liquidity improves
-
RBI Monetary Policy: రుణాలు మరింత భారం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4%గా ఉన్న రెపో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. మరింత పెరగవచ్చని సైతం తాజాగా ఆర్బీఐ సంకేతాలిచ్చింది. తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. జీడీపీ అంచనాలు కట్... వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే రెపోరేటు ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశ్యం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. కాగా, పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7 శాతంగా ఉంటుందన్న తన అంచనాలను యథాథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో మాత్రం అంచనాను కిత్రం 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ కుదించింది. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7% కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతం కాగా, క్యూ2, క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1%, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ► డాలర్ మారకంలో రూపాయి విలువపై జాగ్రత్తగా పరిశీలన. సెప్టెంబర్ 28 వరకూ ఈ ఏడాది 7.4 శాతం పతనం. రూపాయిని నిర్దిష్ట మారకం ధర వద్ద ఉంచాలని ఆర్బీఐ భావించడం లేదు. తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి ఆర్బీఐ చర్యలు ఉంటాయి. వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బాగుంది. ► ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డాలర్ బలోపేతం అమెరికన్ బాండ్ ఈల్డ్ పెరగడం వంటి మార్పులే కావడం గమనార్హం. ► రూపాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నాలుగైదు దేశాలు, అనేక బ్యాంకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ► 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 16.2 శాతంగా ఉంటుందని అంచనా. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకు జరుగుతుంది. నేటి నుంచి టోకెనైజేషన్ దాదాపు 35 కోట్ల కార్డుల వివరాలు, లావాదేవీల గోప్యత లక్ష్యానికి సంబంధించిన టోకెనైజేషన్ వ్యవస్థ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆగస్టు నాటికి వ్యవస్థలో 101 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 40% లావాదేవీల టోకెనైజేషన్ జరిగింది. వీటి విలువ దాదాపు రూ.63 కోట్లు. టోకెనైజేషన్ వ్యవస్థలో చేరడాన్ని తప్పనిసరి చేయకపోవడం వల్ల ఈ వ్యవస్థ వేగంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. -
దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు
ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్ రేటింగ్స్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్‌తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. రిస్క్‌కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్సెక్యూర్డ్వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్‌డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే. క్రెడిట్ స్కోరే ప్రామాణికం.. ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్బీఐ 6.7 శాతం, కోటక్ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు. -
మార్కెట్‌కు ప్యాకేజ్ బూస్టర్
కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా ఆర్బీఐ కొన్ని లిక్విడిటీ పెంచే చర్యలను తీసుకుంది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. రూపాయి మారకం పుంజుకోవడం, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవడం కలసివచ్చాయి. అమెరికాలో కరోనా కేసుల చికిత్సలో గిలీడ్ ఔషధం మంచి ఫలితాలను చూపిస్తోందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, సెన్సెక్స్ 31,500 పాయింట్లు, నిఫ్టీ 9,250 పాయింట్ల ఎగువున ముగిశాయి. సెన్సెక్స్ 986 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 9,267 పాయింట్ల వద్ద ముగిసింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.22 శాతం, నిఫ్టీ 3.03 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నెల గరిష్టానికి చేరాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 429 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు చొప్పున పెరిగాయి. స్టాక్ సూచీలు వరుసగా రెండో వారమూ లాభపడ్డాయి. అదిరిపోయే ఆరంభం... సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభంలోనే దుమ్మురేపాయి. ఆర్బీఐ గవర్నర్ ఉదయం గం.10లకు కీలక ప్రకటన చేయనున్నారన్న వార్తల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాపప్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,054 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. మ«ధ్యాహ్నం లాభాలు తగ్గినా, రోజంతా ఇదే జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,116 పాయింట్లు, నిఫ్టీ 331 పాయింట్ల మేర పెరిగాయి. లాభాలకు కారణాల్లో కొన్ని... ఆర్బీఐ లిక్విడిటీ బూస్ట్: పలు చర్యలకు తోడు అవసరమైతే, మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభయమివ్వడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంచనాల కన్నా చైనా జీడీపీ బెటర్ : ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో చైనా జీడీపీ 6.8 శాతం తగ్గి్గంది. జీడీపీ గణాంకాలు వెల్లడించినప్పటి నుంచి ఇదే తొలి తగ్గుదల అయినప్పటికీ, అంచనాల కంటే (జీడీపీ 8.2 శాతం తగ్గుతుందన్న అంచనాలున్నాయి)తక్కువగానే జీడీపీ తగ్గడం... ఇన్వెస్టర్లకు ఒకింత ఊరటనిచ్చింది. రెమ్డిసివిర్... సత్ఫలితాలు..! అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ గిలీడ్ సైన్సెస్ ఔషధం, రెమ్డిసివిర్....కరోనా చికిత్సలో మంచి ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు చైనా జీడీపీ అంచనాల కంటే తక్కుగానే తగ్గడం, కరోనా చికిత్సలో అమెరికా ఔషధం సత్ఫలితాలనిస్తుండటం, అమెరికాతో సహా పలు యూరప్ దేశాలు లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేయనుండటం.. ఈ కారణాలన్నింటి కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. రూ.3 లక్షల కోట్ల లాభం మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2.83 లక్షల కోట్ల పెరిగి రూ. 123.50 లక్షల కోట్లకు ఎగసింది. -
వడ్డీరేట్లకు ముందుంది మంచికాలం..!
ముంబై : కార్లు, గృహాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ కొనుగోలు చేపట్టిన వారికి శుభవార్త. వీటి కొనుగోలుపై తీసుకున్న రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయట. ఎమర్జింగ్ బాండ్ మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గుతాయనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. గత మూడు నెలల్లో, స్వల్పకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు సౌత్ వర్డ్ డ్రిఫ్ట్ లో కదలాడుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం.. గత కొన్ని నెలలుగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎమ్ఓ)లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దూకుడుగా నిర్వర్తించడమే. మార్కెట్లోకి నగదును ఎక్కువగా పంప్ చేయడంతో తేలికగా ద్రవ్య పరిస్థితిలోకి మార్చుకునే అవకాశం కల్పిస్తూ...ఆర్ బీఐ ఆ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీంతో లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడితే, షార్ట్ టర్మ్ రేట్లు దిగొస్తాయని చెబుతున్నారు.. దీంతో తక్కువ రేట్లకే రుణాలు లభ్యమవుతాయని అంచనా వేస్తున్నారు. నికర ద్రవ్య అవసరాలు బ్యాకింగ్ సిస్టమ్ లో రూ.1.06 లక్షల కోట్ల నుంచి గత వారంలో రూ.10,361 కోట్లకు పడిపోయాయి. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో కూడా 91 రోజుల ప్రభుత్వ ట్రెజరీ బిల్లు రేట్లు కూడా 6.90శాతం నుంచి 6.50శాతానికి తగ్గాయి. కాల్ మనీ రేట్లు కూడా 6.40 శాతం నుంచి 5.91శాతానికి దిగొచ్చాయి. 80వేల కోట్ల ఓఎమ్ఓ కొనుగోలుతో ఆర్ బీఐ కావాల్సిన తటస్థ ద్రవ్యాన్ని మొదటి త్రైమాసికంలో సాధించిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, క్రెడిట్ అండ్ మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ సౌమ్యజిత్ నియోగి తెలిపారు. అదేవిధంగా 2016 జూన్ లో నగదు సర్క్యులేన్ తగ్గించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లిక్విడిటీ సిస్టమాటిక్ మారిన దగ్గర్నుంచి ఎక్కువ ఓఎమ్ఓలు జరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ విశ్వసిస్తోంది. ఒకవేళ ఓఎమ్ఓలను ఆర్ బీఐ ఇలానే కొనసాగిస్తే.. సెప్టెంబర్ కల్లా 50 బేసిస్ పాయింట్లను బ్యాంకు రేట్లలో కోత విధిస్తాయని ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ఇంద్రానిల్ సేన్ గుప్తా అభిప్రాయపడుతున్నారు.