కేంద్రం శుభవార్త, వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు | Government Cuts Custom Duties On Edible Oil To Ease Retail Prices | Sakshi
Sakshi News home page

కేంద్రం శుభవార్త, వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు

Sep 11 2021 9:31 PM | Updated on Sep 11 2021 9:34 PM

Government Cuts Custom Duties On Edible Oil To Ease Retail Prices - Sakshi

వంటనూనెల వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో వంటనూనెలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వివిధ రకాల నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది.  

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్‌లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్‌ రేట్లు పెరిగాయి. దీంతో రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు పెరుగుతాయనే అంచనాల నడుమ కేంద్రం వాటి ధరల్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.  

ముడి పామాయిల్‌పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. ఇక అన్ని రకాల రిఫైన్డ్‌ ఆయిల్స్‌‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించడంతో.. తాజా ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. ఇక రిఫైన్డ్‌ ఆయిల్స్‌పై ఉన్న పన్ను 35.75 శాతానికి  చేరనుండగా దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ధరలు మరితం తగ్గనున్నాయి. 

చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్‌లో విడుదలైన మరో స్మార్ట్‌ ఫోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement