సాక్షి, ముంబై: హోంలోన్లు, వెహికల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. దీనికి రుణగ్రహీతలు సిద్ధంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు తమ కీలక లెండింగ్ రేట్లను పెంచేసిన నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటను అనుసరించనున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో గృహ, కార్లకోసం రుణాలు మరింత భారం కానున్నాయని భావిస్తున్నారు.
ముఖ్య ప్రయివేటు బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్ రేటును 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్, ఎస్ బ్యాంకు తమ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించాయి. ఈ పెంపు జనవరినుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశాయి. 2016, ఏప్రిల్ లో కొత్త ఎంసీఎల్ ఆర్ విధానంలోకి ప్రవేశించిన తరువాత ఇదే మొదటి పెంపు అని బ్యాంకులు వివరించాయి. ముఖ్యంగా డిపాజిట్లపై ఎక్కువ వడ్డీరేట్లు చెల్లిస్తున్న ఈ నేపథ్యంలో ఈ పెంపు తప్పలేదని పేర్కొన్నాయి. ఆర్‌బీఐ సంకేతాల మేరకు ఎంసీఎల్‌ఆర్ రేటు ఇంతకంటే కిందిగి దిగివచ్చే అవకాశం లేదని కోటక్ మహీంద్ర జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా వెల్లడించారు.
కాగా యాక్సిస్‌బ్యాంకు ఎంసీఎల్‌ఆర్ రేటును 5శాతం పెంచగా, కోటక్‌మహీంద్ర 5-10శాతం, ఎస్‌బ్యాంక్, ఇందస్ బ్యాంకు 10శాతం పెంచాయి.
Comments
Please login to add a commentAdd a comment