ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. జియో టీవీ బంప‌ర్ ఆఫ‌ర్ | Reliance Jio Announces New Prepaid JioTV Premium Plans - Sakshi
Sakshi News home page

ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. జియో టీవీ బంప‌ర్ ఆఫ‌ర్

Published Mon, Dec 18 2023 7:21 PM | Last Updated on Mon, Dec 18 2023 8:54 PM

Reliance JioTV Premium New Plans Details - Sakshi

ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటవల తన సబ్‌స్క్రైబర్‌ల ఓ సరి కొత్త ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ కొత్త ప్లాన్స్ ప్రకారం ఏకంగా 14 ఓటీటీలను ఒకే ప్లాన్ తో పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త ప్లాన్‌ల ధరలు
రిలయన్స్ జియోటీవీ ప్రీమియం ప్లాన్‌లలో రూ.398, రూ.1198, రూ.4498 ధరలతో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ ఇప్పటికే (15 డిసెంబర్ 2023) అందుబాటులో ఉన్నాయి

👉రూ.398తో ప్రారంభమయ్యే ప్లాన్ రోజుకు 2GB డేటాతో 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంతే కాకుండా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే అందిస్తుంది.

👉రూ.1198తో ప్రారంభమయ్యే ప్లాన్ అనేది 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో రోజుకి 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు, JioTV ప్రీమియం (14 ఓటీటీలు) వంటివి పొందవచ్చు.

👉రూ.4498తో ప్రారంభమయ్యే ప్లాన్ 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో కూడా రోజుకి 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి లభిస్తాయి. పైగా 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను పొందవచ్చు. కంపెనీ ఈ ప్లాన్ కోసం ఈఎమ్ఐ వెసులుబాటుని కూడా అందిస్తుంది.

జాబితాలోని రీజనల్ అండ్ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు

  • జియోసినిమా ప్రీమియం
  • డిస్నీ+ హాట్‌స్టార్
  • జీ5
  • సోనీలైవ్
  • ప్రైమ్ వీడియో (మొబైల్)
  • లయన్స్‌గేట్ ప్లే
  • డిస్కవరీ+
  • డాక్యుబే
  • హోఇచోయ్
  • SunNXT
  • ప్లానెట్ మరాఠీ
  • చౌపాల్
  • ఎపిక్ఆన్
  • కంచ లంక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement