
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 54101 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 16121 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా రెండు రోజుల నష్టాలకి చెక్ చెప్పాయి. సెన్సెక్స్ 54 వేలు, నిఫ్టీ 16100 పాయింట్లకు ఎగువన ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.
బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్; హెచ్‌యూఎల్, ఏషియన్స్ పెయింట్స్ లాభపడుతుండగా, ఫలితాల ప్రభావంతో హెచ్‌సీఎల్ టెక్ టాప్ లూజర్‌గా ఉంది. ఇంకా ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, రిలయన్స్, డా. రెడ్డీస్ నష్టపోతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరడంతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి.