dealers association
-
‘పవన్ కల్యాణ్‌ది ద్వంద్వ వైఖరి’
సాక్షి, అమరావతి: రేషన్ డీలర్ల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీకి లేఖ రాయాలని పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన నాలుగు విడతల కమీషన్‌ను విడుదల చేయించాలని, రేషన్ డీలర్లను కరోనా బీమా కింద పరిధిలోకి తీసుకురావాలని పవన్ కోరాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంపై తప్పు నెట్టేందుకు ఎప్పటిలాగే పవన్‌కల్యాణ్ ద్వంద్వ వైఖరి ఉందని విమర్శించారు. రేషన్ డీలర్ల సమస్యలను రాజకీయం చేయొద్దన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన కమీషన్‌ను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని.. రేషన్ డీలర్లకు అండగా ఉన్నారని వెంకట్రావ్ పేర్కొన్నారు. -
ఎరువుల డీలర్లకు సహకారం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తన డీలర్లకు పూర్తి సహకారం అందిస్తామని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల డీలర్ల సంఘం (స్పెడ్) రాష్ట్ర అధ్యక్షుడు కె.పృథ్వీ బుధవారం మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పృథ్వీకి అభినందనలు తెలుపుతూ, రైతుల కోసం డీలర్ల సంఘం పనిచేయాలని మంత్రి సూచించారు. తమ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తారని పృథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ‘రేషన్’ బంద్
డీలర్ల సంఘం అల్టిమేటం పరకాల: రేషన్డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు రూ.30 వేల చొప్పున వేతనమివ్వాలని.. దీనిపై 2 నెలల్లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలోని అన్ని షాపులను బంద్ చేస్తామని రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండ లం కోనాయమాకుల వద్ద మంగళవారం రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా సభ జరి గింది. సభలో సంఘం రాష్ట్ర అధ్య క్షుడు బత్తుల రమేశ్‌బాబు మాట్లాడుతూ మంత్రి ఈటల హామీలు కూడా నెరవేరకపోవడంతోనే రేషన్‌షాపుల బంద్‌ను నిర్ణయించి నట్లు చెప్పారు. రేషన్ డీలర్లు అందరూ 27న హన్మకొండలో జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు తరలిరావాలన్నారు. -
పెట్రో మంటలు
షోలాపూర్, న్యూస్‌లైన్ : షోలాపూర్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా షోలాపూర్‌లోనే పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలకు విక్రయాలు సాగుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 16 పెట్రోల్ బంకులున్నాయి. వీటి ద్వారా రోజూ 48 వేల లీటర్ల పెట్రోలు, 20 వేల డీజిల్‌లు విక్రయాలు జరుగుతున్నాయి. పట్టణంలో పెట్రోల్ లీటరు ధర 86.55 రూపాయలు, పట్టణం వెలుపల రూ. 78.66 ఉంది. ప్రతి లీటరుకు రూ. 7.89 తేడా ఉంది. డీజిల్ ధర పట్టణంలో రూ. 72.45, వెలుపల రూ. 65.18. రూ.7.34 పైసలు తేడా ఉంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలకు విక్రయాలు చేయాల్సి వస్తోందని బంక్ డీలర్ల అసోషియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 11వ తేదీన బంక్‌ల బంద్ : డీలర్స్ అసోసియేషన్ వెల్లడి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఫెడరేషన్ ఆఫ్ మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. సునీల్ చవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికిఈ నెల 11వ తేదీన పెట్రోల్ బంకుల బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. చైనా వస్తువులకు 0.1 శాతం మేర ఎల్బీటీ అమలు చేస్తున్న ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం మేర ఎల్బీటీ పన్ను విధించడం సరైందికాదన్నారు. ఈ పన్నుల వలనే వినియోగదారులపై అదనపు భారం పడుతోందని ఆయన చెప్పారు. తక్షణమే ఎల్బీటీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పెట్రోల్ బంక్‌ల యజమానులు నందకిషోర్ బాలుదావా, సిద్దేశ్వర్ వాళే, కేదార్ బావి తదితరులు పాల్గొన్నారు.