స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎట్టకేలకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR) 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. సవరించిన రేట్లు ఈ రోజు (జులై 15) నుంచి అమలులోకి వస్తాయి. ఇది లోన్ తీసుకున్నవారి మీద ప్రభావం చూపుతుంది.
పెరిగిన వడ్డీ రేట్లు
ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో వడ్డీ రేటు 8.3 శాతం నుంచి, 8.35 శాతానికి చేరింది.
మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.30 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అంటే ఇది 10 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.
బ్యాంక్ ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ రేట్లకు 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో ఈ వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.85 శాతం, 8.95 శాతానికి చేరింది.
మూడు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ రేటు 8.95 శాతం నుంచి 9 శాతానికి చేరింది.
ఎంసీఎల్ఆర్ అంటే?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment