళ్లు ఆగక తప్పదు. దీనికి బదులు ఏడాది, అసలు వెయిటింగ్ పీరియడ్ లేని (రైడర్) పాలసీలు మెరుగైనవి. నో క్లెయిమ్ బోనస్ అనేది ప్రీమియం తగ్గింపు రూపంలో కాకుండా, బీమా కవరేజీ పెంపు రూపంలో ఉంటే ఎక్కువ ప్రయోజనం. రూమ్ రెంట్ పరిమితులు లేకుండా చూసుకోవాలి. ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సి వస్తే (కరోనా వంటి సమయాల్లో) కవరేజీనిచ్చే డోమిసిలరీ ట్రీట్మెంట్ కవరేజీ ఫీచర్ ఉంటే మంచిదే. దరఖాస్తు తిరస్కరణ..? మంచి ఆరోగ్య చరిత్ర ఉండి, సరైన వివరాలు, డాక్యుమెంట్లు అందిస్తే నూతన సంస్థ పోర్టింగ్ అభ్యర్థనను ఆమోదించి పాలసీ మంజూరు చేస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి, ఇచ్చిన సమాచారంలో అస్పష్టత, గోప్యత ఉంటే, లేదా ఇతర కారణాలతో పాలసీ ప్రపోజల్‌ను తిరస్కరించొచ్చు. ఎందుకంటే అప్పటికే ఉన్న ఆరోగ్య చరిత్రను పాత సంస్థ నుంచి నూతన బీమా సంస్థ తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. పాత బీమా సంస్థకు దరఖాస్తు సమయంలో ఇచ్చిన దానికి భిన్నమైన సమాచారం కొత్త సంస్థకు అందించినట్టయితే తిరస్కరణకు అవకాశాలుంటాయి. అటువంటి సందర్భంలో కొత్త సంస్థను బతిమిలాడే బదులు, ఉన్న సంస్థతోనే కొనసాగడం మంచి నిర్ణయం అవుతుంది. దీనికి బదులు ప్రస్తుత బీమా సంస్థలోనే మెరుగైన ఫీచర్లతో కూడిన ప్లాన్‌కు మైగ్రేట్ అవ్వడం మరో మంచి ఆప్షన్. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించాలనేమీ లేదు. ముఖ్యంగా తనకున్న వ్యాధులకు పాత ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకుని ఉంటే పోర్టింగ్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత పాలసీ రెన్యువల్‌కు సంబంధించి ల్యాప్సెస్ ఉంటే అది కూడా తిరస్కరణకు కారణం అవుతుంది. నిబంధనల మేరకు రెన్యువల్ సమయంలో సంప్రదించకుంటే అప్పుడు పోర్టింగ్ విజయవంతం కాదు. అందుకే రెన్యువల్‌కు 60రోజుల ముందు సంప్రదించాలి. 70 ఏళ్లు దాటిన వారికి పోర్టింగ్‌కు అవకాశం ఉండదు. పోర్టింగ్ ఎలా..? నూతన సంస్థకు మారిపోవాలని నిర్ణయించుకుంటే రెన్యువల్ సమయంలోనే అనుమతిస్తారు. పాలసీ రెన్యువల్ తేదీకి 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు నూతన బీమా సంస్థకు పోర్టింగ్ గురించి తెలియజేయాలి. ఈ సమయంలో వీలు కాకపోతే, తిరిగి రెన్యువల్ వరకు వేచి చూడాల్సిందే. ప్రపోజల్ పత్రం, పోర్టబులిటీ దరఖాస్తు పత్రాలను నింపాలి. ఆరోగ్య చరిత్ర, బీమా సంస్థ కోరిన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ, ఇతర పత్రాలను కూడా అందించాలి. గత పాలసీ పరిధిలో క్లెయిమ్ చేసి ఉంటే, డిశ్చార్జ్ సమ్మరీ జోడించాలి. అనంతరం ప్రస్తుతం బీమా సంస్థకు పోర్టింగ్ సమాచారం వెళుతుంది. అప్పుడు ప్రస్తుత సంస్థ సదరు పాలసీదారుకు సంబంధించి క్లెయిమ్, ఇతర సమాచారాన్ని కొత్త సంస్థతో పంచుకోవాలి. అప్పుడు నూతన బీమా సంస్థ 15 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పాలసీ దరఖాస్తును ఆమోదిస్తే ప్రీమియం చెల్లించాలి. వీటిని గమనించాలి.. పోర్టింగ్ సమయంలో పాత ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు ఉంటే, కొత్త ప్లాన్‌లోనూ జతవుతాయి. కానీ, దీనికి కంపెనీలు షరతు పెడుతున్నాయి. ప్రస్తుత కవరేజీ రూ. 5 లక్షలు ఉండి, కొత్త సంస్థలోనూ రూ.5 లక్షలే తీసుకుంటే, పాత ప్లాన్ పరిధిలోని నో క్లెయిమ్ బోనస్ పోర్టింగ్ అవ్వదు. అదే రూ.6 లక్షలు తీసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కలుస్తుంది. పోర్టింగ్ లేదా మైగ్రేషన్‌ను కొత్త ప్రపోజల్గానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. అండర్‌రైటింగ్ నిబంధనల మేరకు ప్రీమియం నిర్ణయిస్తాయి. బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను మాత్రమే మరో బీమా సంస్థ పరిధిలోని బీమా ఇండెమ్నిటీ ప్లాన్‌కు మార్చుకోగలరు. అంతేకానీ, టాపప్ లేదా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను మార్చుకోలేరు. ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు హెల్త్ ప్లాన్‌ను పోర్టింగ్ పెట్టుకుంటే ఎలాంటి చార్జీల్లేవు. కార్పొరేట్ లేదా గ్రూప్ ప్లాన్లల ఉన్న వారికి ఇండివిడ్యువల్ ప్లాన్‌కు పోర్టింగ్ అవకాశం లేదు. వారు అదే సంస్థతో కొసాగాల్సిందే. -
అమెరికాలో ఎంఎస్ చదవాలంటే?
ఎంఎస్ ఇన్ యూఎస్..! ఆ అవకాశం లభిస్తే.. భవిష్యత్తు బంగారుమయమనే భావన! దీనికోసం ఎన్నో ప్రయత్నాలు.. కోర్సు మూడో ఏడాది నుంచే కసరత్తు ప్రారంభం! ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రవేశం ఖరారయ్యేది మాత్రం కొద్ది మందికే! నిరుత్సాహానికి గురయ్యే వారెందరో!! ఇందుకు వర్సిటీల ఎంపిక నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. కారణాలెన్నో! అమెరికాలో ఎంఎస్‌లో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. భారతీయ విద్యార్థులకు స్టడీ అబ్రాడ్ పరంగా తొలి గమ్యం.. అమెరికా. మరి ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారు? అని అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం.. ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్). ప్రఖ్యాత యూనివర్సిటీలకు నిలయమైన అమెరికా.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఏటా పది లక్షల మందికి పైగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. 2016–17 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్. ముందస్తు కసరత్తు అమెరికాలో ఫాల్ (సెప్టెంబర్–డిసెంబర్), స్ప్రింగ్ (జనవరి–మే), సమ్మర్ (జూన్–ఆగస్ట్).. ఇలా మూడు సెషన్లలో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుంది. అధిక శాతం ప్రోగ్రామ్‌లు ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఫాల్ సెషన్లో జరుగుతాయి. విద్యార్థులు తాము చేరదలచుకున్న సెషన్‌కు కనీసం 15 నుంచి 18 నెలల ముందుగా కసరత్తు ప్రారంభించాలి. ముందుగా తమకు ఆసక్తి ఉన్న కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీల జాబితా రూపొందించుకోవాలి. ఆ యూనివర్సిటీలు పేర్కొన్న అర్హత నిబంధనలు, ప్రామాణిక టెస్ట్ స్కోర్ల కనీస స్కోరింగ్ వివరాలు తెలుసుకోవాలి. ప్రతి యూనివర్సిటీకి సంబంధించి దరఖాస్తు గడువు తేదీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి. రోలింగ్ అడ్మిషన్స్ అమెరికాలో ఎర్లీ అడ్మిషన్స్ ప్లాన్, రెగ్యులర్ అడ్మిషన్, రోలింగ్ అడ్మిషన్.. అనే మూడు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. రోలింగ్ అడ్మిషన్స్ విధానంలో దరఖాస్తుకు ఎలాంటి గడువు తేదీ ఉండదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత సెషన్లలో సీట్లు భర్తీ కాని సందర్భాల్లో రోలింగ్ అడ్మిషన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఒక యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. రోలింగ్ అడ్మిషన్ సెషన్‌కు కూడా దరఖాస్తు చేసుకోవడం మంచిది. అర్హత నిబంధనలు ఎంఎస్ కోర్సుకు అమెరికాలోని యూనివర్సిటీల అర్హత నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. అధికశాతం యూనివర్సిటీలు మాత్రం 16 ఏళ్ల (10+2+4) ఎడ్యుకేషన్ విధానం ద్వారా పొందిన డిగ్రీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కొన్ని యూనివర్సిటీలు మాత్రం 10+2 తర్వాత మూడేళ్ల వ్యవధిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత యూనివర్సిటీలు (హార్వర్డ్, ఎంఐటీ, యూసీ, కార్నెగీ మిలన్ తదితర) మాత్రం తప్పనిసరిగా 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారినే అర్హులుగా పేర్కొంటున్నాయి. స్టాండర్డ్ టెస్ట్‌ల స్కోర్లు మరో ముఖ్య అర్హత నిబంధన స్టాండర్డ్ టెస్ట్ స్కోర్లు. విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న డొమైన్ ఆధారంగా జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ స్కోర్లు పొందడం తప్పనిసరి. అంతేకాకుండా జీఆర్ఈలో సబ్జెక్ట్ టెస్ట్ స్కోర్లను కూడా అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు తప్పనిసరి చేస్తున్నాయి. జీఆర్ఈలో కనీసం 300 కుపైగా పాయింట్లు సొంతం చేసుకోవడం వల్ల అవకాశాలు మెరుగవుతాయి. జీమ్యాట్‌లో 650కు పైగా స్కోర్ ఉంటే ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది.. టోఫెల్లో కనీసం 100 స్కోర్ సొంతం చేసుకుంటే టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. అకడమిక్ రికార్డ్ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు పేర్కొంటున్న నిబంధనల ప్రకారం పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు 60 శాతం పైగా మార్కులు లేదా తత్సమాన జీపీఏతో ఉత్తీర్ణత తప్పనిసరి. హార్వర్డ్, ఎంఐటీ వంటి వర్సిటీల్లో ఎనిమిది జీపీఏ అవసరం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తాము ఎంపిక చేసుకునే యూనివర్సిటీల జాబితాను రూపొందించుకోవాలి. టెస్ట్ స్కోర్‌తోపాటు మరెన్నో! అకడమిక్‌గా అద్భుతమైన ఉత్తీర్ణత శాతాలు, టెస్ట్ స్కోర్లు ఉన్నతంగా ఉన్నప్పటికీ.. మరెన్నో అంశాలు అభ్యర్థుల ప్రవేశాన్ని నిర్దేశిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్), స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ). కొన్ని సందర్భాల్లో అకడమిక్, టెస్ట్ స్కోర్లను సైతం కాదని ఎల్ఓఆర్, ఎస్ఓపీ ఆధారంగా ప్రవేశాలు పొందిన వారు సైతం ఉంటున్నారంటే వీటి ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. లెటర్ ఆఫ్ రికమండేషన్ అభ్యర్థుల సామర్థ్యాన్ని గుర్తిస్తూ సంబంధిత రంగంలోని నిపుణులైన వ్యక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలు.. లెటర్ ఆఫ్ రికమండేషన్. అభ్యర్థులు తాము చదువుకున్న యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ల నుంచి.. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వారి ఉన్నతాధికారుల నుంచి లెటర్ ఆఫ్ రికమండేషన్ తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. తమ గురించి బాగా తెలిసిన వ్యక్తులతో ఈ సిఫార్సు లేఖలు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలోని వర్సిటీలు ప్రస్తుతం కనీసం రెండు ఎల్‌ఓఆర్‌లను అడుగుతున్నాయి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అమెరికాలో ఎంఎస్‌లో అడ్మిషన్ ఖరారు చేయడంలో అత్యంత కీలకమైంది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అభ్యర్థులు అమెరికాలోని సదరు యూనివర్సిటీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు.. నిర్దిష్టంగా ఆ కోర్సునే ఎంపిక చేసుకోవడానికి కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే వివరాలు పేర్కొంటూ.. నిర్దేశిత పదాల్లో ఎస్ఓపీని సొంత మాటల్లో రాయాలి. దీన్ని యూనివర్సిటీకి సంబంధించిన అకడమిక్ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో టెస్ట్ స్కోర్లు, అకడమిక్ పర్సంటేజీలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎస్ఓపీలో అభ్యర్థి పొందుపర్చిన సమాచారం, చూపిన నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్సే.. రెజ్యూమె సైతం ఇటీవల కాలంలో అమెరికాలోని పలు యూనివర్సిటీలు.. ఎస్సే (వ్యాస రచన) రాయమని కోరుతున్నాయి. దరఖాస్తు సమయంలోనే ఏదైనా ఒక అంశం పేర్కొని.. నిర్దిష్ట పదాల్లో వ్యాసం రాయమని అడుగుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అభ్యర్థుల అకడమిక్ అర్హతలు, ఇతర స్కోర్లు పొందుపరిచే విధంగా దరఖాస్తు నమూనా ఉంటుంది. అయినప్పటికీ యూనివర్సిటీలు రెజ్యూమె లేదా సీవీని కూడా అప్లోడ్ చేయమంటున్నాయి. అభ్యర్థులు అకడమిక్ అర్హతలతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న తీరు, ప్రాజెక్ట్ వర్క్స్ వివరాలు తెలుసుకునేందుకే సమగ్ర రెజ్యూమెను అడుగుతున్నాయి. వీసాకు దరఖాస్తు అభ్యర్థులకు ప్రవేశం ఖరారైతే.. యూనివర్సిటీ ఇచ్చే కన్ఫర్మేషన్ లెటర్ ఆధారంగా ఇమిగ్రేషన్ విభాగంలో ఐ–20 ఫామ్‌ను పూర్తిచేసి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన ఇమిగ్రేషన్ విభాగం అధికారులు నిర్దేశిత తేదీల్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొచ్చేస్తామనే విధంగానే సమాధానాలు ఇవ్వాలి. అలాకాకుండా కోర్సు పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడాలనే ఉద్దేశం ఉందనే అభిప్రాయం కలిగేలా సమాధానమిస్తే.. వీసా మంజూరు కష్టమే. ఇలా.. యూనివర్సిటీల అన్వేషణ నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తేనే యూఎస్‌లో ఎంఎస్ కల సాకారం అవుతుంది. 201617 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్. ఫీజులు.. 30 వేల నుంచి 50 వేల డాలర్లు అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎంఎస్ ప్రోగ్రామ్ ఫీజులు ఏడాదికి 30 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మధ్యలో ఉంటున్నాయి. ఇవి.. ఆయా యూనివర్సిటీల స్థాయి, అభ్యర్థులు ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటాయి. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో చదవాలంటే ఏడాదికి కనీసం 50 వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే. అవసరమైన డాక్యుమెంట్లు అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ (విద్యార్హతల సర్టిఫికెట్లు). జీఆర్ఈ/జీమ్యాట్/టోఫెల్/ఐఈఎల్టీఎస్ తదితర టెస్ట్ స్కోర్లు. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్). స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ). వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్(బ్యాంక్ స్టేట్మెంట్). రెజ్యూమె/సీవీ. టాప్ యూనివర్సిటీలు ఎంఎస్ కోర్సు బోధనలో అమెరికాలో టాప్ యూనివర్సిటీల వివరాలు.. హార్వర్డ్ యూనివ్సిటీ ఎంఐటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ యూసీ–బర్కిలీ యూనివర్సిటీ ఆఫ్ షికాగో కార్నెల్ యూనివర్సిటీ యేల్ యూనివర్సిటీ -
పోలీస్ పోస్టులు ఖాళీ!
తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లు 21మంది ఉండాలి. కానీ 12మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో విధుల్లో ఉండేది 9మంది మాత్రమే. మిగతా ముగ్గురిలో ఒకరు డీసీఆర్బీ, మరొకరు రిక్రూట్‌మెంట్‌సెల్, ఇంకొకరు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హెడ్‌క్వార్టర్‌లో కొనసాగుతున్నారు. జమ్దార్లు నలుగురు ఉండగా, ఇద్దరు పీఎస్ చూస్తుంటారు. ఒకరు కోర్టు, ఇంకొకరు ఐడీపార్టీలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఇద్దరు ఏఎస్ఐలకు పోస్టింగ్ కాగా, ఒకరే ఉన్నారు. ఆయన కూడా ఇటీవల ఆరోగ్యం బాగా లేకపోవడంతో సిక్‌లీవ్ పెట్టారు. అంటే ఏఎస్ఐ ప్రస్తుతానికి లేనట్టే. ఇక ఈ స్టేషన్‌కు రైటర్ లేడు. కానిస్టేబుళ్లు 9 మంది అన్ని విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వాచ్డ్యూటీ, బందోబస్తులు, బీట్లు, రొటేషన్ ప్రకారం వారంవారం హెడ్‌క్వార్టర్‌కు రావాల్సి ఉంటుంది. ఇక్కడ సరిపోను సిబ్బంది లేకపోవడంతో పనిభారం ఎక్కువుంటుందన్న కారణంగా కొత్తవారు కూడా వచ్చేందుకు అసక్తిచూపడం లేదని తెలుస్తోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో పోలీస్‌శాఖ కీలకమైంది. అటువంటి శాఖను ఖాళీల కొరత వేధిస్తోంది. మంజూరైన పోస్టుల్లో చాలావరకు ఖాళీలున్నాయి. ఇందులో క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ (పీసీ) పోస్టులే ఎక్కువ ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం పోలీస్‌శాఖకు 1,298 పోస్టులు మంజూరైతే ఇందులో 252 పోస్టులు ఖాళీలే. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్డీపీఓస్, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెసీలు, పీసీలు అంతా కలిపి 1,298 జిల్లాకు మంజూరు పోస్టులు. ఇందులో ప్రస్తుతం 1,046 పోస్టులు భర్తీ కాగా, 252 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో వీటి సంఖ్య పెరిగింది. ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలు కావడంతో ఏ జిల్లా సిబ్బంది ఆ జిల్లాకు వెళ్లిపోయారు. దీనికితోడు పదవీ విరమణతో ఖాళీల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుత సూర్యాపేట జిల్లానుంచే ఎక్కువ మంది పీసీలు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఉన్నారు. అయితే జిల్లాల విభజనతో నల్లగొండ, యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న పీసీలు ఎక్కువగా సూర్యాపేట జిల్లాకు వెళ్లిపోవడంతో.. నల్లగొండ జిల్లాలో ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం ఖాళీల్లో ఇవే 225 ఉన్నాయి. జనాభా, శాంతి భద్రతలు, నేరాలశాతం అంశాలను ప్రాతిపదికన తీసుకొని ప్రతి పోలీస్‌స్టేషన్‌ను ఏ, బీ, సీ, డీలుగా విభజిస్తారు. ఇలా ఏ గ్రేడ్ నుంచి డీ వరకు ప్రాధాన్యత పరంగా సిబ్బందిని నియమిస్తారు. కానీ ఏ, బీ గ్రేడ్ స్టేషన్లలో కూడా ప్రస్తుతం పీసీలు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇక ఖాళీల్లో ప్రస్తుతం సీసీఎస్, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ పోస్టులతో పాటు మరో డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. శాంతి భద్రతల దృష్ట్యా ఈ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాల విభజన తర్వాత పీసీ నోటిఫికేషన్ పడింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శిక్షణలో ఉన్నారు. వీరికి పోస్టింగ్‌లు ఇస్తే ఖాళీలు భర్తీ అవుతాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఉన్న వారిపై పనిభారం.. ఇటీవల ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పోలీసులకు పనిభారం ఎక్కువైంది. గొర్రెల పంపిణీ పథకమే ఇందుకు ఉదాహరణ. గొర్రెల రీసైక్లింగ్‌కు వెళ్తున్న వాహనాలను.. పోలీస్ కానిస్టేబుల్స్ పట్టుకుంటున్నారు. అయితే ఈ వాహనాలను పట్టుకోవడంతో పాటు సంతల్లో కూడా ప్రభుత్వ పంపిణీ గొర్రెలు అమ్మకుండా నిఘా పెడుతున్నారు. పట్టుబడిన గొర్రెలపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం, కేసు ఎలా పెట్టాలని తెలియక పోలీస్ సిబ్బంది ఓవైపు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు ఈ గొర్రెల కేసు విచారించే వరకు పోలీస్ సిబ్బందే వీటికి కాపాలాగా ఉండాల్సి వస్తుంది. స్టేషన్లో పది మంది పీసీలు ఉంటే 2 నుంచి 3 వీటి కేసుపైనే.. ఆయా లబ్ధిదారులకు గొర్రెలను అప్పగించే వరకు తిరుగుతున్నారు. ఇక కోర్టు కేసులు, సివిల్ తగాదాలు, ప్రజాప్రతినిధుల బందోబస్తు, గ్రామాల్లో రాజకీయ ఘర్షణలు.. ఇలా పలు సంఘటనలకు ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. కొన్ని పీఎస్‌లలో సగమే .. జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో మంజూరైన పోస్టులకు సగం పోస్టులే భర్తీ అయ్యాయి. ఏళ్ల తరబడి మిగతా పోస్టులను భర్తీ చేయకున్నా ఉన్న పోస్టులతోనే పనులను నెట్టుకొస్తున్నారు. జిల్లాలోని సీ, డీ గ్రేడ్ పోలీస్ స్టేషన్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది సిబ్బంది ఉంటే పట్టణాలు, మండల కేంద్రాల్లో గస్తీ పెంచడమే కాకుండా బందోబస్తు కూడా పటిష్టంగా ఉండనుంది. -
అన్నీ అబద్ధాలే!
దివాకరం అబద్ధాలకు పెట్టింది పేరు. అతడిలా అబద్ధాలు చెప్పేవారు అసలు ఎక్కడా కనిపించరేమో అన్నట్టుగా అబద్ధాలు చెప్పేస్తూంటాడు. అతనికి చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు.. కుడిభుజంగా పనిచేసే ఓ వ్యక్తి తప్ప! ఏయే విధాలుగా డబ్బు సంపాదించవచ్చో ఆయా విధాల్లో సంపాదిస్తుంటాడు. అన్నీ అబద్ధాలే! ఆ అబద్ధాలే అతని వ్యాపారానికి పెట్టుబడి. రోజులు గడుస్తున్నాయి. దివాకరం అబద్ధాలతో డబ్బులు వెనకేసుకుంటూ వెళుతున్నాడు. ఊర్లో వాళ్లందరికీ తనతో కొన్ని అవసరాలు ఉండేలా చూసుకుంటున్నాడు. అవి అబద్ధాలతో ముడిపడి ఉన్నవే. భువనేశ్వరిని కలిసే వరకూ, కలిశాక కూడా ఇది ఇలాగే జరుగుతూ వచ్చింది. భువనేశ్వరి చాలా అందంగా ఉంటుంది. ఆమెకు తొలిచూపులోనే పడిపోయాడు దివాకరం. అదే విషయం చెప్పడానికి కొన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఒకరోజు ఆమెకు యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో పడినా, అదంతా జోక్ అనుకొని పట్టించుకోలేదు. కానీ అది జోక్ కాదు. భువనేశ్వరికి నిజంగానే యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉంది. దివాకరం పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కు వచ్చాడు. భువనేశ్వరి దివాకరం రావడాన్ని చూసింది. కోపంగా అతని వంక చూసింది. మనసులో ఉన్న కోపమంతా కక్కేసింది. తిడుతూనే పోతోంది. దివాకరం ఆపే ప్రయత్నం చేయలేదు. ‘‘గెట్ అవుట్! ఈ జన్మలో నీ ఫేస్ నాకు చూపించకు’’ కోపంగా చివరి మాట అంటూ ముఖం తిప్పింది భువనేశ్వరి. దివాకరం దీనంగా చూస్తూ నిలబడ్డాడు.బయటకొచ్చి తన అనుచరుడి మీద అరిచాడు. మళ్లీ కనిపించొద్దని భువనేశ్వరి చెప్పినా, కనిపిస్తూనే ఉన్నాడు. భువనేశ్వరికి దివాకరంపై కోపం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది.దివాకరం తన ప్రేమను చెప్పడానికి ఇదే సమయమని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వింత ప్రేమలేఖ రాసి పంపించాడు. భువనేశ్వరికి ఆ ప్రపోజల్ నచ్చింది. దివాకరాన్ని కలవాలని పిలిపించింది.దివాకరం భువనేశ్వరిని కలవడానికి హాస్పిటల్‌కు వచ్చాడు. ఆమె ఎదురుగా భయం భయంగా నిలబడ్డాడు. భువనేశ్వరి పూర్తిగా కోలుకుంది అప్పటికి. దివాకరం రాగానే లేచి కూర్చుంది.‘‘నీ కొత్త రకం ప్రేమలేఖ.. చూశాను.’’ అంది. ‘‘థ్యాంక్యూ’’ అన్నాడు దివాకరం సిగ్గు పడిపోతూ.‘‘నీ కుప్పిగంతులూ, వెకిలి నవ్వులు కూడా చూశాను..’’ మాట్లాడుతూనే లేచి మెల్లిగా నడవడం మొదలుపెట్టింది భువనేశ్వరి.ఇద్దరి మధ్యా కాసేపు మౌనం.‘‘నీ ప్రేమ సంగతి నాకు తెలీదు కానీ, నీది పరమ వంకర బతుకు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలే చెబుతావ్. జనాలను దారుణంగా మోసం చేస్తావ్!’’ అంటూ ఒక దగ్గర ఆగి, గోడకు ఆనుకొని భువనేశ్వరి మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టింది.‘‘నిజమేననుకోండి! కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ క్యాసెట్లో మీకు ముందే చెప్పా.’’ దివాకరం తన తప్పులను సర్దిచెప్పుకున్నాడు.సరే అన్నట్టు చూసింది భువనేశ్వరి. ‘‘నేన్నీకో పరీక్ష పెట్టదల్చుకున్నాను.’’ అంది.దివాకరం చూస్తూ నిలబడ్డాడు.‘‘నీ ప్రేమలేఖలానే అది కూడా కొత్తగా ఉంటుంది..’’ అంటూ భువనేశ్వరి మాట్లాడుతూంటే, మధ్యలోనే అందుకొని..‘‘నిజమా?’’ అని ఉత్సాహంగా ముందుకు కదిలాడు దివాకరం. ‘‘నేన్నిన్ను పెళ్లి చేస్కోవాలంటే నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి..’’ ‘‘తప్పకుండా నెగ్గుతాను. అదేంటో చెప్పండి!’’ దివాకరం మరింత ఉత్సాహం కనబరిచాడు. ‘‘నువ్వొక నెల రోజుల పాటు.. అన్నీ.. నిజాలే చెప్పాలి..’’ నెమ్మదిగా చెప్పింది భువనేశ్వరి.దివాకరం గట్టిగా నవ్వి, ‘‘కొత్త రకం పరీక్ష అంటే నేనింకా సముద్రం మీద పరిగెట్టమనో, చంద్రమండలం మీద నడవమనో చెప్తారనుకున్నా.. ఓస్ ఇంతేనా!!’’ అన్నాడు.‘చెప్పేది విను’ అన్నట్టు చూసి –‘‘ఇంకా చాలా ఉందీ.. చెప్పేది జాగ్రత్తగా విను..’’ అంది భువనేశ్వరి.దివాకరం ఉత్సాహం తగ్గింది. జాగ్రత్తగా వింటున్నాడు.‘‘నెలరోజుల పాటు.. అంటే.. ఈ రోజు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ.. అన్ని వేళలా నువ్వన్నీ నిజాలే చెప్పాలి. కల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. అంతే కాదు.. నీకు మనసులో ఏమనిపించినా,దాచుకోకుండా, అదంతా బయటకు చెప్పేయాలి.’’దివాకరం భువనేశ్వరి మాటలను శ్రద్ధగా వింటున్నాడు.భువనేశ్వరి కాసేపాగి, ఏదో గుర్తొచ్చినట్టు, ‘‘ఆ! నువ్వు ఈ నెలంతా కాలనీలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలనీ దాటిపోవద్దు. సరేనా!’’ అంటూ, చెప్పాల్సింది అయిపోయినట్టు దివాకరం వంక చూసింది.‘‘హుర్రే...!!’’ అని గట్టిగా అరిచాడు దివాకరం.‘‘ఇదిగో! ఆ కుప్పిగంతులే వద్దంటున్నా. అసలు ఈ పందెం ఎందుకు పెట్టానో తెల్సా..?’’‘‘తెలీదు..’’‘‘నిన్ను వదుల్చుకోడానికి..’’ ‘‘అంటే నేను ఈ పందెంలో గెలిచినా కూడా వదులుకుంటారా?’’ ‘‘అసలు నువ్ గెలిస్తే కదా!!’’‘‘ఒకవేళ గెలిస్తే..?’’భువనేశ్వరి కాసేపు ఏం మాట్లాడలేదు. మళ్లీ తేరుకొని.. ‘‘నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటా!’’ అంది.‘‘ప్రూఫ్ ఏంటి? తీరా నేను గెలిచిన తర్వాత.. థూ.. నాకొద్దూ అంటే?’’‘‘నువ్విలా అడుగుతావని అనుమానం వచ్చే, ఒక అగ్రిమెంట్ రాశాను. చూడు..’’ అంటూ తన బెడ్ పక్కనే పెట్టిన ఒక పేపర్‌ను దివాకరానికి చూపించింది భువనేశ్వరి. దివాకరం అది చదువుతున్నాడు. ‘‘మళ్లీ చెప్తున్నాను.. బాగా ఆలోచించుకో! ఆ తర్వాత నువ్వెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, పీక తెగినా నో ప్రాబ్లమ్. నేను మాటంటే మాటే.. పందెం అంటే పందెమే!’’ భువనేశ్వరి మాటలు వింటూ, అగ్రిమెంట్ పేపర్ చూస్తున్నాడు దివాకరం.‘‘అంత మొండిదాన్ని నేను..’’ అంది భువనేశ్వరి, చివరిమాటగా.‘‘ఓకే ఓకే! మీరింకేం చెప్పొద్దు. నేను రెడీ..’’ అన్నాడు దివాకరం.‘‘అన్నట్టు.. ఈ ఒప్పందం మనిద్దరి మధ్యే ఉండాలి. నువ్వెవ్వరికీ చెప్పకూడదు!’’ హెచ్చరిక లాంటిది జారీ చేసింది భువనేశ్వరి.‘‘పైకీ కిందికీ పదిసార్లు చదువుకో! సరే అనుకుంటేనే సంతకం పెట్టు..’’ అంది.దివాకరం ఎగిరి గంతేశాడు. సంతకం చేశాడు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఏప్రిల్ ఒకటికి విడుదలవుతుంది. -
పరిశోధనలతోనే ప్రగతి
గెస్ట్ కాలమ్ దేశ ప్రగతికి పరిశోధనలు తప్పనిసరి. ప్రధానంగా సమాజ అవసరాలు, ప్రయోజనాల దిశగాఆవిష్కరణలు చేసే సైన్స్ రంగంలో రీసెర్చ్ కార్యకలాపాలు మరింత పెరగాలి. అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే రాకెట్ ప్రయోగాల దాకా.. అన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఆవిష్కృతమైనవే’ అంటున్నారు.. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్-2014 గ్రహీత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. వెంకట మోహన్. పరిశోధనల్లో రెండు దశాబ్దాలకుపైగా అనుభవం ఉన్న ఆయన... వ్యర్థాల నుంచి జీవ ఇంధన వనరుల ఆవిష్కరణల కోసం కృషి చేశారు. దీనికి గుర్తింపుగా దేశంలో ఇంజనీరింగ్ సెన్సైస్‌లో అత్యున్నత పురస్కారంగా, సైన్స్‌లో భారతదేశ నోబెల్ బహుమతిగా భావించే ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎస్.వెంకట మోహన్‌తో ఇంటర్వ్యూ.. కృషికి తగ్గ గుర్తింపు నా పరిశోధనలకు గుర్తింపుగా నేషనల్ బయోసైన్స్ అవార్డ్ (2012), యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ అండ్ ఎల్సెవియర్ అందించే యంగ్ రీసెర్చర్ అవార్డ్ తదితర జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో లభించాయి. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్‌కు ఎంపికవడం మాత్రం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంటర్ డిసిప్లినరీతో.. ఇంటిగ్రేటెడ్ నైపుణ్యాలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటే మరిన్ని నైపుణ్యాలు, అవకాశాలు సొంతమవుతాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లోనూ నైపుణ్యం పొందితే బహుళ ప్రయోజనాలు లభిస్తాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో బయో ఇంజనీరింగ్ చదివితే పర్యావరణ కాలుష్య సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి కోర్సుల స్వరూపంలోనే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇమిడి ఉండేలా కరిక్యులం రూపొందించాలి. సైన్స్.. ఆసక్తి ఉంటే అద్భుతాల సృష్టికి మార్గం సైన్స్ కోర్సుల్లో చేరితే కెరీర్లో స్థిరపడేందుకు సుదీర్ఘ కాలం వేచి చూడాలనే ఆలోచనలో నేటి యువత ఉన్నారు. కోర్సులు పూర్తవగానే కెరీర్ సెటిల్మెంట్నే లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ సైన్స్ రంగంలో అనేక అవకాశాలున్నాయని గుర్తించాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా సైన్స్ కోర్సులవైపు యువత ఆకర్షితులయ్యేలా, పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ తదితర అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంతేకాకుండా పీహెచ్డీ స్థాయిలో అందించే ఫెలోషిప్, స్కాలర్షిప్ మొత్తాలను కూడా పెంచింది. కాబట్టి విద్యార్థులకు సైన్స్ పట్ల, సైన్స కోర్సులతో అందివచ్చే అవకాశాల గురించి అవగాహన కల్పించడంపై దృష్టిపెట్టాలి. కొంతమంది విద్యార్థులకు సైన్స అంటే ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశాలు గురించి తెలియక వేరే కోర్సుల్లో చేరుతున్నారు. వాస్తవానికి ఇతర విభాగాలతో పోల్చితే సామాజిక అవసరాలకు, దైనందిన జీవితంలో వినియోగించే అనేక వస్తువులు ఆవిష్కృతమైంది సైన్స్ పరిశోధనల ద్వారానే! దీన్ని గమనించి ఆసక్తితో అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించేందుకు సైన్స్‌లో అవకాశాలెన్నో!! బోధనలో ప్రాక్టికాలిటీ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించే విషయంలో పాఠశాల స్థాయి నుంచే మార్పు రావాలి. ఈ దిశగా ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించాలి. విద్యార్థుల ఆసక్తిని గమనించి, భవిష్యత్తు అవకాశాల గురించి తెలియజేస్తూ ప్రోత్సహించాలి. ఇందుకు చక్కటి మార్గం.. బోధనలో ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమివ్వడం. దీని ద్వారా ప్రతి విద్యార్థిలోని సహజ ఆసక్తులు, అభిరుచులు వెలుగులోకి వస్తాయి. ఫలితంగా సదరు విద్యార్థి భవిష్యత్తులో రాణించగల రంగం ఏంటో తెలుస్తుంది. ఆ మేరకు వారికి మార్గనిర్దేశనం చేసే వీలు లభిస్తుంది. యూనివర్సిటీల స్థాయిలో దేశంలో ఇప్పుడు అనేక ఇన్స్టిట్యూట్లు ఆర్ అండ్ డీ కార్యకలాపాల పెంపుదల దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, వాస్తవ అవసరాలతో పోల్చితే ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. కాబట్టి అన్ని స్థాయిల్లో, అన్ని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో ఆర్ అండ్ డీకి ప్రోత్సాహం దిశగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు, రీసెర్చ్ ఓరియెంటెడ్ సంస్థల్లో నిధులు, మౌలిక సదుపాయాల పరంగా ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. స్టేట్ యూనివర్సిటీల్లోనూ ఈ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు పరిశ్రమ వర్గాలతో ఒప్పందాల ద్వారా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించే దిశగా కృషి చేయాలి. అంతేకాకుండా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇన్స్టిట్యూట్ల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. నిత్యాన్వేషణే.. నైపుణ్యాలకు మార్గం సైన్స్ కోర్సుల్లో అద్భుత నైపుణ్యాల సాధనకు నిత్యం అన్వేషించే దృక్పథంతో ముందుకు సాగాలి. అనునిత్యం మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తుండాలి. పుస్తకంలో చదువుకున్న అంశం.. వాస్తవ పరిస్థితుల్లో, నిజ జీవితంలో ఉపయోగపడుతున్న తీరుపై అవగాహన పొందాలి. సైన్స్‌లో ఇలాంటి తులనాత్మక అధ్యయనం ఎంతో అవసరం. మనం వినియోగించే ప్రతి వస్తువు ఆవిష్కరణ వెనుక సైన్స్ భావనలు ఇమిడి ఉంటాయి. గృహోపకరణాల ఆవిష్కరణలకైనా.. గ్రహాంతర ప్రయోగాలకైనా మూలం సైన్స్‌లోనే ఉంది. అభిరుచికి అనుగుణంగా అడుగులు నేటి విద్యార్థులు తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఉన్నత విద్య, కెరీర్ పరంగా అడుగులు వేయాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలోనే దీనికి పునాదులు వేసుకోవాలి. ఈ క్రమంలో తల్లిదండ్రుల సహకారం, తోడ్పాటు కూడా ఎంతో అవసరం. సైన్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంపిక చేసుకునే విద్యార్థులు నిత్య నూతనంగా వ్యవహరించాలి. ఏ దశలోనూ నిరుత్సాహానికి గురి కాకూడదు. చేపట్టిన ప్రతి పరిశోధన లేదా ప్రాజెక్ట్ విజయం సాధించాలనుకోకూడదు. ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్న ఎన్నో సదుపాయాలు, సౌకర్యాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల ఏళ్ల తరబడి శ్రమ ఉంది. వారంతా ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాకే విజయం సాధించారు. కాబట్టి.. నిరుత్సాహం, నిస్పృహ అనే మాటలకు చోటు లేకుండా వ్యవహరిస్తే కచ్చితంగా భవిష్యత్తులో వ్యక్తిగత, వృత్తిపరమైన సంతృప్తి లభించడం ఖాయం. అంతేకాకుండా తమ పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయి అనే సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. ఉన్నత విద్య అంటే పీజీ మాత్రమే అనే ఆలోచన వదిలి పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ డిగ్రీలు కూడా ఉన్నాయని గుర్తిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు!! -
తెలంగాణ అవసరాలు ఏంటి?: కెసిఆర్
నిజామాబాద్ : తెలంగాణ అవసరాలు ఏంటి? అనే అంశంపై సమీక్ష చేస్తున్నానని, అందుకే అభివృద్ధిలో జాప్యం జరుగుతోందని తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. జిల్లా అధికారులతో ఈరోజు ఆయన ఇక్కడ సమీక్షాసమావేశం నిర్వహించారు. పథకాలు, పనులు కొత్త తరహాలో ఉండాలని సూచన చేశారు. తొందరపడొద్దు, పగడ్బంధీగా ముందుకెళ్లాలని అధికారులకు కెసిఆర్ సలహా ఇచ్చారు. విదేశాల్లో బొగ్గు కొనుగోలు చేస్తామని చెప్పారు. సింగరేణి ద్వారా 20 వేల కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యం అని కెసిఆర్ అన్నారు. -
పిసినారి కోటీశ్వరులు..
జల్సాలకు కోట్లు కోట్లు ఖర్చు చేసే వారితో పాటు కోట్లు గడించినా.. పైసా పైసా లెక్క చూసుకునే కోటీశ్వరులూ కొంత మంది ఉన్నారు. డబ్బు విలువ తెలియడం చేత ఆచి తూచి ఖర్చు చేసినా... పొదుపు, ఆదాను మరీ పీక్లెవెల్స్కి తీసుకెళ్లి పిసినారులు అనే బిరుదులు కూడా తెచ్చుకున్నారు. అలాంటి కొందరు ఆల్‌టైమ్ పిసినారి కోటీశ్వరులు, డబ్బును ఆదా చేసే విషయంలో వారి విచిత్ర అలవాట్లు చూడండి.. హెటీ గ్రీన్ ప్రపంచంలోనే అత్యంత పిసినారిగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఘనత హెటీ గ్రీన్‌ది. అత్యద్భుతమైన వ్యాపార దక్షతతో విచ్ ఆఫ్ వాల్స్ట్రీట్గా పేరొందిన ఆమె తన జమానాలో పెద్ద కోటీశ్వరురాలు. ఇక, ఆమె పీనాసితనం విషయానికొస్తే.. అర్ధణా కూడా విలువ చేయని స్టాంపు కోసం ఒక రాత్రంతా ఆమె తన వాహనంలో వెతుక్కుంటూ గడిపారు. ఒక డ్రెస్ కొంటే అది చిరిగిపోయేదాకా ప్రతి రోజూ దాన్నే వాడేవారు. ఉతికేటప్పుడు కూడా ఎక్కడెక్కడ మురికిగా ఉందో ఆ భాగాన్ని మాత్రమే ఉతుక్కుని సబ్బును ఆదా చేసేవారు. వైద్యం ఖర్చులను ఆదా చేసేందుకు కొడుకు కాలు విరిగినా సొంత వైద్యమే చేశారు. చివరికి ఆ కాలు తీసేయాల్సి వచ్చింది. మైఖేల్ బ్లూమ్‌బర్గ్ ఈయన సంపద 27 బిలియన్ డాలర్ల పైగానే ఉం టుంది. అయినా కూడా పదేళ్ల క్రితం నుంచి రెండే జతల షూలను వాడుతున్నారు. వాటిపై లేబుల్స్ చెరిగిపోయి.. రంగు వెలిసిపోయినా వాటిని విడిచిపెట్టలేదు. ఇక కాఫీలాంటివి తాగాల్సి వస్తే.. వీలైనంత తక్కువ పరిమాణం కొనుక్కుంటారట. డేవిడ్ షెరిటన్ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌లో తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసిన కోటీశ్వరుడు షెరిటన్. హోటల్లో భోంచేసినప్పుడు.. అందులో కొంత భాగం మిగిలిపోతే వదిలేసి వచ్చేయడు షెరిటన్. దాన్ని ప్యాక్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్లి, మర్నాడు తింటాడు. పదిహేనేళ్లుగా బార్బర్ ఖర్చులు లేకుండా తన జుత్తును తనే కట్ చేసుకుంటున్నాడు. -
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ
బేసిక్స్.. బీమా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంక్షిప్త రూపమే యులిప్స్. మ్యూచవల్ ఫండ్స్ కేవలం పెట్టుబడి సాధనాలు కాగా.. యులిప్స్ పథకాలు ఇటు బీమా రక్షణతో పాటు అటు పెట్టుబడి ప్రయోజనాలు కూడా కల్పిస్తాయి. పెట్టుబడులపైనా, మధ్యకాలిక రాబడులపైనా దృష్టి ఉన్నవారికి ఫండ్స్ అనువైనవి. కాగా దీర్ఘకాలికంగా పెట్టుబడి ప్రయోజనాలతో పాటు బీమా రక్షణ కూడా ఒకే సాధనం ద్వారా కావాలనుకునే వారికి యులిప్స్ అనువైనవి. మార్కెట్లో వివిధ అవసరాలకు అనుగుణమైన అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ కోసం, సంపద పెంచుకునేందుకు, పిల్లల చదువు అవసరాలు.. మొదలైన వాటన్నిం టికీ వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ఈ పాలసీలకు కట్టే ప్రీమియంలలో కొంత భాగాన్ని బీమా కంపెనీ స్టాక్ మార్కెట్లు తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా ఆయా సాధనాల్లో రిస్కులను బట్టి మనకి వచ్చే రాబడులు ఆధారపడి ఉంటాయి. యులిప్ పథకాన్ని ఎంచుకునే ముందు.. మీ రిస్కు సామర్థ్యం ఎంత ఉందనేది మీకు మీరు అంచనా వేసుకోవాలి. వివిధ పథకాల్లో చార్జీలు ఏ మేర ఉంటున్నాయో పోల్చి చూసుకోవాలి. మీరు కట్టే ప్రీమియంలో ఎంత భాగం బీమా కవరేజికి పోతోంది.. ఎంత మొత్తం ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్కి వెళుతోంది తెలుసుకోవాలి. పన్నులపరంగా ప్రయోజనాలేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి.