డీలర్ల సంఘం అల్టిమేటం
పరకాల: రేషన్‌డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు రూ.30 వేల చొప్పున వేతనమివ్వాలని.. దీనిపై 2 నెలల్లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలోని అన్ని షాపులను బంద్ చేస్తామని రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండ లం కోనాయమాకుల వద్ద మంగళవారం రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా సభ జరి గింది. సభలో సంఘం రాష్ట్ర అధ్య క్షుడు బత్తుల రమేశ్‌బాబు మాట్లాడుతూ మంత్రి ఈటల హామీలు కూడా నెరవేరకపోవడంతోనే రేషన్‌షాపుల బంద్‌ను నిర్ణయించి నట్లు చెప్పారు. రేషన్ డీలర్లు అందరూ 27న హన్మకొండలో జరిగే టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు తరలిరావాలన్నారు.
సమస్యలు పరిష్కరించకపోతే ‘రేషన్’ బంద్
Published Wed, Apr 26 2017 2:41 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
Advertisement