డీలర్ల సమాఖ్య ‘ఫాడా’ గణాంకాలు వెల్లడి
ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు జనవరిలో 7% పెరిగాయని డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. ఈ ఏడాది తొలి (జనవరి) నెలలో మొత్తం 22,91,621 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో డిమాండ్ ఊపందుకోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.
కాగా గతేడాది(2024) జవనరిలో ఈ సంఖ్య 21,49,117 యూనిట్లకు పరిమితమయ్యాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, మెరుగైన ఫైనాన్సింగ్ తదితర కారణాలు కలిసొచ్చాయని డీలర్లు చెప్పుకొచ్చారు. ఈ ఫిబ్రవరిలో అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతుందని 46%, నెమ్మదిస్తుందని 43%, మిగిలిన ఒకశాతం అమ్మకాల్లో క్షీణత ఉండొచ్చని డీలర్లు అంచనా వేస్తున్నారు.
‘‘స్థిరమైన మార్కెట్ రికవరీ కారణంగా టూ వీలర్లు, త్రి చక్ర, ప్యాసింజర్, వాణిజ్య వాహనాలతో పాటు ట్రాక్టర్ల విక్రయాలు పెరిగాయి. మరోవైపు వడ్డీ రేట్ల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్య సవాళ్లు, మార్కెట్‌లో అనిశ్చితి పరిస్థితులు ఇంకా పరిశ్రమను వెంటాడుతున్నాయి’’ అని ఫాడా చైర్మన్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment