వడ్డీరేట్లకు ముందుంది మంచికాలం..!
ముంబై : కార్లు, గృహాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ కొనుగోలు చేపట్టిన వారికి శుభవార్త. వీటి కొనుగోలుపై తీసుకున్న రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయట. ఎమర్జింగ్ బాండ్ మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గుతాయనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. గత మూడు నెలల్లో, స్వల్పకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు సౌత్ వర్డ్ డ్రిఫ్ట్ లో కదలాడుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం.. గత కొన్ని నెలలుగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎమ్ఓ)లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దూకుడుగా నిర్వర్తించడమే. మార్కెట్లోకి నగదును ఎక్కువగా పంప్ చేయడంతో తేలికగా ద్రవ్య పరిస్థితిలోకి మార్చుకునే అవకాశం కల్పిస్తూ...ఆర్ బీఐ ఆ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీంతో లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడితే, షార్ట్ టర్మ్ రేట్లు దిగొస్తాయని చెబుతున్నారు.. దీంతో తక్కువ రేట్లకే రుణాలు లభ్యమవుతాయని అంచనా వేస్తున్నారు.
నికర ద్రవ్య అవసరాలు బ్యాకింగ్ సిస్టమ్ లో రూ.1.06 లక్షల కోట్ల నుంచి గత వారంలో రూ.10,361 కోట్లకు పడిపోయాయి. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో కూడా 91 రోజుల ప్రభుత్వ ట్రెజరీ బిల్లు రేట్లు కూడా 6.90శాతం నుంచి 6.50శాతానికి తగ్గాయి. కాల్ మనీ రేట్లు కూడా 6.40 శాతం నుంచి 5.91శాతానికి దిగొచ్చాయి. 80వేల కోట్ల ఓఎమ్ఓ కొనుగోలుతో ఆర్ బీఐ కావాల్సిన తటస్థ ద్రవ్యాన్ని మొదటి త్రైమాసికంలో సాధించిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, క్రెడిట్ అండ్ మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ సౌమ్యజిత్ నియోగి తెలిపారు. అదేవిధంగా 2016 జూన్ లో నగదు సర్క్యులేన్ తగ్గించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లిక్విడిటీ సిస్టమాటిక్ మారిన దగ్గర్నుంచి ఎక్కువ ఓఎమ్ఓలు జరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ విశ్వసిస్తోంది. ఒకవేళ ఓఎమ్ఓలను ఆర్ బీఐ ఇలానే కొనసాగిస్తే.. సెప్టెంబర్ కల్లా 50 బేసిస్ పాయింట్లను బ్యాంకు రేట్లలో కోత విధిస్తాయని ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ఇంద్రానిల్ సేన్ గుప్తా అభిప్రాయపడుతున్నారు.