సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు దిగి వస్తుండటంతో దేశీయ కరెన్సీ దూకుడుమీద ఉంది. వరుస సెషన్లలో లాభపడుతూ కీలక మద్దతు స్థాయిలపైకి ఎగబాకింది. తాజాగా గురువారం డాలరు మారకంలో సుదీర్ఘ కాలం తరువాత 70 స్థాయికి పుంజుకుంది.
ఇటీవల ర్యాలీ బాట పట్టిన దేశీయ కరెన్సీ మరోసారి బలాన్ని ప్రదర్శిస్తోంది. మంగళవారం నాటి 71.46 స్థాయితో పోలిస్తే (బుధవారం ఈద్ సెలవు) ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 32 పైసలు ఎగసి 71.14 వద్ద ప్రారంభమైంది. తదుపరి 71.12వరకూ పుంజుకుంది. వెరసి వరుసగా 7వ రోజు రూపాయి లాభాల బాటలో సాగుతోంది. అనంతరం 54 పైసలు లాభపడి 70.92 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబరు 3 తరువాత తిరిగి ఈ స్థాయికి చేరింది. తన జోష్‌ను కొనసాగించిన దేశీయ కరెన్సీ చివరికి ఆగస్టు 29 నాటి 70.69 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.
అటు లిక్విడిటీ మెరుగుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు ద్వారా రూ.8వేల కోట్లను విడుదల చేయనుందన్న వార్తలు రూపాయి విలువకు బలాన్నిచ్చినట్టు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment