సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ పెంపును ప్రకటించింది. కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణ, చారిత్రక కనిష్టాలకు పడిపోతున్న రూపాయి విలువ నేపథ్యంలో 19 రకాల విలాస వస్తువులపై (నాన్ ఎసెన్షియల్) దిగుమతి సుంకాన్ని పెంచింది. ఈ పెంపు సెప్టెంబరు 27నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఈ సుంకంనుంచి బంగారం నుంచి మినహాయించడం విశేషం.
మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులు, విమాన ఇంధన ధరలపై సుంకాన్ని పెంచడం ఆయా రంగాలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో కుదేలవుతున్న విమానయాన పరిశ్రమ ఉపయోగించే టర్బైన్ ఆయిల్ దిగుమతులపై మొదటిసారి 5శాతం సుంకాన్ని విధించింది. అలాగే రానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీలు, ఫ్రీజ్, వాషిగ్‌మెషీన్లపై దిగుమతి సుంకం పెంపు సాధారణ కొనుగోలు దారులకు చేదువార్తే.
మెటల్ జ్యుయల్లరీ, సెమీ ప్రాసెస్డ్ డైమండ్స్,కొన్ని రకాల విలువైన రాళ్లపై 5శాతం నుంచి 7.5శాతానికి పెంపు
ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లు, టీవీలపై 10శాతం నుంచి 20 శాతం పెంపు
ప్లాస్టిక్ వస్తులపై10నుంచి 15శాతానికి పెంపు
సూట్‌కేసులపై 10 నుంచి 5శాతానికి పెంపు
ఏవియేషన్ టర్బైన్ ఆయిల్‌పై 5శాతం
రేడియల్ కారు టైర్లపై 10 నుంచి 15శాతానికి
ఫుట్‌వేర్‌పై 20 నుం 25 శాతానికి పెంపు
కిచెన్‌వేర్‌పై 10నుంచి 15శాతానికి పెంపు
షవర్ బాత్, సింక్లు, వాష్ బేసిన్, స్పీకర్లపై 10 శాతం నుండి 15 శాతం పెంపు
Comments
Please login to add a commentAdd a comment