monetisation scheme
-
అసెట్ మానిటైజేషన్‌తో రూ. 4 వేల కోట్లు
కోల్‌కతా: రుణ భారం తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచుకోవడం, టర్న్అరౌండ్ సాధించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వైజాగ్ స్టీల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్ఐఎన్ఎల్) సీఎండీ అతుల్ భట్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫోర్జ్డ్ వీల్ ప్లాంటు, విశాఖలోని స్థలాల మానిటైజేషన్‌తో పాటు వ్యయ నియంత్రణ చర్యలతో దాదాపు రూ. 3,000– 4,000 కోట్లు సమీకరించుకోగలిగితే ఇందుకు సహాయకరంగా ఉండగలదని ఆయన చెప్పారు. ఉక్కు, మెటలర్జీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ అతుల్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మానిటైజేషన్ (విక్రయం, లీజుకివ్వడం తదితర మార్గాల్లో అసెట్లపై ఆదాయం ఆర్జించడం) చేపట్టగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2022–23లో ఆర్ఐఎన్ఎల్ సుమారు రూ. 3,000 కోట్లు నష్టం నమోదు చేసింది. అంతర్జాతీయంగా మందగమనంతో నిల్వలు పేరుకుపోవడం, ఉక్కుపై ఎగుమతి సుంకాలు, ముడి వనరుల లభ్యతకు భద్రత లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని భట్ వివరించారు. ఓపెన్ మార్కెట్ నుంచి ముడి ఇనుము కొనాల్సి రావడం వల్ల ప్రతి టన్నుకు రూ. 6,000 మేర ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని, దీనికి తోడు రూ. 23,000 కోట్ల భారీ రుణ భారం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మానిటైజేషన్ ప్రణాళికతో రుణభారం తగ్గి, నిర్వహణ మూలధన పరిస్థితి మెరుగుపడగలదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉన్న ఫోర్జ్డ్ వీల్ ప్లాంటుపై ఆర్ఐఎన్ఎల్ రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!
వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్, ‘యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్’(వైపీపీ) ద్వారా డబ్బులు సంపాదించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకుందుకు సంబంధించిన అర్హత అవసరాలను సగానికి తగ్గించేసింది.ముఖ్యంగా పేమెంట్ చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్లతో సహా షార్ట్ వీడియో క్రియేటర్లకు మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్ చేసింది. ఇదీ చదవండి: Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే సవరించిన విధానం ప్రకారం, క్రియేటర్లు ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే వైపీపీలో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా వెయ్యి సబ్స్క్రైబర్లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు. అంతేకాదు గతంలో 4,000 వాచ్ హవర్స్, 10 మిలియన్లతో పోలిస్తే ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్ లేదా 3వేలు వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చేయాడ్ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుందనేది తెలిసిన సంగతే. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్, యూకే, కెనడా, తైవాన్,దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్ నివేదించింది. ఇతర ప్రదేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నప్పటికీ భారత్‌లో ఈ నిబంధన ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేదు. ఇలాంటిమరిన్ని ఆసక్తికర క థనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సుప్రసిద్ధ సంస్థ అశోక్ హోటల్ అంచనా విలువను ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా ఢిల్లీలోని కీలక ప్రాంతంలోగల అశోక్ హోటల్‌కు రూ. 7,049 కోట్ల సంకేత విలువను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 25 ఎకరాలలో విస్తరించిన ఈ ఆస్తి విక్రయాన్ని పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టనుంది. పెట్టుబడిదారులతో చర్చలు(ఇన్వెస్టర్ కన్సల్టేషన్) ఇప్పటికే ప్రారంభంకాగా.. క్యాబినెట్ నోట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆస్తుల మానిటైజేషన్(ఎన్ఎంపీ) జాబితాలో అశోక్ హోటల్, సమీపాన గల సామ్రాట్సహా టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన 8 ఆస్తులున్నాయి. 2021 ఆగస్ట్‌లోనే సీతారామన్ నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల విలువైన ఎన్ఎంపీ కార్యాచరణకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా విభిన్న మౌలిక రంగ ఆస్తుల విలువను అన్‌లాక్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ. 33,422 కోట్లు మౌలిక సంబంధ శాఖలతో చర్చల ద్వారా నీతి ఆయోగ్ ఎన్ఎంపీ నివేదికను రూపొందించింది. ఈ నెల 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎన్ఎంపీ పురోగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 33,422 కోట్ల విలువైన ఎన్ఎంపీని సాధించింది. 2021-22లో ప్రభుత్వం రూ. లక్ష కోట్ల లావాదేవీలు పూర్తిచేయడం ద్వారా తొలి ఏడాది లక్ష్యం రూ. 88,000 కోట్లను అధిగమించడం గమనార్హం! -
ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే !
న్యూఢిల్లీ: ఎయిరిండియా ప్రయివేటైజేషన్ తదుపరి అనుబంధ సంస్థల మానిటైజేషన్ పనులను ప్రారంభించనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. అలయన్స్ ఎయిర్‌సహా నాలుగు అనుబంధ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను మానిటైజ్ చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 14,700 కోట్లకుపైగా విలువైన భవనాలు, భూమి తదితర ఆస్తులను ఇందుకు వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఎయిరిండియాకు చెందిన ఈ నాలుగు అనుబంధ సంస్థలు ఏఐఏహెచెఎల్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ(ఎస్పీవీ)లో భాగమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నెల 8న ఎయిరిండియాను రూ. 18,000 కోట్ల విలువైన బిడ్‌తో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా గ్రూప్ నగదు రూపేణా రూ. 2,700 కోట్లు చెల్లించనుంది. అంతేకాకుండా రూ. 15,300 కోట్ల రుణభారాన్ని స్వీకరించనుంది. ఈ డీల్ డిసెంబర్‌కల్లా పూర్తికావచ్చని అంచనా. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తోపాటు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సంస్థ ఏఐఎస్ఏటీఎస్ సైతం టాటా గ్రూప్ గూటికి చేరనున్నాయి. చదవండి : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు? -
ఎవరి కోసం ఈ అప్పగింత?
‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ నష్టదాయకం. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన మౌలిక రంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందించిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుంటోంది. గత అనుభవాలను పరిశీలించినట్లయితే, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల స్వాధీనం అనేది పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. నష్టాలపాలవుతున్న ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం డాంబిక పదజాలం వెనుక దాక్కుంటోంది కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్, స్టేషన్లు, ఇంధన పైప్ లైన్లు, టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, వేర్‌హౌస్‌లు, స్టేడియంలు వంటి ప్రభుత్వ ఆస్తులను బడా ప్రైవేట్ మదుపుదారులకు స్వాధీనం చేయనున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి నాలుగేళ్ల కాలంలో రూ.6 లక్షల కోట్ల నగదు సమీకరణ ఈ పథకం లక్ష్యం. ఈ భారీ మొత్తాన్ని కొత్త మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇది ప్రైవేటీకరణ ఏమాత్రం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి వాదించారు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఉనికిలో ఉన్న, పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టుల నుంచి రాబడులు ఆర్జించడానికి ప్రైవేట్ మదుపుదారులకు నిర్దిష్ట కాలం వరకు వాటిపై హక్కులను తాత్కాలికంగా ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగిస్తున్నామని నిర్మలా సీతారామన్ వక్కాణించారు. అయితే ఈ ఆస్తులపై యాజమాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడ నాలుగు అంశాలను చర్చించాల్సి ఉంది. మొదటిది– ఉపయోగం లేకుండా వృ«థాగా ఉంటున్న ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడమే జాతీయ నగదీకరణ లక్ష్యం అని చెబుతున్నారు. కానీ ఇలా ప్రైవేట్ పరిశ్రమలకు అప్పగించిన ఆస్తులు నిర్దిష్టకాలం తర్వాత ప్రభుత్వానికి తిరిగి దఖలుపర్చడం జరిగినప్పటికీ, తదుపరి దశ నగదీకరణ కోసం వీటిని మళ్లీ మార్కెట్లోకి ప్రభుత్వం పంపించగలదు. ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన వద్ద ఉన్నమౌలికరంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందిం చిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుం టోంది. కానీ గత అనుభవాల బట్టి, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. పైగా ప్రభుత్వ ఆస్తుల వేలం ప్రారంభానికి ముందే వాటిద్వారా ఇంత వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఆస్తుల అమ్మకాల ద్వారా లభించే మొత్తం అంత అధికంగా ఉండదు. రెండు – ప్రభుత్వ మాలిక రంగ ఆస్తులను తీసుకుని, వాటిని నిర్వహించడం ద్వారా, వాటి సేవల అమ్మకాల నుండి వచ్చే రాబడులపై ప్రైవేట్ రంగానికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఈ ఆస్తులకు యజమానిగా ఉన్నప్పటికీ, ధరలు నిర్ణయించడం వాణిజ్యపరంగా ఉంటుంది. ప్రైవేట్ రంగం ఆశించే అధిక రాబడులు సిద్ధించాలంటే వినియోగదారులపై భారీగా యూజర్ చార్జీలు విధించాల్సి ఉంటుంది లేదా ఈ రాబడుల విషయంలో వచ్చే వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులను పంపిణీ చేయవలసి ఉంటుంది. రాబడులు తక్కువగా ఉండి లేదా పరిమితంగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వ సహాయం గణనీయంగా ఉండాలి. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. మూడు – తగినన్ని రాబడులను ఆర్జించడానికి ప్రైవేట్ రంగం ఖర్చులను తగ్గించుకునే స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేయవచ్చు. వీటిలో కార్మికులు, సిబ్బందిపై పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. లేబర్ ఖర్చులను తగ్గించే ప్రయత్నం వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగింపు వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. సంఘటిత కార్మిక మార్కెట్ల కోసం ప్రమాణాలు స్ధిరంగా కొనసాగించే ప్రభుత్వరంగ పాత్ర ఈ విషయంలో పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా దాని ప్రాధాన్యతను తొలగించవచ్చు కూడా. చివరిది – ప్రభుత్వ ఆస్తులను సాధించిన ప్రైవేట్ రంగ మేనేజర్లు వాంఛనీయమైన సేవలను అందించే విషయమై ప్రభుత్వం ఏ రకమైన పాత్ర నిర్వహిస్తుంది అనే అంశంపై ఈ జాతీయ నగదీకరణ విధానం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ లక్ష్యం కోసం రెగ్యులేటరీ వ్యవస్థను అమలు చేసినట్లయితే, అది ఖర్చుతో కూడుకున్నది. కాలహరణం కూడా జరగవచ్చు. దీనివల్ల అధిక ఖర్చులతో కూడిన సేవల నాణ్యత నిర్లక్ష్యానికి గురై క్షీణించవచ్చు కూడా. ఆస్తుల నగదీకరణపై ఒక్కమాటలో చెప్పాలంటే, గ్రీన్ ఫీల్డ్ ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పెట్టుబడి వనరులను సమీకరించడం అంటే బడా వ్యాపార వర్గాల చర్యలకు ఈ రంగం మొత్తాన్ని విస్తరించజేయడమే అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే వినియోగదారులు లేదా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టే ఖర్చుతో బడా పారిశ్రామిక వర్గాలు అధిక రాబడులను ఆర్జిస్తాయి. అంటే సంపద అనే పిరమిడ్‌లో శిఖరాగ్రాన ఉంటున్న వర్గాలవారికే మరింత ఆదాయాన్ని, సంపదను పంపిణీ చేయడమే నగదీకరణ అంతిమ లక్ష్యం. ప్రజా సంపదను తాకట్టు పెడుతున్న కుంభకోణాన్ని తలపించే ఈ పథకం కొంతమంది ఎంపిక చేసుకున్న వాణిజ్య వర్గాలను మరింతగా బలపర్చడానికే ఉపయోగపడుతుంది తప్పితే కేంద్రప్రభుత్వం ఘనంగా చెబుతున్నట్లుగా కొత్త ఆస్తుల సృష్టికి ఏమంత పెద్దగా దోహదం చేయదు. జాతీయ మౌలిక వసతుల కల్పనా రంగంతో సహా పలు కీలక ప్రాజెక్టుల్లో వచ్చే అయిదేళ్ల కాలంలో మొత్తం 111 లక్షల కోట్ల రూపాయలను మదుపు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం లేదా నగదీకరణ పథకం ద్వారా వస్తుందని భావిస్తున్నది 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కొత్త మౌలిక రంగ ప్రాజెక్టులకు ఈ నగదీకరణ పథకం ద్వారా అందేది అందులో అయిదు శాతం మాత్రమే. వాస్తవానికి, గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రజాధనం వెచ్చించి సృష్టించిన అపార సంపదలను బడా వాణిజ్య వర్గాలకు కట్టబెట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అయిదేళ్ల కాలంలో ముట్టేది అయిదు శాతం కంటే తక్కువే అనేది చేదు నిజం. ఇది పథకం ప్రకారం రూపొందిస్తున్న భారీ కుంభకోణం తప్ప మరేమీ కాదు. నగదీకరణ వాస్తవ రాబడి ఎంత? ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు 25 సంవత్సరాల పాటు లీజు లేదా రెంట్‌కు అప్పగించడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల రాబడిని కేంద్రం ఆశిస్తోంది. కానీ ప్రభుత్వానికి అంతిమంగా మిగిలేది పెద్దగా ఉండదని చిన్న ఉదాహరణ చెబుతుంది. ఆస్తుల విలువ ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం. ఈ సంపదపై సంవత్సరానికి 4 శాతం రాబడి వస్తుందనుకుందాం (ద్రవ్యోల్బణం తీసివేశాక). అయితే ప్రైవేటు వ్యాపారులు వాస్తవ వడ్డీరేటు అంచనా 6 శాతం అనుకుంటే ఈ వందరూపాయల సంపదపై వారికి వచ్చేది రూ. 51.3. దీన్ని రౌండ్ ఫిగర్ కింద 50గా మారిస్తే 25 ఏళ్లకాలానికి 4 శాతం వార్షిక రాబడి కింద వంద రూపాయల ఆస్తిపై రూ.50 రాబడి వచ్చినట్లు లెక్క. అంటే ఆస్తుల నగదీకరణ కింద అప్పగించిన ప్రతి వంద రూపాయలకు ప్రైవేట్ ఆపరేటర్‌కి వచ్చే రాబడి 50 రూపాయలన్నమాట. దీంట్లోంచి పెట్టుబడిపై ఆశించే రాబడిని తీసివేయాలి. తన మదుపుపై 50 శాతం కనీస రాబడిని ప్రైవేట్ వ్యాపారి ఆశిస్తున్నట్లయితే, ప్రతి రూ.100 ఆస్తిపై రూ.35లను చెల్లించడానికి అతడు సిద్ధపడతాడు. ఇప్పుడు అసలు లెక్క వస్తుంది. ఆరు లక్షల కోట్ల మార్కెట్ విలువ నుంచి రెంటల్ తదితర ఖర్చులను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే అసలు రాబడి రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే. వాస్తవానికి కేంద్రప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధ్వంసకర నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవస్థను నిశ్శబ్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. 2019లో కార్పొరేట్ రంగానికి పన్నుల కోత ద్వారా రూ.1.45 లక్షల కోట్లను మిగిలించడం అతిపెద్ద విధ్వంసకర నిర్ణయం. జీడీపీ వృద్ధి నిరంతరాయంగా పతనం చెందడం, ఆర్థికంగా తప్పుడు నిర్ణయాల వల్ల రాబడులు తగ్గిపోవడం, వీటికి తోడు కార్పొరేట్ పన్ను కోతల భారం నుంచి తప్పించుకునేందుకు చమురు ధరను పెంచుతూ పోయారు. ప్రత్యక్ష పన్నులను పెంచడం ద్వారా దిగువ మధ్యతరగతి వినియోగదారులను పరోక్షంగా దెబ్బ తీశారు. దీంతో జీడీపీ పతన బాట పడుతూనే వచ్చింది. ఆస్తుల అప్పగింత ద్వారా వచ్చే రాబడిని ప్రభుత్వం ఏం చేస్తుందనేది ముఖ్యం. పెరిగిన ప్రభుత్వ వినియోగానికి రాబడిని ఉపయోగిస్తూ వస్తున్నారు. మౌలికరంగంపై మరింత పెట్టుబడి పెడతామంటున్నారు కానీ మితిమీరిపోయిన ప్రభుత్వ రుణాన్ని చెల్లించడానికి అది సరిపోతుంది. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఏవీ వాస్తవంగా అమలు కాలేవన్నది నిజం. – ప్రొఫెసర్ సి.పి. చంద్రశేఖర్, ఆర్థిక రంగ నిపుణులు -
ఆస్తుల నగదీకరణ తప్పదు!
‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ మంచిదే. ప్రైవేట్ పరిశ్రమకు కట్టబెడుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అంతిమంగా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయి. నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల సమీకరణ ద్వారా మౌలిక వసతులను మెరుగుపర్చడమే నగదీకరణ లక్ష్యం. ఇది ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని అంచనా. నిరర్ధక ఆస్తులను వాణిజ్యానికి అప్పగించడం లాభసాటి అని కేంద్రం భావన. ఆగస్టు నెల చివరివారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ ఆస్తుల నగదీకరణ విధానాన్ని (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యా లకు అప్పగించడం ద్వారా 2021–22 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల నగదు సమీకరించడమే దీని లక్ష్యం. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఈ నగదీకరణలో భాగంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యు త్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ విధానం కింద భారతీయ రైల్వేకి చెందిన 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 265 గూడ్స్ షెడ్లు, 15 రైల్వే స్టేడియంలు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు. అయితే జాతీయ నగదీకరణ విధానం కింద అప్పగిస్తున్న ఆస్తులు ఆ తర్వాత కూడా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. కొంతకాలం ప్రైవేట్ నిర్వహణ కింద ఉన్న తర్వాత వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. ఈ కొత్త విధానం కింద ప్రభుత్వం మౌలిక వసతుల రంగంలో పెడుతున్న వ్యయాన్ని పెంచేలా నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని మంత్రి వ్యాఖ్య. మౌలిక వసతుల రంగంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరముందని, ప్రభుత్వ రంగ మౌలిక వసతుల ఆస్తులను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం అతి ముఖ్యమైన ఆర్థిక ఎంపిక అని, నూతన మౌలిక వసతుల నిర్మాణానికి ఇది చాలా ముఖ్యమైనదని మంత్రి సెలవిచ్చారు. ఈ కొత్త విధానంలో భాగంగా విమానయాన రంగం నుంచే దాదాపు రూ. 20,800 కోట్ల ఆస్తులను ప్రైవేట్‌కి అప్పగించనున్నారు. టెలికం రంగం నుంచి రూ. 35,100 కోట్ల ఆస్తులను నగదీకరణ కింద అప్పగించనున్నారు. ఇకపోతే రైల్వే రంగం నుంచి రూ. లక్షా 50 వేల కోట్లు, రహదారుల రంగం నుంచి రూ. లక్షా 60 వేల కోట్లు, విద్యుత్ పంపిణీ రంగం నుంచి రూ. 45,200 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ నిర్వహణకు అప్పగిస్తారు. ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని కేంద్రం అంచనా. దీనికి గాను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నగదీకరణలో నాలుగు ప్రయోజనాలున్నాయి. 1. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాబడులను పెంచడం కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, ప్రభుత్వ రంగ యాజమాన్యంలోని సంస్థల ఆర్థిక స్థితి విధ్వంసానికి గురైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతానికి పడిపోయింది. ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతానికి పెరిగింది. లాక్ డౌన్ల వల్ల ప్రభుత్వ రాబడులు క్షీణించిపోవడమే కాకుండా, పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని బాగా పెంచాల్సి వచ్చింది. దానికి తోడుగా ప్రభుత్వ, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూండటం కూడా తెలిసిన విషయమే. ఇవి భారీ స్థాయిలో రుణాలు, నష్టాల బారినపడి కునారిల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడుల ఉపసంహరణ చర్యలు తప్పనిసరయ్యాయి. భారతదేశంలో నష్టాల బారిన పడుతున్న పీఎస్‌యూల సంఖ్య 2015–16లో 79 నుంచి 2019–20 సంవత్సరానికి 84కు చేరుకుంది. ఇదే కాలానికి లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 175 నుంచి 171కి పడిపోయిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివరించారు. వీటిలో 30 ప్రభుత్వ రంగ సంస్థల నష్టం ఇప్పటికే రూ. 1,06,879 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ విధానం ప్రభుత్వానికి అదనపు రాబడులను తీసుకువస్తుంది. 2. పీఎస్‌యూలకు బడ్జెటరీ మద్దతును తగ్గించడం ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూలధన వ్యయ అవసరాలను నెరవేర్చుకోవడానికి, అంతర్జాతీయ సంస్థలకు రుణాలు తిరిగి చెల్లించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొంత నగదును వాటికి అప్పగిస్తోంది. రుణ సేవలు, వీఆర్ఎస్ పథకాలు, ఉపశమన చర్యలు, రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలు వంటివి వీటికి అదనం. ఉదాహరణకు, ఆర్థిక స్థితి దిగజారిపోయిన ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణ కోసం కేంద్రప్రభుత్వం రూ. 70 వేల కోట్ల ప్యాకేజీనీ ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ వల్ల దేశ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలకు బడ్జెటరీ కేటాయింపులు కొన్ని సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గుముఖం పడతాయని అంచనా. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు కూడా. పైగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, ద్రవ్యస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వం పీఎస్‌యూలకు తప్పనిసరిగా పెడుతున్న వ్యయాన్ని సామాజిక సంక్షేమ ప్రాజెక్టులు వంటివాటికి ఉపయోగించవచ్చు. 3. కొత్త మౌలిక వసతుల కల్పనకు నిధులు లభ్యం ప్రభుత్వం నగదీకరణ ద్వారా తన వద్ద నగదు నిల్వలను పెంచుకుంటే కొత్త ఆస్తులను సృష్టించవచ్చు. ఇది దానికదేగా ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. జీడీపీలో పెట్టుబడుల శాతం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో మహమ్మారి అనంతరం డిమాండు పునరుద్ధరణ చర్యలకు ప్రైవేట్ రంగం వేచి చూస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థల వద్ద వనరులు తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో జాతీయ ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులను పునరుద్ధరిస్తుంది. కోవిడ్ –19 వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకునేలా చేయవచ్చు. పీఎస్‌యూలు నిర్మాణ రంగ నష్టాలను ఎదుర్కొంటున్నందున వాటి ఆస్తుల నగదీకరణను నిరంతరంగా చేపట్టాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రైవేట్ రంగం నష్టభయం లేని ఆస్తుల అండతో ముందుకెళుతోంది. పైగా పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల జాప్యం ద్వారా నష్టం, వ్యాజ్యాలు వంటివి ప్రైవేట్ రంగానికి ఉండవు. 4. ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆశిస్తున్న నగదు పరిమాణంతో ప్రభుత్వరంగ పరిశ్రమల విలువ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గతి శక్తి ప్రణాళికకు గొప్ప చేయూత లభిస్తుంది. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో సాగే ఆ సృజనాత్మక పద్ధతి వల్ల కార్పొరేట్ రంగం ఆకాంక్షలకు ఊతం లభిస్తుంది. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ బహువిధాలుగా లాభపడుతుంది. ఇంతవరకు ఉపయోగంలో లేకుండా వృథాగా పడివున్న ఆస్తులను ప్రైవేట్ రంగం సమర్థంగా ఉపయోగించుకుని కొత్త ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పెంచగలుగుతుంది. ప్రభుత్వ రంగ ఆస్తులను వీలైనంతవరకు విడుదల చేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం దృఢ నిర్ణయాలు తీసుకొనక తప్పటం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. – అమితాబ్ తివారీ, ఆర్థిక రంగ విశ్లేషకులు (యాహూ సౌజన్యంతో) -
ఆస్తుల విక్రయానికి రోడ్‌మ్యాప్ విడుదల చేసిన కేంద్రం
విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. నిదుల సమీకరణ కోసం కేంద్రం భారీ ప్రణాళిక రచిస్తోంది. ఈ రోజు దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఆగస్టు 23) నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్(ఎన్ఎంపి)ను ప్రారంభించారు. ఇందులో భాగంగా పర్యవేక్షణ లోపించిన పలు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి నగదుగా మార్చాలని భావిస్తుంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేది ప్రభుత్వం ఆస్తుల ద్రవ్యీకరణ చొరవకు మధ్యకాలిక రోడ్ మ్యాప్ గా పనిచేస్తుందని నీతి అయోగ్ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత గడువులోగా తిరిగి తీసుకుంటాం.. ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా కేంద్రం రూ.6 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తుంది. ఈ జాబితాలో జాతీయ రహదారులతో సహా పవర్ గ్రిడ్ పైప్ లైన్ల ఆస్తుల ఉన్నాయి. ఆస్తుల ద్రవ్యీకరణ కోసం హైవేలు, రైల్వేలు, విద్యుత్ మొదటి మూడు రంగాలుగా కేంద్రం గుర్తించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రణాళికను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా మాట్లాడారు.. "ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల ఆస్తులను మరింతగా పర్యవేక్షించొచ్చు. వీటిలో పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను పెంచవచ్చు. అయితే మేం వీటిని అమ్మేస్తున్నాం అనే అనే వారికి ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ఈ ఆస్తులను పర్యవేక్షిస్తాం. అయితే, యాజమాన్య హక్కులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివే, నిర్దేశిత గడువులోగా తిరిగి మళ్లీ వాటిని తీసుకుంటాము" అని సీతారామన్ పేర్కొన్నారు. ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్ లైన్ల ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తోంది. వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా రంగాలన్నీ ప్రైవేట్ పరం చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఎయిర్‌పోర్టు నిర్వహణలో 'పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)' సత్ఫలితాలిస్తోందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని రైల్వేస్టేషన్లకు కూడా విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజా అసెట్ మానిటైజేషన్‌లో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. -
రీట్స్ ద్వారా సీపీఎస్ఈ స్థలాల విక్రయం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాల విక్రయానికి రీట్స్ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృ ఆస్తుల విక్రయానికి కూడా రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది. రీట్స్ విధానంపై ఆర్థిక శాఖ చూపు.... వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ ఆస్తులను పూర్తిగా అమ్మేయడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ, లేదా రీట్స్ విధానాన్ని గానీ చేపట్టాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది. అలాగే శతృ స్థిరాస్తుల విక్రయానికి రీట్స్‌ను పరిశీలించాలని సదరు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పాకిస్తాన్, లేదా చైనా దేశాలకు వలస వెళ్లి భారత పౌరసత్వం కోల్పోయిన పౌరుల ఆస్తులను శతృ ఆస్తులుగా పరిగణిస్తారు. శతృ ఆస్తులకు కస్టోడియన్‌గా హోమ్ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది. 2014లోనే రీట్స్ నిబంధనలు... రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ 2014లోనే రూపొందించినా, ఇవి ఇంకా ప్రాచుర్యం పుంజుకోలేదు. ఇటీవలనే ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థకు చెందిన రీట్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్, అమెరికాకు చెందిన ప్రముఖ పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌లు సంయుక్తంగా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. రూ.300 ఇష్యూ ధరతో ఇటీవలనే ఐపీఓకు వచ్చిన ఈ సంస్ట్ రీట్ ఇప్పుడు రూ.337 ధర వద్ద ట్రేడవుతోంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా రీట్స్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. రీట్స్ విధానంలో స్థలాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. -
మోదీ స్కీమ్‌కు 200 కిలోల షిరిడీ బంగారం!
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌కు దేవాలయాల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటీవలే సిద్ధి వినాయక దేవాలయం 40 కేజీల బంగారాన్ని ఈ పథకం కింద డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకోగా తాజాగా షిరిడీ సాయి బాబా ఆలయం నిర్వాహకులు ఇదే బాటలో పయనించాలని భావిస్తున్నారు. అయితే షిరిడీ సాయి దేవాలయ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో.. 200 కేజీల బంగారాన్ని ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి గతంలో బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకిగా ఉంది. భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని కరగదీయొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా బంగారాన్ని డిపాజిట్ చేసే విధంగా కోర్టు నుండి అనుమతులు పొందడానికి పిల్ దాఖలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. బంగారంపై వచ్చిన వడ్డీని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని, కోర్టు నుండి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే షిరిడీ ఆలయంలోని బాబా విగ్రహంపై ఉన్నటువంటి 180 కేజీల బంగారాన్ని మాత్రం అలాగే ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. అది కాకుండానే 200 కిలోల బంగారం షిరిడీ ఆలయానికి ఉంది. బంగారానికి భద్రత ఏర్పాట్లు చేయడం ఆలయ నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారిన నేపథ్యంలో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేయాలని నిర్ణయించారు.