Q3 net loss
-
చమురు, గ్యాస్ ధరల ఎఫెక్ట్.. పడిపోయిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 9,536 కోట్ల లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 11,045 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం తక్కువ. సమీక్షాకాలంలో చమురు, గ్యాస్ ధరలు తగ్గడమే.. లాభాల క్షీణతకు కారణమని సంస్థ తెలిపింది. క్యూ3లో క్రూడాయిల్ ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 5.2 మిలియన్ టన్నులకు పరిమితం కాగా, గ్యాస్ ఉత్పత్తి 4.3 శాతం క్షీణించి 5.12 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. క్యూ3లో స్థూల ఆదాయం 10 శాతం తగ్గి రూ. 34,789 కోట్లుగా నమోదైంది. సమీక్షాకాలానికి షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 5,032 కోట్లు అవుతుందని తెలిపింది. -
జియో దెబ్బ: భారీగా కుప్పకూలిన ఐడియా
మరో టెలికాం దిగ్గజం ఐడియాకు రిలయన్స్ జియో దెబ్బ భారీగా తగిలింది. టెలికాం ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో వల్ల ఇప్పటికే దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ తన లాభాలను భారీగా చేజార్చుకోగా, ఐడియా ఏకంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఐడియా సెల్యులార్ శనివారం విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.383.87 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో కంపెనీకి రూ.659.35 కోట్ల నికరలాభాలు ఉన్నాయి. జియో అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా ఆఫర్లే వీటి లాభాలకు భారీగా గండికండుతుందని తెలిసింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.9032.43 కోట్ల నుంచి రూ.8706.36 కోట్లకు పడిపోయిననట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో నమోదుచేసింది. ''అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నడిచిన త్రైమాసికంలో దేశీయ మొబైల్ ఇండస్ట్రి ఊహించని అంతరాయాలను ఎదుర్కొంది. ముఖ్యంగా టెలికాం సెక్టార్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఎంట్రీ అందించే ఉచిత వాయిస్, మొబైల్ డేటా ఆఫర్లే దీనికి కారణం'' అని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. చరిత్రలోనే మొదటిసారి భారత వైర్లెస్ సెక్టార్ వార్షిక రెవెన్యూలు 3-5 శాతం పడిపోయాయని పేర్కొంది. రెవెన్యూలు రికవరీ కావడానికి కేవలం ఆ కొత్త ఆపరేటర్ తమ ప్యాన్-ఇండియా మొబైల్ సర్వీసులపై ఛార్జీలు విధించడమే పరిష్కారమని తెలిపింది. ఇటీవలే ఐడియా తన ప్రత్యర్థి వొడాఫోన్‌ను తనలో విలీనం చేసుకోవాలని ప్లాన్స్ చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే టెలికాం ఇండస్ట్రీలో త్రిముఖ పోటీ తెరలేవనుంది. ఎయిర్టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ల విలీన సంస్థ తీవ్రంగా పోటీపడనున్నాయి.