సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం హోండా కంపెనీ వచ్చే నెల జనవరి 1 నుంచి భారత్‌లో తన వాహన ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ధరల పెంపు నిర్ణయంపై ఇప్పటికే కంపెనీ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరెన్సీ అనిశ్చితులు, ఉత్పత్తి వ్యయం ఒత్తిళ్లతో కంపెనీ జనవరి నుంచి ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు కంపెనీ డీలర్లు తెలిపారు. తన అనుబంధ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) ద్వారా దేశంలో ఈ కంపెనీ కాంపాక్ట్, సెడాన్, అమెజ్ నుంచి ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్–వీ వరకు పలు వాహనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద అమెజ్ ప్రారంభ ధర రూ.6.17 లక్షలుండగా, ఎంట్రీ లెవల్ సీఆర్‌వీ ధర రూ.28.71 లక్షలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment