Soyabean
-
భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు
-
Recipe: రుచికరమైన మీల్ మేకర్ – చికెన్ బాల్స్ తయారీ ఇలా!
టేస్టీ టేస్టీ మీల్ మేకర్ – చికెన్ బాల్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. కావలసినవి: ►మీల్ మేకర్ – 1 కప్పు (నానబెట్టి, కడిగి తురుములా చేసుకోవాలి) ►బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (మసాలా, ఉప్పు జోడించి కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి) ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరిగినవి) ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►శనగపిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, గరం మసాలా, కారం – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►ఉప్పు – తగినంత ►ఉల్లికాడ ముక్కలు – కొన్ని ►జీలకర్ర – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి – 2 ►అల్లం ముక్క – చిన్నది ►పాలు – 2 టేబుల్ స్పూన్లు ►నీళ్లు –తగినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా మీల్ మేకర్ తురుము, ఉడికిన చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు, అల్లం ముక్క అన్నీ మిక్సీలో వేసి కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి. ►ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►ఇందులో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, గరం మసాలా, కారం, తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో పాలు.. అవసరం అయితే నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం చిన్న చిన్న బాల్స్‌లా తయారుచేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని.. టొమాటో సాస్‌లో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Coconut Dream: కొబ్బరి తురుము, అరటి పండు గుజ్జుతో కోకోనట్ డ్రీమ్! గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే! పాలక్ దోసె, ఓట్స్ పాలక్ ఊతప్పం.. -
పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించినట్లు పేర్కొంది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ సుంకం తగ్గింపు తర్వాత పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ముడి రకాలపై కస్టమ్స్ సుంకం వరుసగా 8.25 శాతం, 5.5 శాతం, 5.5 శాతంగా ఉంటుంది. అంతేగాకుండా, శుద్ధి చేసిన రకాల పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామోలిన్, పామాయిల్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు. "పండుగ సీజన్లో అధిక ధరల కారణంగా ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించింది" అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివీ మెహతా తెలిపారు.(చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం) -
మిడతల దాణా మంచిదేనా?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్రికా దేశాలతోపాటు భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలు నేడు అనూహ్య సంఖ్యలో మిడతల దాడులను ఎదుర్కొంటున్నాయి. భారత్‌కన్నా ముందుగా మిడత దాడులను ఎదుర్కొన్న పాకిస్థాన్ వాటిని నిర్వీర్యం చేయడం కోసం మూడు లక్షల లీటర్ల క్రిమిసంహారక మందులను వాడడమే కాకుండా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో వాలిన మిడతలను కూలీల ద్వారా సేకరించి వాటిని కోడి దాణాగా మార్చి కోళ్ల ఫారమ్‌లకు పంపించింది. 45 శాతం ప్రొటీన్లు ఉండే సోయాబీన్ కిలో పాకిస్థాన్‌లో 90 రూపాయలు పలకుతుండగా, 70 శాతం ప్రొటీన్లు ఉండే మిడతలను కిలోకు 20 రూపాయలు చెల్లించి కూలీల ద్వారా సేకరించింది. మిడతలను కోడి దాణాకా మార్చేందుకు కిలోకు 30 రూపాయలు ఖర్చు అవుతుందని, సేకరణ ఖర్చుతో కలిపితో కోళ్ల ఫారాలకు కిలోకు 50 లేదా 55 రూపాయల చొప్పున సరఫరా చేయవచ్చని పాక్‌లోని ఓక్రా జిల్లోలో ఈ ప్రయోగం నిర్వహించిన ‘పాకిస్థాన్ అగ్రికల్చరల్ రిసర్చ్ కౌన్సిల్‌కు చెందిన బయోటెక్నాలజిస్ట్ జోహర్ అలీ తెలిపారు. మిడతలను చంపేందుకు క్రిమి సంహారక మందులను వాడినట్లయితే వాతావరణ కాలుష్యం పెరగుతుందని, వాటిని తిన్నట్లయితే మనుషులకూ ప్రమాదమని, వాటిని సేకరించి కోడి దాణాగా ఉపయోగించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవించిన పలువురు పర్యావరణ వేత్తలు భారత్ కూడా పాక్ అనుసరించిన కొత్త విధానాన్నే అనుసరించాలంటూ సూచనలు కూడా చేశారు. వాస్తవానికి ఇది కొత్తగా కనిపిస్తోన్న పాత విధానం. గతంలో రైతులు వ్యవసాయ బావుల వద్ద కోళ్లను, బాతులను పెంచేవారు. అవి మిడతలను ఎక్కువగా తిని బలంగా తయారయ్యేవి. ప్రకృతిసిద్ధంగా పిచ్చుకలు, కాకులు కూడా మిడతలను ఎక్కువగా తింటాయి. పిచ్చుకలు కనిపించడమే కష్టంకాగా కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పలు దేశాల ఆదిమ జాతులు కూడా మిడతలను తినేవి. ఇక్కడ క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో తాము ప్రయోగం చేసినట్లు జోహర్ అలీ తెలిపారు. క్రిమిసంహారక మందులు వాడుతున్న పొలాల సంగతి ఏమిటి? వాటిపై మిడతల దాడిని ఎలా ఆపాలి? భారత్‌లో 80 శాతాకిపైగా క్రిమిసంహారక మందులతో వ్యవసాయం జరుగుతోంది. పంటలపై చల్లే క్రిమి సంహారక మందుల ప్రభావం మిడతలపై ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మందులు వాడని పొలాలపై మాత్రమే తాము ప్రయోగం చేసినట్లు అలీ చెప్పారు. (ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు') మిడతల కోసం భారత వ్యవసాయదారులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని వదిలేయాలా? సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లండంటూ పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా పెద్దగా ఫలితాలు రాలేదు. మిడతలను నిర్మూలించేందుకు సాధారణంగా ‘ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైర్‌థ్రాయిడ్’ క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత విష పూరితమైనవి. వీటి ప్రభావం మిడతలపై చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని రుజువైంది. కనుక ఈ మందుల వల్ల చనిపోయిన మిడతలను మనుషులుగానీ పక్షులుగానీ తినకూడదు. తిన్నట్లయితే మనుషుల్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె చెడిపోయే అవకాశం, ఎముకలు పెలసవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనుషులెవరూ మిడతలను తినరాదంటూ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనుషులు లేదా జంతువులకు ఆహారంగా మిడతలు పనికి రావని దక్షిణ కొరియాలోని యాన్‌డాంగ్ నేషనల్ యూనివర్శిటీ, పోస్ట్ డాక్టోరల్ రిసర్చర్ జూస్ట్ వాన్ ఇట్టర్ బీక్ హెచ్చరిస్తున్నారు. (మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’) -
సోయాబీన్ విత్తన ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు సోయాబీన్ విత్తనాలను కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో క్వింటా సోయాబీన్ విత్తనాల ధర రూ.3,200లోపు ఉండగా బయట నుంచి రూ.5,500 కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి క్వింటా రూ.5,200 కొనుగోలు చేయాలని నిర్ణయిం చగా, ఎవరూ ముందుకు రావడం లేదంటూ దానిని రూ.5,500 పెంచినట్లు తెలిసింది. అవసరమైతే ఇంకా పెంచే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఫైల్‌ను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పం పింది. ఒకవేళ విత్తనాన్ని ప్రాసెస్ చేసినా రూ.3,800కు మించి ధర ఉండదంటున్నా రు. అధికధరకు కొనుగోలు చేస్తే ఆ మేరకు వ్యాపారులకు లాభం చేసినట్లు అవుతుంది. గత ఏడాది క్వింటా సోయాబీన్ విత్తనానికి రూ.5,475 నిర్ణయించగా ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 33.33 శాతంగా ఉంది. వ్యవసాయ శాఖ రూ.5,500కు కొనుగోలు చేస్తే రైతులతోపాటు ప్రభుత్వంపై కూడా భారం పడ నుంది. దీంతో విత్తన ధరలు పెంచే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే వానాకాలానికి 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా. 2015 వానాకాలంలో 6.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సోయాబీన్ సాగైతే, 2017 వానాకాలంలో 4.07 లక్షల ఎకరాలకు పడిపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి సోయా విత్తనాలను సేకరించే యోచనలో వ్యవసాయశాఖ ఉంది. -
సోయా.. సాగుకు సమయమిదే!
సోయా చిక్కుడుతో సిరులు అంతర పంటల్లోనూ అనుకూలమే యాజమాన్య పద్ధతులతో దిగుబడి మెలకువలు పాటిస్తే మరింత మేలు టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ టేక్మాల్: సోయా సాగు సమయమిదేనని, ఈ పంటతో రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ (9949968674) తెలిపారు. సోయా పంటను అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చునని ఆయన చెబుతున్నారు. సోయా చిక్కుడు ఇతర పప్పు ధాన్యాల పంటల కంటే అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా అత్యధిక శక్తిని చేకూర్చే పోషకాలను అందిస్తుందన్నారు. యాజమాన్య పద్ధతులతో పాటు మెలకువలు పాటిస్తే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందవచ్చునన్నారు. మోతాదుకి మించి ఎరువులను వాడకుండా సమయానుకూలంగా కలుపు నివారణ చేపట్టాలన్నారు. సోయా సాగు విధానంపై ఆయన రైతులకు అందించిన సలహా సూచనలు.. పంటకాలం: ఖరీఫ్‌లో జూన్, జులై నెలల్లో, రబీలో అక్టోబర్, వేసవిలో ఫిబ్రవరిలో సోయా పంటను సాగు చేయవచ్చు. రకాలు: పీకే–472, ఎంఏసీఎస్–58, ఎంఎస్సీఎస్–124, జేఎస్–335, ఎల్ఎస్బీ–335, ఎల్ఎస్బీ–1, ఎంఏసీఎస్–450, పీకే–1029 వంటి తదితర రకాలు అన్ని కాలాల్లో సాగుకు అనుకూలిస్తాయి. విత్తనం: ఎకరాకు 25–30 కిలోలు నాటాలి. విత్తన మోతాదు–గింజ పరిమాణం, మొలక శాతంపై ఆధారపడి ఉంటుంది. విత్తనశుద్ధి: ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల థైరమ్, 1 గ్రాము కార్బండజిమ్ లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ప్రతి 8–10 కిలోల విత్తనానికి 200 గ్రాముల మేర రైబోపియం జపానికం విధానంలో విత్తనశుద్ధి చేసి నీడలో ఆరబెట్టాలి. విత్తే దూరం: తేలిక భూముల్లో, నల్లరేగడి భూముల్లో 225 సెంటీమీటర్లు, చదరపు మీటరుకు 40 మొక్కల చొప్పున ఎకరాకు లక్షా అరవై వేల మొక్కలు ఉండాలి. ఎరువులు: ఎకరాకు 12 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, 8 కిలోల గంధకాన్ని చివరి దుక్కిలో వేయాలి. భాస్వరపు ఎరువును సూపర్‌ఫాస్పేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభ్యమవుతుంది. కలుపు నివారణ, అంతరకృషి: విత్తే ముందు ప్లుకోరాలిన్ 45 శాతం, ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30 శాతం 1.3 నుంచి 1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ, మరుసటి రోజున కానీ పిచికారి చేయాలి. విత్తిన 20–25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. విత్తిన 25 రోజులకు క్విజాలాపాప్ ఇథైల్ 5 శాతం 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసి గడ్డిజాతి మొక్కలను, ఇమజిథాపైర్ 10 శాతాన్ని 300 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసి వెడల్పాకు, గడ్డిజాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. అంతర పంటలు: సోయా చిక్కుడును కంది (1ః7), పత్తి, మొక్కొజొన్న (1ః1) ఇతర పండ్ల తోటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు. తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, ఆవాలు, మినుములు సాగుచేస్తే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయం పొందవచ్చు. సస్యరక్షణ– పురుగులు రసం పీల్చే పురుగులు: ఆకుల్లోని రసం పీల్చడం వలన ఆకులు పసుపు, గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. తామర పురుగుల ద్వారా మొవ్వుకుళ్లు, తెల్లదోమ ద్వారా మోజాయిక్ తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు మేర కలిపి పిచికారి చేయాలి. ఆకుముడత పురుగు: ఆకుల అంచులను కలిపి పత్రహరితాన్ని గీకి నష్టపరుస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లను కలిపి పిచికారి చేయాలి. సస్యరక్షణ–తెగుళ్లు ఆకుమచ్చ తెగులు: ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెట్ కలిపి 10 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండుసార్లు పిచికారి చేయాలి. కుంకుమ తెగులు: ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రదశలో తుప్పు రంగు పొడ ఏర్పడుతుంది. నివారణకు లీటరు నీటిలో 1 మిల్లీలీటరు హెక్సాకొనాజోల్ లేదా ప్రొపికొనాజోల్ కలిపి వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి 2–3 సార్లు పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు: ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు గోధుమ రంగులోకి మారతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 1.5 గ్రాముల పౌషామైసిన్+15 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపి 2–3 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. ఎల్ఎస్బీ–1, ఎంఏసీఎస్,–58, పీకే–472 రకాలు ఈ తెగులును అరికడతాయి. మోజాయిక్ తెగులు: తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఇది. దీనివల్ల మొక్క పసుపు రంగులోకి మారుతుంది. నివారణకు లీటరు నీటికి 1గ్రాము ఎసిఫేట్‌ను కలిపి 2–3 సార్లు పిచికారి చేసి తెగులు వ్యాప్తి చేసే పురుగును నివారించవచ్చు. మొవ్వుకుళ్లు తెగులు: తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఇది. ఇది సోకితే మొక్క మొవ్వు నుంచి ఎండిపోతుంది. తెగులును తట్టుకునే జేఎస్–335, పీకే–1029 రకాలను వాడాలి. చేనులో మొక్కల సాంద్రత సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కార్భసల్పాన్తో విత్తనశుద్ధి చేయాలి. ఇలా చేయడం ద్వారా తామర పురుగులను నివారించవచ్చు. -
సోయాకు సాయమేది?
- రాష్ట్ర రుణ ప్రణాళికలో ఊసే లేని సోయాబీన్ - వద్దు వద్దంటున్న పత్తికి ఏకంగా రూ.7 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: ‘పత్తి వద్దు.. సోయా ముద్దు..’ కొద్దిరోజులుగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలివీ! పత్తి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచినందున మున్ముందు ధరలు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ రైతులను అప్రమత్తం చేశారు. పత్తిని తగ్గించి సోయా వంటి పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్కారు చర్యలు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవు. పత్తి కంపెనీలకు ముకుతాడు వేసి సోయాను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 2016-17 రుణ ప్రణాళికలో పత్తికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రోత్సహించాలనుకుంటున్న సోయాబీన్‌ను విస్మరించారు. తగ్గించాలనుకుంటున్న పత్తికి ఏకంగా రూ.7వేల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుణ ప్రణాళికలో సోయా పంట ఊసే లేదు. జిల్లాల్లో వ్యవసాయాధికారులు చాలామంది పత్తి కంపెనీలతో కుమ్మక్కై సోయాబీన్‌ను నిరుత్సాహపరుస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సోయాబీన్ పంటను కేవలం మూడు నాలుగు జిల్లాల్లోనే ప్రధానంగా సాగు చేస్తుండగా.. మిగిలిన జిల్లాల్లో రైతులను ఒప్పించడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. రైతులకు 3.75 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించినా, ఇప్పుడు డిమాండ్ లేదని, 2లక్షల క్వింటాళ్లు సరఫరా చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. రెండింతల సాగు సాధ్యమేనా? 2015 ఖరీఫ్‌లో మొత్తం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా.. 88.82లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. అందులో పత్తి 42.22 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 10.57లక్షల ఎకరా ల్లో, సోయాబీన్ 6.35లక్షల ఎకరాల్లో సాగైం ది. మొత్తం పంటల సాగులో పత్తి సాగు విస్తీర్ణమే సగం వరకు ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈసారి పత్తి సాగు విస్తీర్ణాన్ని కనీసం 10 లక్షల ఎకరాలకుపైగా తగ్గించాలన్నది సర్కారు ఆలోచన. సోయాబీన్ గతేడాది 6.35 లక్షల ఎకరాల్లో సాగైతే ఈసారి దాదాపు 12 లక్షల ఎకరాల వరకు పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 3.75లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని నిర్ధారించింది. వద్దు.. వద్దంటూనే... ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లకు రూ.29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) తాజాగా నిర్ణయించిం ది. సాగు తగ్గించాలంటూనే పత్తి సాగు చేసే రైతులకు రూ.7,087కోట్ల రుణాలు ప్రతిపాదించారు. నూనె గింజల సాగుకు రూ.456 కోట్లతో సరిపెట్టారు. అందులో సోయాబీన్‌కు ఎంత మేరకు రుణాలు కేటాయించారన్న స్పష్టత కూడా లేదు. కాగా, పత్తిని వద్దని ప్రభుత్వం చెప్పగానే.. పత్తి విత్తన కంపెనీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. రేటు తగ్గించి పత్తిని ప్రోత్సహించేలా ప్రచారం చేస్తున్నాయి. ప్రకటనలకే పరిమితం సోయాబీన్ ప్రోత్సహించాలని చెబుతున్న ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. కిందిస్థాయిలో పత్తిని నిరుత్సాహపరిచే చర్యలు శూన్యం. పత్తిపై రైతుల్లో అసంతృప్తి ఉంది. కనీసం భూసార పరీక్షలు చేయకుండా సోయాబీన్‌ను ఎలా ప్రోత్సహిస్తారు? ఇప్పటివరకు సోయాబీన్ విత్తనాలను రైతుల వద్దకు తీసుకొని రాలేదు. - సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు అఖిల భారత రైతు సంఘం