
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల చమురు మార్కెట్ బ్లాక్ స్వాన్ లాంటి ప్రమాదాన్ని ఎదుర్కొబోతుందని ఫ్రెంచ్ చమురు వ్యాపారి పియరీ అండురాండ్ గతంలో హెచ్చరించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధాలు, అనూహ్య ఉగ్రవాద సంఘటనలను సాధారణంగా బ్లాక్ స్వాన్‌తో పోలుస్తారు. కరోనా కారణంగా చమురుకు డిమాండ్ లేనప్పుడు ధరలు సాధారణంగా తగ్గుతాయని అన్నారు. అయితే దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారమవుతుందని.. కానీ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆండురాండ్ క్యాపిటల్ అనే చమురు సంస్థను పియరీ అండురాండ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
చమురు డిమాండ్, సప్లయ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడు చమురు ధరలపై ప్రభావం పడుతుందని తెలిపారు. కోవిడ్ విశ్వరూపం చూపకముందే వైరస్ వ్యాప్తిని ప్రపంచ దేశాలు అరికట్టలేవని తానే ముందే గ్రహించినట్లు పేర్కొన్నారు. చమురు మార్కెట్ లాభాల భాట పట్టాలంటే దేశాలు విదిస్తున్న లాక్‌డౌన్‌లను ఎత్తేయాలని తెలిపారు. ముఖ్యంగా రవాణా, తయారీ రంగం వేగంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తేనే చమురుకు డిమాండ్ పెరిగి మార్కెట్‌లో జోష్ నెలకొంటుందని పియరీ అండురాండ్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment