Tesla Car: టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను(ఈవీలు) పెద్ద ఎత్తున తగ్గించాలని కోరుతూ టెస్లా ఇంక్ భారత మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. దిగుమతి సుంకాలను తగ్గిస్తే డిమాండ్ పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని కొందరి నిపుణుల అభిప్రాయం. అయితే, స్థానికంగా ఉత్పత్తుల తయారిని పెంచే ప్రయత్నంలో భాగంగా అనేక పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులపై అధిక దిగుమతి పన్నులను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విధించింది. గతంలో కూడా ఇతర లగ్జరీ ఆటోమేకర్లు దిగుమతి చేసుకున్న కార్లపై పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
భారతదేశంలో ఈ ఏడాది నుంచి అమ్మకాలను ప్రారంభించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రిత్వ శాఖలకు, ప్రముఖ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ రాసిన లేఖలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతులపై ఫెడరల్ పన్నులను 40%కు తగ్గించడం సముచితంగా ఉంటుందని పేర్కొంది. టెస్లా యుఎస్ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర $40000 కంటే తక్కువగా ఉంది. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో మన దేశంలోని బెంగళూరులో స్థానికంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. భారత రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మార్చిలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో టెస్లా ఉత్పత్తి వ్యయం చైనాలో కంటే తక్కువగా ఉండేలా చూడటానికి భారతదేశం ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉందని, కానీ స్థానికంగా తయారు చేస్తే మాత్రమే అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment