నిస్సాన్ కార్ల ధరలు కూడా తగ్గాయి
నిస్సాన్ కార్ల ధరలు కూడా తగ్గాయి
Published Thu, Jul 6 2017 5:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
ముంబై : ఎస్‌టీ ఎఫెక్ట్‌తో వాహన దిగ్గజ కంపెనీలన్ని వరుసపెట్టి తన వాహనాల రేట్లను తగ్గించడంలో క్యూ కడుతున్నాయి. తాజాగా నిస్పాన్ ఇండియా కూడా తన వాహనాలపై రేట్లను తగ్గిస్తున్నట్టుప్రకటించింది. నిస్సాన్ తన ఎక్స్-షోరూమ్ వాహనాల ధరలు సగటున 3 శాతం తగ్గించింది.
నిస్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్ర మాట్లాడుతూ, ఆటోమొబైల్ తయారీదారులు, కస్టమర్లకు జీఎస్‌టీ అమలు సానుకూలమని చెప్పారు. లాభాలను తమ వినియోగదారులకు లాభాలను అందించడం సంతోషంగా ఉందని తెలిపారు.
జూలై 1 జీఎస్‌టీ పరిధిలో ఆటోమొబైల్స్ ప్రభుత్వం 28 పన్నురేటును నిర్ణయించింది. దీంతో ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో ఆటోమొబైల్ కంపెనీలు బైక్‌లు,కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ముఖ‍్యంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, ఫోర్డ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూలు వంటి కార్ల కంపెనీలు ఇటీవలే కార్ల ధరలు తగ్గుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement