సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. ఆరంభంలోనే భారీ లాభాలను సాధించిన కీలక సూచీలు కొనుగోళ్ల జోష్‌తో మరింత లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 34, 859 వద్ద,నిఫ్టీ 133 పాయింట్లు ఎగిసి 10, 13 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. దీంతో నిఫ్టీ 10500 స్థాయిని అధిగమించింది.
దీంతో దేశీయంగా దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా సెక్టార్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, యస్‌బ్యాంక్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హీరోమోటో, ఇండస్‌ఇండ్, ఐషర్, ఎంఅండ్ఎం, ఐవోసీ, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టీపీసీ స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్‌గా ప్రారంభమైంది. డాలరుమారకంలో నిన్నటి ముగింపు 73.45 తో పోలిస్తే. 73.10 వద్ద బలంగా ఉంది.
అంతర్జాతీయ చమురు ధరలు దిగి రావడం, ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌వార్ ముగింపు సంకేతాలతో ఇన్వెస్టర్లలో జోష్ వచ్చింది. అటు వరుసగా మూడో రోజు అమెరికా మార్కెట్లు హైజంప్ చేశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లోనూ ఇదే ధోరణి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment