రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో సహా మొత్తం ఐదు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్‌బీఐ నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానాలు విధించడం జరిగిందని సమాచారం.
ఆర్‌బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాకుండా.. గుజరాత్ రాజ్య కర్మచారి కోఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (బిహార్), నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ (పశ్చిమ బెంగాల్) ఉన్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్‌బీఐ ఏకంగా రూ. 1.31 కోట్ల జరిమానా విధించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. లోన్స్ అండ్ అడ్వాన్సులు వంటి వాటికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించిన కారణంగా 2024 జులై 4న రూ. 1,31,80,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని పలు నిబంధనలను పీఎన్‌బీ బ్యాంక్ ఉల్లంఘించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరికొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించడం జరిగింది. కాగా ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సిన బ్యాంకుల జాబితాలో తాజాగా మరో ఐదు బ్యాంకులు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment