కెసిఆర్
నిజామాబాద్ : తెలంగాణ అవసరాలు ఏంటి? అనే అంశంపై సమీక్ష చేస్తున్నానని, అందుకే అభివృద్ధిలో జాప్యం జరుగుతోందని తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. జిల్లా అధికారులతో ఈరోజు ఆయన ఇక్కడ సమీక్షాసమావేశం నిర్వహించారు. పథకాలు, పనులు కొత్త తరహాలో ఉండాలని సూచన చేశారు.
తొందరపడొద్దు, పగడ్బంధీగా ముందుకెళ్లాలని అధికారులకు కెసిఆర్ సలహా ఇచ్చారు. విదేశాల్లో బొగ్గు కొనుగోలు చేస్తామని చెప్పారు. సింగరేణి ద్వారా 20 వేల కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యం అని కెసిఆర్ అన్నారు.