న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడిదారుల భయాలను పోగొట్టడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) చెల్లింపుల వివాదాస్పద అంశాన్ని అత్యున్నత స్థాయి కమిటీ ఒకటి పరిశీలిస్తుందని, తగిన సూచనలు చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పేర్కొన్నారు. రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, మ్యాట్‌తో పాటు పన్నులకు సంబంధించి నెలకొన్న పలు వివాదాస్పద అంశాలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.
ఈ కమిటీకి లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏపీ షా నేతృత్వం వహిస్తారని కూడా వెల్లడించారు. కమిటీ చేసిన సూచనల ప్రకారం కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రూ. లక్ష దాటిన చెల్లింపుల విషయంలో పాన్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు.
మ్యాట్‌పై ఉన్నత స్థాయి కమిటీ: జైట్లీ
Published Fri, May 8 2015 1:54 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement