చమురు ధరల చదరంగంలో ప్రజలే పావులు | Oil Prices | Sakshi
Sakshi News home page

చమురు ధరల చదరంగంలో ప్రజలే పావులు

Published Tue, Mar 17 2015 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

చమురు ధరల చదరంగంలో ప్రజలే పావులు

చమురు ధరల చదరంగంలో ప్రజలే పావులు

సందర్భం

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలలోని ప్రైవేట్ వాటాదారులకు లబ్ధి చేకూర్చేందుకే రిటైల్ మార్కెట్‌లో చమురు ధరలను పెంచుతున్నారు. దేశంలోని ఆర్థిక అంశాలన్నింట్లోనూ మార్కెట్ తాలూకు డిమాండ్-సరఫరా సూత్రం పనిచేయడం లేదన్నది స్పష్టం.

అంతర్జాతీయంగా క్రూడా యిల్ ధరలు భారీగా తగ్గా యి. గత జూన్‌లో బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరుకున్న ఈ ధర నేడు సుమారు 50 డాల ర్లకు పడిపోయింది. క్రూడా యిల్ ధరలు నేడు సుమారు 64 శాతం వరకు తగ్గాయి. కానీ మన దేశంలో జరుగుతు న్నదేమిటి? దశాబ్దం క్రితం బ్యారెల్‌కు కేవలం 40 డాల ర్లుగా ఉన్న ముడిచమురు ధరలు పెరుగుతూ వచ్చిన క్రమంలో మన చమురు కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. పైగా, మన ప్రభు త్వాలు వీటి ధరల నిర్ణయంపై తమ నియంత్రణ ఎత్తి వేసి వాటి నిర్ణయాధికారాన్ని చమురు కంపెనీలకు.. అంటే మార్కెట్‌కు కట్టబెట్టాయి. అదీ విషయం.

ఈ కథంతా నిజమైతే, ఈ ఉత్పత్తుల ధరలు అంత ర్జాతీయంగా క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులతో పాటు నిరంతరంగా మారుతూ ఉండాలి. కానీ, క్రూడ్ ధర అధికంగా ఉన్నప్పుడు ఆ పేరిట ధరలు పెంచిన ప్రభు త్వం, నేడు ఆ ధర భారీగా తగ్గిపోయినా ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించటం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఒకవైపున ఈ ఉత్పత్తులపై ధరలను కొద్ది కొద్దిగా తగ్గిస్తూ, మరోవైపున వాటిపై ఎక్సైజ్ సుంకం పెంపుదలకు దిగుతోంది. కాబట్టి, నేడు పెట్రోల్, డీజిల్ విషయంలోనూ, ఆ మాటకొస్తే దేశానికి సంబంధించిన ఆర్థిక అంశాలన్నింటిలోనూ పనిచేస్తున్నది మార్కెట్ తాలూకు డిమాండ్-సరఫరా సూత్రం కాదు! క్రోనీ కేపి టలిజం. ఆశ్రీత పెట్టుబడిదారీ విధానమే పనిచేస్తోంది.

నిజానికి అంతర్జాతీయంగా ముడిచమురు ధర, దాని గరిష్టస్థాయిలో ఉన్నప్పుడు కూడా, దేశీయ చము రు కంపెనీలు నష్టాల్లో లేవు. అందుచేతనే, ఈ ధరలను నిరంతరం పెంచుతూ వచ్చిన ప్రభుత్వాలు.. చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయనే మాటను ఏనాడూ అనలేదు. వాటికి అండర్ రికవరీలు (రావలసినంత ధర రాకపోవడం) ఉన్నాయనే చెబుతున్నాయి. ఇదే ఈ అం శం తాలూకు అసలు మెలిక. 2000 సంవత్సరంలో నాటి బీజేపీ (ఎన్డీయే) ప్రభుత్వం  చమురు ధరల నియంత్రణ విధానం స్థానంలో దిగుమతి ఆధారిత ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో, దేశీయంగా ఈ ఉత్పత్తుల ధరలను సింగపూర్ స్పాట్ ప్రైస్ ప్రకారంగా నిర్ణయిస్తారు. పైగా, ఈ ఊహాజనిత ధరలకు వాటి రవా ణా వ్యయం, బీమా వ్యయం, వాటిపై పన్నుల వంటివి కూడా అదనంగా వచ్చి చేరతాయి. ఈ ఊహాజనిత ధరా, దానిపై అదనపు భారాల మొత్తాల మేరకు, దేశీ య మార్కెట్లో చమురు ధరలు లేకుంటే, అప్పుడది అండర్ రికవరీ అవుతుంది. ఇదీ మన ప్రభుత్వాల తీరు. నిజానికి, అండర్ రికవరీలూ లేదా మనం నష్టాలుగా పిలుచుకునేవి భారీగా ఉన్నాయని చెప్పిన కాలంలో కూడా ఈ చమురు కంపెనీలు తమ వాటాదారులకు భారీగా డివిడెండ్లను ఇస్తూ వచ్చాయి. తమ ఉద్యోగు లకు బోనస్‌లనూ చెల్లించాయి. తమ అమ్మకాలపై లాభాలు రాకుండా ఇదంతా సాధ్యం కాదనేది స్పష్టమే..

గతంలో యూపీయే హయాంలో కూడా పలుసార్లు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను సమర్థించుకుం టూ నాటి ప్రభుత్వం ప్రకటనలు చేసేది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర భారీగా పెరిగిపోయినం దున దాని దిగుమతి వ్యయాలు పెరిగాయనీ, వాటిని భర్తీ చేసుకునేందుకు దేశీయంగా చమురు ధరలను పెం చామని కేంద్రం చెప్పేది. కాని అసలు నిజాలు వేరే ఉన్నాయి. అంతర్జాతీయ క్రూడ్ ధరగా ప్రభుత్వం పేర్కొన్నది అధిక నాణ్యత గల బ్రెంట్ క్రూడ్ ధరను. మన దేశ దిగుమతులలో దీని వాటా 66 శాతం మాత్ర మే. మిగతా 34 శాతం మేరకు నాణ్యతా, ధరా తక్కు వగా ఉండే ‘సోర్ క్రూడ్’ను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సోర్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 15 డాలర్లు తక్కువగా ఉండేది. కానీ ప్రభుత్వం మాత్రం తాను చెప్పే లెక్కలకు నూటికి నూరు శాతం బ్రెంట్‌ను దిగుమతి చేసుకుంటు న్నామనే వాదనను ప్రాతిపదికగా చేసుకుంది.

పైగా పెట్రోల్, డీజిల్‌పై భారీస్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వడ్డిస్తున్నాయి. ఉదా: చము రుపై వచ్చే పన్నుల ఆదాయం కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల ఆదాయంలో 20 శాతం పైగానే ఉంటోంది. దీం తో ఈ ఉత్పత్తుల ధర తడిసి మోపెడవుతోంది. చమురు ఉత్పత్తులపై పెంచుతున్న ఎక్సైజ్ సుంకం డబ్బును ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం వాడుతానంటున్న కేంద్ర ప్రభుత్వం... గతంలోని తన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ, గత నెల 28నాటి 2015-16 బడ్జెట్‌లో కూడా ద్రవ్యలోటు తగ్గింపు పేరిట సంక్షేమ పథకాలపై వెచ్చించే మొత్తాలపై గణనీయంగా కోతలు పెట్టింది.

ఈ నేపథ్యంలోనే గత ఏడాదిగా అంతర్జాతీయ ముడిచమురు ధరల తగ్గుదల 50 శాతంపైనే ఉన్నా దేశీయ వినియోగదారులు చెల్లించే ధరలో 16 శాతం మాత్రమే తగ్గింపులు ఉంటున్నాయి. కానీ, మన దేశం లోని కెయిర్న్ వంటి చమురు ఉత్పత్తి కంపెనీల లాభాలు ఆసియాలోకెల్లా అధికస్థాయిలో ఉంటున్నాయి. అంటే చమురుధరలపై నియంత్రణ ఎత్తివేసే పేరిట పాల కులు చమురు కంపెనీలకు అపరిమిత లాభాలు కల్పిం చేందుకు బాటలు వేశారు. పైగా, దేశీయ చమురు కంపె నీల్లో పెద్ద స్థాయిలో ప్రైవేట్ వాటాదారులున్నందున వారికి లబ్ధి చేకూర్చేందుకు, వారి వాటాలకు షేర్ మార్కె ట్లలో నిరంతరంగా విలువ పెరగడానికి డీజిల్, పెట్రోల్ ధరలు రిటైల్ మార్కెట్లో అధికస్థాయిలో ఉండటం తప్పనిసరి. మొత్తం మీద యూపీయే లేదా ఎన్‌డీఏ ప్రభుత్వం అయినా కార్పొరేట్‌ల సేవలో తరించడమనే ప్రక్రియలో భాగంగానే ఒకరి తర్వాత మరొకరుగా అధి కారాన్ని చేతులు మార్చుకుంటున్నాయి.

డి.పాపారావు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు
మొబైల్: 98661 79615

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement