ఈ వారంలో వెలువడే ఎస్‌బీఐ, సిప్లా వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారంలో ఎస్‌బీఐ, టాటా మోటార్స్, సిప్లా, జెట్ ఎయిర్‌వేస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్, సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి.
మొత్తం 800 కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ పతనం మార్కెట్‌పై స్వల్పంగానే ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ చెప్పారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం ఏమీ ఉండదని ఆయన అంచనా వేస్తున్నారు.
ముడి చమురు ధరలు 80 డాలర్లకు చేరడం, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, కరెన్సీ మారకం, జీడీపీ వృద్ధిపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావం... తక్షణం మార్కెట్‌ను ఆందోళన పరుస్తున్న అంశాలని పేర్కొన్నారు. బ్యారెల్ ముడి చమురు ధరలు 85 డాలర్లకు చేరితే మార్కెట్‌లో భారీ పతనం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, బాండ్ల రాబడులు కూడా పెరుగుతుండటం మార్కెట్లకు ప్రతికూలమేనని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ టీనా వీర్మాణి చెప్పారు.
నేడు ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ లిస్టింగ్
రూ.572 ఇష్యూ ధరతో ఈ నెల 9–11 మధ్య ఐపీఓకు వచ్చిన ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ సోమవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది.
కొనసాగుతున్న ‘విదేశీ’ అమ్మకాలు
మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.18,000 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,830 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.12,947 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో అమ్మకాలు జరుపుతున్నారని విశ్లేషకులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment