బీజింగ్: అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే 128 వస్తువులపై చైనా తాజాగా దిగుమతి సుంకాలను విధించింది. అమెరికా నుంచి వచ్చే పందిమాంసం, పండ్లు తదితర ఉత్పత్తుల పై ఈ సుంకాలు విధించామని తెలిపింది. అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా తాము సుంకాలు విధిస్తున్నామని చైనా పేర్కొంది.
పండ్లు, సం బంధిత 120 ఉత్పత్తులపై 15%, పంది మాంసం, సంబంధిత 8 ఉత్పత్తులపై 25% చొప్పున సుంకాలను వేసినట్లు పేర్కొంది. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను సమర్థిస్తామని, అయితే తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం అమెరికా దిగుమతులపై సుంకాల రాయితీలను రద్దు చేస్తున్నామని చైనా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment