Food Ministry
-
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం ఉమ్మడి పోర్టల్
న్యూఢిల్లీ: వ్యవసాయం, ఆహార శుద్ధి శాఖలు అమలు చేస్తున్న మూడు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి ఉమ్మడి పోర్టల్.. ఆహార శుద్ధి పరిశ్రమలో సూక్ష్మ యూనిట్లకు మేలు చేస్తుందని కేంద్ర ఆహార శుద్ధి శాఖ ప్రకటించింది. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం, ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై) పథకాలను ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలు ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ యూనిట్లకు సాయంగా నిలుస్తాయన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. పీఎంఎఫ్ఎంఈ, పీఎంకేఎస్‌వై పథకాల కింద అర్హత కలిగిన లబ్ధిదారులు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకితోడు.. 3 శాతం వడ్డీ రాయితీ పొందొచ్చని ఆహార శుద్ధి శాఖ తెలిపింది. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద అందిస్తున్న 35 శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొంది. ఈ రెండు పథకాల కింద ప్రాజెక్టుల ఆమోదానికి దరఖాస్తులను ఏఐఎఫ్ ఎంఐఎస్ పోర్టల్ నుంచి స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
సామాన్యుడికి శుభవార్త.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!
ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు జీఎస్టీ ప్రభావం మరింత భారం కానుంది. ఈ క్రమంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరల తగ్గింపుపై కేంద్రం ఆహార మంత్రిత్వశాఖ వంటనూనెల తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో గురువారం(ఆగస్టు4)న సమావేశం కానుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే తర్వాత ఇలాంటి సమావేశాలు జరగడం ఇది మూడోసారి. ముఖ్యంగా పామాయిల్ అతిపెద్ద ఎగుమతిదారుడు ఇండోనేషియా రవాణాపై నిషేధాన్ని తొలగించి, సన్‌ఫ్లవర్, సోయా నూనెల సరఫరాను సడలించిన తర్వాత అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్(వంటనూనెల) ధరలు క్షీణించాయి. అయితే దేశీ మార్కెట్లో రిటైల్ ధరలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. దీని వల్ల సామాన్యులకు ధరల పంపు నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది. కాగా గతంలోనూ కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచచ్చిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం, జూన్ 1 నుంచి దేశీయ మార్కెట్లో ఆవాలు, సోయా, సన్ ఫ్లవర్ పామాయిల్ రిటైల్ ధరలు 5-12% శ్రేణిలో క్షీణించాయి. తగ్గుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. భారత్ వార్షిక దిగుమతులు దాదాపు 13-14 మిలియన్ టన్నులు ఉండగా, అందులో ఇండోనేషియా, మలేషియా నుంచి 8 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటోంది. అయితే సోయా , సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెలు అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నుంచి వస్తాయి. చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి! -
కొత్త రేషన్ కార్డుల దిశగా కేంద్రం అడుగు
న్యూఢిల్లీ: ‘వన్ నేషన్–వన్ రేషన్ కార్డు’దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశమంతటా ఒకే రేషన్ కార్డు ఉండేలా కార్డులకు ఒక ప్రామాణిక ఆకృతిని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే సమయంలో వీటిని ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రేషన్ కార్డులపై రెండు భాషలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. ఒకటి ప్రాంతీయ భాష కాగా.. మరొకటి హిందీ లేదా ఇంగ్లిష్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. -
ఇక రేషన్ కూ ఆధార్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: ఇకపై రేషన్ దుకాణాల్లో సరుకులు పొందడానికి కూడా ఆధార్ తప్పనిసరి కానుంది. లబ్ధిదారులంతా తమ రేషన్ కార్డులను ఆధార్‌తో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆధార్ చట్టం కింద కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల విభాగం బుధవారం ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆధార్ కార్డు లేనివారు కొత్తగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 దాకా గడువిచ్చింది. అయితే ఆ తర్వాత ఆధార్ లేని వారికి సరుకులు ఇవ్వబోమని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. జూన్ 30 తర్వాత సరుకులు పొందాలంటే రేషన్ కార్డు, ఏదేనీ మరో గుర్తింపుకార్డు(ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, కిసాన్ ఖాతా పాస్‌బుక్, పోస్టల్ శాఖ ఇచ్చిన ఫొటోతో కూడిన అడ్రస్ కార్డు, అధికారిక లెటర్‌హెడ్‌పై గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు ధ్రువపత్రం, మొదలైనవి) ఆధార్‌కు దరఖాస్తు చేసినట్లుగా రుజువును కూడా చూపించాలంది. ఇప్పటిదాకా దేశంలో 72 శాతం రేషన్ కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం అయ్యాయనీ, రాష్ట్రాలు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నందున వేగం పెంచడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చామని ఆహార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.