న్యూఢిల్లీ: కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. రెపో ఆధారిత రుణ రేటు(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను ప్రభుత్వం రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) బుధవారం(నవంబర్ 3) ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ రేటు 6.55 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. తాజా నిర్ణయం నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. గృహ, కారు, విద్య, వ్యక్తిగత రుణాలకు తాజా తగ్గింపు రేటు వర్తిస్తుంది. సెప్టెంబర్ 17నే బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 6.80 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గించింది.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటే-రెపో రేటు. ప్రస్తుతం ఈ రేటు 4 శాతంగా ఉంది. ఎలక్ట్రిక్/గ్రీన్ వాహనాలను కొనే కస్టమర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం పంచుకునేందుకు పీఎన్‌బీ ఈవీ, సిఎన్‌జి వాహనాలపై వడ్డీ రేటును 6.65%కు తగ్గించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్ మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇల్లు, వాహనం, వ్యక్తిగత, బంగారం, ఆస్తి రుణాలపై సర్వీస్ ఛార్జీలు/ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసింది.
(చదవండి: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!)
Comments
Please login to add a commentAdd a comment