Recipe: రుచికరమైన మీల్‌ మేకర్‌ – చికెన్‌ బాల్స్‌ తయారీ ఇలా! | Recipes In Telugu: How To Prepare Meal Maker Chicken Balls | Sakshi
Sakshi News home page

Recipe: రుచికరమైన మీల్‌ మేకర్‌ – చికెన్‌ బాల్స్‌ తయారీ ఇలా!

Published Mon, Dec 5 2022 2:33 PM | Last Updated on Mon, Dec 5 2022 3:11 PM

Recipes In Telugu: How To Prepare Meal Maker Chicken Balls - Sakshi

టేస్టీ టేస్టీ మీల్‌ మేకర్‌ – చికెన్‌ బాల్స్‌ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.
కావలసినవి:  
►మీల్‌ మేకర్‌ – 1 కప్పు (నానబెట్టి, కడిగి తురుములా చేసుకోవాలి)
►బోన్‌లెస్‌ చికెన్‌ – పావు కప్పు (మసాలా, ఉప్పు జోడించి కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి)
►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌ (చిన్నగా తరిగినవి)

►కొత్తిమీర తురుము – కొద్దిగా
►శనగపిండి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు
►బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, గరం మసాలా, కారం – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
►ఉప్పు – తగినంత

►ఉల్లికాడ ముక్కలు – కొన్ని
►జీలకర్ర – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి – 2
►అల్లం ముక్క – చిన్నది

►పాలు – 2 టేబుల్‌ స్పూన్లు
►నీళ్లు –తగినన్ని
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముందుగా మీల్‌ మేకర్‌ తురుము, ఉడికిన చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు, అల్లం ముక్క అన్నీ మిక్సీలో వేసి కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి.
►ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
►ఇందులో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, గరం మసాలా, కారం, తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి.
►అందులో పాలు.. అవసరం అయితే నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకోవాలి.
►అనంతరం చిన్న చిన్న బాల్స్‌లా తయారుచేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి.
►వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకుని.. టొమాటో సాస్‌లో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.

ఇవి కూడా ట్రై చేయండి: Coconut Dream: కొబ్బరి తురుము, అరటి పండు గుజ్జుతో కోకోనట్‌ డ్రీమ్‌!
గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉంటేనే! పాలక్‌ దోసె, ఓట్స్‌ పాలక్‌ ఊతప్పం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement