
వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా దా డుల కారణంగా మన దేశానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ కారణంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరి గాయి. సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇ బ్బందులు పడ్డారు. పల్లి, సన్‌ఫ్లవర్, పామాయిల్ నూనెలను వంటలో ఎక్కువగా వినియోగిస్తారు.
ఈ నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో తక్కువగా ఉండటంతో పొరుగు దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దిగుమతులు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తు తం నెల రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా తగ్గడంతో సామాన్యులపై భారం తప్పింది.
గతంలో సన్‌ఫ్లవర్ నూనె లీటర్‌కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150కి చేరింది. పల్లి నూనె లీటర్‌కు రూ.220 పలుకగా రూ.165కి తగ్గింది. పామాయిల్ ధర లీటర్‌కు రూ.150 నుంచి రూ.95కు తగ్గింది. పామాయిల్‌న్ గతంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణా ల్లో తక్కువ ధరకు విక్రయించేవారు.
సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ నూనె సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతం నూనె ధరలు రూ.55 నుంచి రూ.60 వరకు తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు మళ్లీ పెరగకుండా చూడాలని కోరుతున్నారు.
చదవండి👉 చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
Comments
Please login to add a commentAdd a comment