స్వాధీనం చేసుకున్న ఆయిల్‌ను పోలీసులకు అప్పగించారు. ముందుగా అందిన సమాచారం మేరకు అధికారులు ఆకస్మికంగా ఫ్యాక్టరీకి చేరుకుని, ఆయిల్ టిన్నులను పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీలో గోల్డ్‌ప్లస్, గోల్డ్‌డ్రాప్ లేబుల్స్‌తో ఉన్న 15 లీటర్ల డబ్బాలు, ఒక లీటర్ నూనె ప్యాకెట్లు ఉన్న పెట్టెలను గుర్తించారు. గోల్డ్‌ప్లస్ డబ్బాల్లో ఆయిల్‌ను పరిశీలించారు. ఈ డబ్బాలపై అనుమతులు లేకుండా ఆగ్‌మార్క్ గుర్తు వేసినట్టు గుర్తించారు. రికార్డులు పరిశీలించగా, అసలు ఆగ్‌మార్క్ అనుమతులే లేవని తేల్చారు.
అనంతరం గోల్డ్‌ప్లస్ బ్రాండ్‌తో అమ్మకానికి సిద్ధం చేసిన డబ్బాల్లో నూనెను పరిశీలించారు. అయితే పైన లేబుల్ ఒకలా.. లోపల నూనె మరోలా ఉన్నట్టు గమనించారు. గోల్డ్‌ప్లస్ డబ్బాల్లో 80 శాతం పామాయిల్, 20 శాతం మాత్రమే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే వేరుశనగ నూనె లేబుల్‌తో ఉన్న డబ్బాల్లో కూడా 80 శాతం కాటన్ ఆయిల్, 20 శాతం మాత్రమే వేరుశనగ నూనె ఉన్నట్లు నిర్ధారించారు. లోహియా ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం, మేనేజర్ తదితరులపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.