
ముంబై: ముడి చమురు ధరలు మళ్లీ ఎగియడంతో పాటు డాలర్ కూడా బలపడటం దేశీ కరెన్సీ రూపాయిపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 39 పైసలు క్షీణించి 72.89 వద్ద ముగిసింది.
డిసెంబర్ నుంచి ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 5 లక్షల బ్యారెళ్ల మేర తగ్గించనున్నట్లు ప్రకటించిన సౌదీ అరేబియా చమురు రేటు మరింత పడిపోకుండా ప్రపంచ దేశాలన్నీ రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గించాలంటూ పిలుపునిచ్చింది. దీంతో క్రూడాయిల్ పది రోజుల క్షీణతకు అడ్డుకట్ట పడింది. బ్యారెల్ ధర 1 శాతం పెరిగి 71 డాలర్ల స్థాయిని తాకింది. అటు బ్రెగ్జిట్ డీల్‌పై ఆందోళనలతో బ్రిటన్ పౌండు పతనమవడం తదితర అంశాల నేపథ్యంలో మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు విలువ 18 నెలల గరిష్టానికి ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment