వచ్చే ఏడాది ఆరంభంలోవడ్డీరేట్లు తగ్గుతాయ్..
పసిడిపై మరిన్ని ఆంక్షలు ఉండకపోవచ్చు
సైబర్ సెక్యూరిటీ పెరగాలి...
ప్రధాని ఆర్థిక సలహామండలి మాజీ చైర్మన్ రంగరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక ఏడాది ప్రారంభంలో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహావుండలి మాజీ చైర్మన్ సి.రంగరాజన్ తెలిపారు. ధరలు దిగిరావడం ప్రకారం చూస్తే వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంశంలో ఎటువంటి సందేహం లేనప్పటికీ కరెన్సీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. గత ఆర్‌బీఐ పాలసీలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న స్పష్టమైన సంకేతాలను ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే వచ్చే ఏడాది ఏ క్షణమైనా వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఐడీఆర్‌బీటీ నిర్వహించిన పదవ అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ సదస్సులో రంగరాజన్ ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయున మాట్లాడుతూ అంతర్జాతీయుంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఆధారిత దేశమైన భారత్ ప్రయోజనం పొందుతుందని, ఇదే సమయుంలో గల్ఫ్ దేశాల్లో పనిచేసేవారు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చవుురు ధరలు తగ్గుతుండటంతో గతేడాది కంటే కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుందన్న అంచనాలకు బంగారం దిగుమతులు అడ్డుకట్ట వేశాయున్నారు. గతేడాది వలే జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 1.7 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయున్నారు. బంగారం దిగువుతులు పెరిగినా వీటిని అరికట్టడానికి వురిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. అంతకువుుందు సమావేశంలో రంగరాజన్ మాట్లాడుతూ దొంగనోట్ల కంటే సైబర్ నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవూదకరంగా మారాయన్నారు.
రోజు రోజుకూ ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉండగా, రోజుకు 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ఇంకా దేశంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువగా ఉందని, రానున్న కాలంలో ఇది మరింత పెరగనుండటంతో ఆన్‌లైన్ లావాదేవీల్లో రక్షణాత్మకమైన చర్యలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రవుంలో ఐడీఆర్‌బీటీ డెరైక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రితో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.