జియో దెబ్బ: భారీగా కుప్పకూలిన ఐడియా | Idea Cellular slips into red with Q3 net loss of Rs 384 cr | Sakshi
Sakshi News home page

జియో దెబ్బ: భారీగా కుప్పకూలిన ఐడియా

Published Sat, Feb 11 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

జియో దెబ్బ: భారీగా కుప్పకూలిన ఐడియా

జియో దెబ్బ: భారీగా కుప్పకూలిన ఐడియా

మరో టెలికాం దిగ్గజం ఐడియాకు రిలయన్స్ జియో దెబ్బ భారీగా తగిలింది. టెలికాం ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో వల్ల ఇప్పటికే దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ తన లాభాలను భారీగా చేజార్చుకోగా, ఐడియా ఏకంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఐడియా సెల్యులార్ శనివారం విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.383.87 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో కంపెనీకి రూ.659.35 కోట్ల నికరలాభాలు ఉన్నాయి. జియో అందిస్తున్న  ఉచిత వాయిస్, డేటా ఆఫర్లే వీటి లాభాలకు భారీగా గండికండుతుందని తెలిసింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.9032.43 కోట్ల నుంచి రూ.8706.36 కోట్లకు పడిపోయిననట్టు బీఎస్ఈ ఫైలింగ్లో నమోదుచేసింది.
 
''అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నడిచిన త్రైమాసికంలో దేశీయ మొబైల్ ఇండస్ట్రి ఊహించని అంతరాయాలను ఎదుర్కొంది. ముఖ్యంగా టెలికాం సెక్టార్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఎంట్రీ అందించే ఉచిత వాయిస్, మొబైల్ డేటా ఆఫర్లే దీనికి కారణం'' అని ఐడియా సెల్యులార్ ప్రకటించింది.  చరిత్రలోనే మొదటిసారి భారత వైర్లెస్ సెక్టార్ వార్షిక రెవెన్యూలు 3-5 శాతం పడిపోయాయని పేర్కొంది.  రెవెన్యూలు రికవరీ కావడానికి కేవలం ఆ కొత్త ఆపరేటర్ తమ ప్యాన్-ఇండియా మొబైల్ సర్వీసులపై ఛార్జీలు విధించడమే పరిష్కారమని తెలిపింది. ఇటీవలే ఐడియా తన ప్రత్యర్థి వొడాఫోన్ను  తనలో విలీనం చేసుకోవాలని ప్లాన్స్ చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే  టెలికాం ఇండస్ట్రీలో త్రిముఖ పోటీ తెరలేవనుంది.  ఎయిర్టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ల విలీన సంస్థ తీవ్రంగా పోటీపడనున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement