న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 9,536 కోట్ల లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 11,045 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం తక్కువ.
సమీక్షాకాలంలో చమురు, గ్యాస్ ధరలు తగ్గడమే.. లాభాల క్షీణతకు కారణమని సంస్థ తెలిపింది. క్యూ3లో క్రూడాయిల్ ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 5.2 మిలియన్ టన్నులకు పరిమితం కాగా, గ్యాస్ ఉత్పత్తి 4.3 శాతం క్షీణించి 5.12 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది.
క్యూ3లో స్థూల ఆదాయం 10 శాతం తగ్గి రూ. 34,789 కోట్లుగా నమోదైంది. సమీక్షాకాలానికి షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 5,032 కోట్లు అవుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment